talaq notice (divorce)
-
విడాకులకు దారితీసిన కిడ్నీదానం! ఆరోగ్యానికి ప్రమాదమా?
శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు. అలాంటి మూత్రపిండాలను దానం చేసే విషయంలో చాలామందికి పలు సందేహాలు ఉన్నాయి. ఈ కిడ్నీ దానం చేసే విషయంలో చాలా మూర్ఖంగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడొక భర్త కూడా తన నమ్మి వచ్చిన భార్యను కిడ్నీ దానం చేసిందని విడాకులు ఇచ్చేశాడు. తన సోదరుడి గురించి కిడ్నీ దానం చేసిందని అతను ఇలాంటి దారణమైన పనికి పూనుకున్నాడు. కిడ్నీ దానం చేసినంత మాత్రాన వారిని ఇక ఎందుకు పనిరారని, రోగుల కింద ట్రీట్ చేయాల్సిన పనిలేదు. ఎందువల్ల ఈ కిడ్నీ దానం విషయంలో చాలామందికి చెడు అభిప్రాయాలే ఉన్నాయి. ఇంతకీ ఇది మంచిదా కాదా? ఇదివరకటిలా దాతలు జీవనం సాగించలేరా? తదితరాల గురించే ఈ కథనం!. ఈ కిడ్నీ దానం విషయంలో ఎంతలా చెడు అభిప్రాయం ఉందంటే.. ఉత్తరప్రదేశంలో ఈ విషయం గురించి ఓ జంట కాపురంలో చిచ్చు రేగింది. ఏకంగా విడాకుల వరకు దారితీసింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో బైరియాహి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ మహిళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. భార్య ఉత్తరప్రదేశ్‌లోని బైరియాహి గ్రామంలో ఉంటోంది. తన సోదరుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుండంతో అతనికి కిడ్నీ దానం చేసింది ఆ మహిళ. ఐతే ఆమె ఈ విషయాన్ని భర్తకు కూడా తెలిపింది. అంతే వెంటనే ఆమె భర్త వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతడిపై కేసు నమోదు చేసింది. ఇలాంటి అమానుష ఘటనలు చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. చాలామంది దీన్ని తీవ్రంగా పరిగిణించటానికి ప్రధానం కారణం ఆ విషయంపై ఉన్న అపోహలే. కీడ్నీ దానం ప్రాముఖ్యత.. ఒక కిడ్నీ ఉన్న చాలా మంది రెండు కిడ్నీలు బాగా పనిచేసే వారిలాగే జీవితాన్ని గడపగలరు. అలాగే దాతలకు కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉండదు. కిడ్నీని దానం చేసే స్త్రీలు ఇప్పటికీ గర్భం దాల్చవచ్చు. సురక్షితమైన ప్రసవం పొందగలరు. దెబ్బతిన్న రెండు కిడ్నీల కంటే ఒక ఆరోగ్యకరమైన కిడ్నీ చాలా మెరుగ్గా పని చేస్తుంది. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండి, ఆరోగ్యకరమైన మూత్రపిండాలను కలిగి ఉంటే..కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్‌కు దానం చేసేందుకు ముందుక రావొచ్చు. దీనివల్ల వారి జీవన నాణ్యతను పెంచినవారవుతారు. డయాలిసిస్ చేయించుకోవాల్సిన బాధకరపరిస్థితిని తప్పించిన వారవుతారు. అలాగే దాత కిడ్నీ సర్జరీ తాలుకా మచ్చలు పోవడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఇక్కడ సర్జరీ చేసిన విధానం, శరీరం తీరుపైనే ఆధారపడి ఉంటుంది. దీని వల్ల దుష్ప్రభావాలు వ్యక్తి జీవనశైలి ఆధారంగానే ఉంటాయో తప్ప ప్రత్యేకంగా కాదు. ఆరోగ్యకరమైన రీతిలో జీవనశైలి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. దాత తదుపరి ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నిపుణులను అడిగి తెలుసకుని పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇది దారమైన పని కాదు. ఓ వ్యక్తి బతకగలిగే అవకాశం ఇవ్వడం లేదా ప్రాణం పోసిన దానితో సమానం. (చదవండి: కరోనా కొత్త వేరియంట్ కేసుల ఉధృతి!..మరో బూస్టర్ షాట్ అవసరమా..?) -
తలాక్‌లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఇస్లాంలో తలాక్–ఎ–కినయా, తలాక్–ఎ–బెయిన్తో పాటు అన్నిరకాల విడాకులనూ రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులు జారీ చేసింది. కర్నాటకకు చెందిన సయేదా అంబ్రీన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ జె.బి.పార్డీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇదీ చదవండి: కొలీజియంలో విభేదాలు! -
పెళ్లి అయిన రెండు నెలలకే..
చిత్తూరు(మదనపల్లె క్రైం): పెళ్లి అయిన రెండు నెలలకే ఓ వ్యక్తి కట్టుకున్న భార్యకు తీరని మోసం చేశాడు. అభం శుభం తెలియని ఇళ్లాలిని పుట్టినింటికి పంపేసి, ఆ తర్వాత చెప్పాపెట్టకుండా సౌదీకి వెళ్లిపోయాడు. ఏడాది గడుస్తున్నా అతని ఆచూకీ తెలియడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు తనకు భార్య అవసరం లేదంటూ లాయర్ ద్వారా ఓ తలాక్ పంపి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కూతురు జీవితం బాగుండాలని ఓ ఆటోవాలా ఆస్తులమ్మి మరీ కూతురు పెళ్లి చేశారు. తలాక్ నోటీసులు పంపడంతో చివరకు ఆ యువతి తనకు చావే మార్గమని ఆత్మహత్యాయత్నంకు పాల్పడటంతో తల్లి తండ్రులు గమనించి ఆయువతిని రక్షించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రూరల్ ఎస్ఐ సునీల్‌కుమార్, బాధితురాలి తల్లి తండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బసిని కొండ పుంగనూరు రోడ్డు జన్మభూమి కాలనీకి చెందిన ఆటోవాలా ఎస్ఏ రషీద్, ఆయిషాల దంపతుల కుమార్తె సైదా సుల్తానా(20). డిగ్రీ చదువుతున్న సమయంలో ఆ యువతి తల్లి తండ్రులు కలికిరి మండలం పలవలి గ్రామం గడికి చెందిన కలకడ జహీరుద్దీన్, బీబీజాన్ల కుమారుడు మౌలా అహమ్మద్(28)తో గత ఏడాది డిసెంబర్ 19న మదనపల్లె టౌన్ హాలులో సుమారు రూ.నాలుగు లక్షలు ఖర్చుచేసి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత మౌలా అహమ్మద్ రెండు నెలలు కూడా భార్యతో కలసి జీవించ కుండానే భార్యను మోసగించి సౌదీకి వెళ్లి పోయాడు. భర్తకోసం అత్తమామలను నిలదీసిన సైదా సుల్లానాకు వేధింపులు, ఛీదరింపులు ఎదురైయ్యాయి. సుల్తానా చేసేది ఏమీలే అత్తగారి ఇంట్లో ఉండలేక ఏడు నెలల క్రితం పుట్టింటికి చేరుకుంది. అదే అదనుగా భావించిన సైదా సుల్తానా భర్త, అత్తమామలు బావలు కలసి ఓ లాయర్ సహాయంతో సైదా సుల్తానా తలాక్ పంపించారు. మోసపోయానని భావించి ఆ యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని రూరల్ పోలీసులను ఆశ్రయించడంతో ఎస్ఐ సునీల్ కుమార్ సయ్యద్ మౌలా అహ్మద్ అతని తల్లి తండ్రులపై 498ఏ, ఛీటింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. -
గర్భవతికి విడాకులు ఇస్తానన్న సాఫ్ట్ వేర్ భర్త!
న్యూఢిల్లీ: నల్లగా ఉందన్న వంకతో.. గర్భవతి అయిన తన భార్య నుంచి విడాకులు కావాలంటూ ఆమెకే ఈమెయిల్ చేశాడో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతగాడి వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చిన భార్య.. నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంషెడ్‌పూర్‌కు చెందిన యువతి(26) నోయిడాలోని ఓ ఫార్మాసూటికల్ కంపెనీలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమెకు బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్(35) తో ఈ ఏడాది మొదట్లో పెళ్లయింది. పెళ్లయిన రోజు నుంచే నల్లగా ఉన్నావంటూ తనను తిట్టేవాడని ఆమె తెలిపింది. తాను గర్భవతినని భర్తకు ఈనెల 5న భర్తకు చెప్పింది. నాలుగు రోజుల తర్వాత.. ఇక కాపురం చేయలేనని, విడాకులు కావాలని అతడు భార్యకు ఈమెయిల్ చేశాడు. దాంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ యువతి.. మంగళవారం తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. తొలుత మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి,ఆ అక్కడ తన ఫిర్యాదు తిరస్కరించడంతో వేరే స్టేషన్‌కు వచ్చినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను శారీరకంగా వేధించేవాడని, పలుమార్లు అసభ్య పదజాలంతో దూషించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లికి ముందు తనను భర్త కుటుంబీకులు చూశారని, వాళ్లకు ఇష్టం లేకపోతే తనతో పెళ్లికి ఎందుకు ఒప్పుకొన్నారని ప్రశ్నిస్తోంది. జంషేడ్ పూర్లో పెళ్లి జరిగిన తర్వాత బెంగళూరులో భర్త వద్ద అక్టోబర్ వరకు ఉంది. నవంబర్ నెలలో మళ్లీ ఉద్యోగంలో చేరానని, గర్భవతినని తెలిసిన తర్వాత భర్త ఇలా తనను మానసికంగా వేధిస్తున్నాడని కన్నీరు మున్నీరైంది. తన భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిని కప్పిపెట్టి తనతో వివాహం చేశారని అతడు ఆరోపించాడు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెబుతున్నాడు. కానీ, తమ కూతురికి కేవలం డస్ట్ ఎలర్జీ మాత్రమే ఉందని, అల్లుడు అనవసర రాద్దాంతం చేస్తున్నాడని తమ కూతురికి న్యాయం చేయాలని యువతి తల్లిదండ్రులు మంగళవారం గౌతమబుద్ధ నగర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం బయటపడింది.