బయో డీజిల్ ట్యాంకర్ బోల్తా
చివ్వెంల(నల్లగొండ): నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం సమీపంలో సోమవారం ఉదయం బయో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపైనే పడిపోయింది.
ట్యాంకర్‌కు పగుళ్లు రావటంతో లీక్ అవుతున్న ఆయిల్‌ను చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి బిందెలు, బకెట్లు, డ్రమ్ముల్లో పట్టుకెళుతున్నారు. ట్యాంక్‌లో సుమారు రెండు వేల లీటర్ల ఆయిల్ ఉంటుందని చెబుతున్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ సంఘటన స్థలం నుంచి వెళ్లిపోయారు.