22 న ఏలూరులో వైఎస్ జగన్ యువభేరి
పశ్చిమగోదావరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22 న ఏలూరులో యువభేరి జరగనుంది. కాగా యువభేరి ఏర్పాట్లపై నియోజక వర్గ కన్వీనర్లతో పార్టీ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని సమావేశమయ్యారు. ఏపీకి హోదా ఇచ్చేవరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు. యువకులు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు బీజేపీ పెద్దలకు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మండిపడ్డారు. కేంద్ర సాయంతో సంతృప్తి చెంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పడం దారుణమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.