విడాకులకు దారితీసిన కిడ్నీదానం! ఆరోగ్యానికి ప్రమాదమా? | UP Man Gave Triple Talaq To His Wife After She Donated A Kidney To Her Ailing Brother - Sakshi
Sakshi News home page

కిడ్నీ దానం చేస్తే ఆ వ్యక్తి ఇదివరకటిలా బతకడం కుదరదా? ప్రమాదమా!

Published Thu, Dec 21 2023 3:58 PM | Last Updated on Thu, Dec 21 2023 5:07 PM

Man Gave Triple Talaq To His Wife After She Donated A Kidney  - Sakshi

శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు. అలాంటి మూత్రపిండాలను దానం చేసే విషయంలో చాలామందికి పలు సందేహాలు ఉన్నాయి. ఈ కిడ్నీ దానం చేసే విషయంలో చాలా మూర్ఖంగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడొక భర్త కూడా తన నమ్మి వచ్చిన భార్యను కిడ్నీ దానం చేసిందని విడాకులు ఇచ్చేశాడు. తన సోదరుడి గురించి కిడ్నీ దానం చేసిందని అతను ఇలాంటి దారణమైన పనికి పూనుకున్నాడు. కిడ్నీ దానం చేసినంత మాత్రాన వారిని ఇక ఎందుకు పనిరారని, రోగుల కింద ట్రీట్‌ చేయాల్సిన పనిలేదు. ఎందువల్ల ఈ కిడ్నీ దానం విషయంలో చాలామందికి చెడు అభిప్రాయాలే ఉన్నాయి. ఇంతకీ ఇది మంచిదా కాదా? ఇదివరకటిలా దాతలు జీవనం సాగించలేరా? తదితరాల గురించే ఈ కథనం!.

ఈ కిడ్నీ దానం విషయంలో ఎంతలా చెడు అభిప్రాయం ఉందంటే.. ఉత్తరప్రదేశంలో ఈ విషయం గురించి ఓ జంట కాపురంలో చిచ్చు రేగింది. ఏకంగా విడాకుల వరకు దారితీసింది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్‌లో బైరియాహి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ మహిళ భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. భార్య ఉత్తరప్రదేశ్‌లోని బైరియాహి గ్రామంలో ఉంటోంది.

తన సోదరుడు కిడ్నీ సమస్యతో బాధపడుతుండంతో అతనికి కిడ్నీ దానం చేసింది ఆ మహిళ. ఐతే ఆమె ఈ విషయాన్ని భర్తకు కూడా తెలిపింది. అంతే వెంటనే ఆమె భర్త వాట్సాప్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతడిపై కేసు నమోదు చేసింది. ఇలాంటి అమానుష ఘటనలు చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. చాలామంది దీన్ని తీవ్రంగా పరిగిణించటానికి ప్రధానం కారణం ఆ విషయంపై ఉన్న అపోహలే.

కీడ్నీ దానం ప్రాముఖ్యత..

  • ఒక కిడ్నీ ఉన్న చాలా మంది రెండు కిడ్నీలు బాగా పనిచేసే వారిలాగే జీవితాన్ని గడపగలరు. అలాగే దాతలకు  కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉండదు. కిడ్నీని దానం చేసే స్త్రీలు ఇప్పటికీ గర్భం దాల్చవచ్చు. సురక్షితమైన ప్రసవం పొందగలరు. 
  • దెబ్బతిన్న రెండు కిడ్నీల కంటే ఒక ఆరోగ్యకరమైన కిడ్నీ చాలా మెరుగ్గా పని చేస్తుంది. 
  • 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండి, ఆరోగ్యకరమైన మూత్రపిండాలను కలిగి ఉంటే..కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్‌కు దానం చేసేందుకు ముందుక రావొచ్చు. దీనివల్ల వారి జీవన నాణ్యతను పెంచినవారవుతారు. డయాలిసిస్‌ చేయించుకోవాల్సిన బాధకరపరిస్థితిని తప్పించిన వారవుతారు. 
  • అలాగే దాత కిడ్నీ సర్జరీ తాలుకా మచ్చలు పోవడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఇక్కడ సర్జరీ చేసిన విధానం, శరీరం తీరుపైనే ఆధారపడి ఉంటుంది. 
  • దీని వల్ల దుష్ప్రభావాలు వ్యక్తి జీవనశైలి ఆధారంగానే ఉంటాయో తప్ప ప్రత్యేకంగా కాదు. ఆరోగ్యకరమైన రీతిలో జీవనశైలి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండవు. 
  • దాత తదుపరి ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నిపుణులను అడిగి తెలుసకుని పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇది దారమైన పని కాదు. ఓ వ్యక్తి బతకగలిగే అవకాశం ఇవ్వడం లేదా ప్రాణం పోసిన దానితో సమానం. 

(చదవండి: కరోనా కొత్త వేరియంట్‌ కేసుల ఉధృతి!..మరో బూస్టర్‌ షాట్‌ అవసరమా..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement