talented persons
-
ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్!
కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అందరితో పంచుకుంది. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.స్పందనల వెల్లువఅనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. – న్యూఢిల్లీ -
వాళ్లు టాలెంటెడ్.. భారత్‌పై మరోసారి పుతిన్ ప్రశంసలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా భారతీయులపై ప్రశంసలు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని అన్నారు. భారతీయుల్లో అపార నైపుణ్య శక్తి ఉందని, అందులో ఏ అనుమానం లేదని అన్నారు. వీరు అభివృద్ధి పరంగా అత్యుత్తమ ఫలితాలను సాధించగల సమర్ధులని వ్యాఖ్యానించారు. నవంబర్ 4న రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. ‘ఒకసారి భారత్‌ను చూడండి. దేశ అభివృద్ధి కోసం పాటుపాడే ఎంతో మంది ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. అభివృద్ధి విషయంలో భారత్ కచ్చితంగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ దేశంలో దాదాపు 150 కోట్ల మందితో భారత్ ఇప్పుడు సమర్థవంతమైన దేశంగా ఉంది’ అంటూ కొనియాడారు. ఇండియాలాగే రష్యాకు విశిష్ట నాగరికత, సంస్కృతి ఉందని తెలిపారు. అయితే దేశంలో యూరోపియన్ సంస్కృతి కూడా ముడిపడి ఉందని తెలిపారు. చదవండి: ఉభయ కొరియాల మధ్య...ఉద్రిక్తతలు మరింత తీవ్రం కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌పై ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవలి కాలంలో వరుసగా ప్రశంసలు కురిపిస్తున్నారు. వారం రోజుల క్రితం ప్రధాని మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మోదీ నిజమైన దేశభక్తుడని, ఆయన సారథ్యంలో భారత్ చాలా పురోగతి సాధించిందని కొనియాడారు. చదవండి: ట్విటర్ డీల్: మస్క్‌పై ధ్వజమెత్తిన అమెరికా అధ్యక్షుడు -
గ్రామీణ మేధస్సుకు నిరాదరణే విఘాతం
భారతీయ సివిల్ సర్వీసుల తుది ఫలితాలు వెలువడగానే అంతిమవిజేతలకు, ర్యాంకర్లకు ప్రత్యేక అభినందన సభల ఏర్పాటు, మీడియాలో వారి విజయగాథల ప్రసారం వంటి నూతన ధోరణులు చోటుచేసుకోవడం అభినందనీయమే. 2017 సివిల్ సర్వీసుల తుది ఫలితాలలో ప్రథముడిగా నిలిచిన తెలంగాణ అబ్యర్థిని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. పరీక్షలో తెలంగాణ ప్రతిష్టను నిలబెట్టినట్లే విధి నిర్వహణలో కూడా రాష్ట్ర ప్రత్యేకతను చాటాలని అతనికి సూచించారు. సివిల్ సర్వీసుల పరీక్షలు రాసే తెలంగాణ అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను స్థాపించాలని, ఇంటర్వ్యూకు వెళ్లేవారికోసం నిపుణులచే శిక్షణ ఇప్పించాలని కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అమలైతే ఇదొక ఆదర్శవంతమైన కార్యక్రమం అవుతుంది. అయితే వర్తమానంలో మన సివిల్ సర్వీసు వ్యవస్థ నడుస్తున్న వాస్తవ తీరును కూడా విశ్లేషించాలి. సివిల్ సర్వెంట్లు ఏయే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు, వారేం సాధించారనే పురోగతికి సంబంధించిన సూదిమొనంత సమాచారం కూడా ప్రజలకు అందలేదు. ఉన్నతోద్యోగుల నిబ ద్ధతతో పాటు వారు వృత్తిగతంగా సాధించిన విజ యాలను కూడా ప్రజలకు తెలియచేయకపోతే సివిల్ సర్వీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశముంది. ఐఏఎస్ సాధించాలనే ప్రయత్నంలో ఒక ఐపీఎస్ ట్రెయినీ అవినీతికీ పాల్పడుతూ పరీక్షల్లో రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడ్డ ఇటీవలి సంఘటన సివిల్ సర్వీసుల ఎంపిక నిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది. ఏ కొద్దిమందినో మినహాయిస్తే ఎక్కువశాతం అభ్యర్థులు ప్రోత్సాహక పరిసరాలు, వనరుల పరిపుష్టి, పరీక్ష పట్ల స్పష్టమైన అవగాహనం ఉన్నవారు మాత్రమే సివిల్ సర్వీసుల్లో విజయం సాధిస్తున్నారు. ప్రైవేట్ విద్యాలయాలు, కార్పొరేట్ కళాశాలలు, ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో చదివి, సమస్యలు బాధ్యతలు లేని ప్రేరణాత్మక వాతావరణానికి నోచుకున్న వారికి మాత్రమే సివిల్ సర్వీసుల్లో ప్రవేశం సాధ్యపడుతోంది. కానీ విజేతలవుతున్న గ్రామీణ అభ్యర్థులు చాలా కొద్దిమందే. వారు కూడా తమ ఊళ్లనుండి వసతులు లభ్యమవుతున్న ప్రదేశాలకు తరలి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సిలబస్‌లోని ప్రతి అంశానికి సంబంధించిన విస్తృత సమాచారం, అవగాహన, పరీక్షలో సమాధానాలను ప్రభావవంతంగా రాయగల నేర్పు, లక్ష్యాత్మకంగా అలవర్చుకున్న మానవీయ వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూలో ప్రదర్శించే ప్రతిభ వంటి నైపుణ్యాలన్నీ నూరు శాతం గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థుల్లో కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఐతే ప్రోత్సాహక వాతావరణ లేమి, అహగాహనా రాహిత్యం, ఆర్థిక పరిమితులు, సాధనాత్మక ప్రేరణ కొదువల కారణంగా గ్రామీణ అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు నోచుకోవడం లేదు. దీంతో మన దేశంలో సివిల్ సర్వీసులకు సంబంధించి అందుబాటులో ఉన్న వసతుల తోడ్పాటుతో ఎంపికను సాధించి అవకాశాలను పొందుతున్న వారు, వసతులకు నోచుకోక అవకాశాలను కోల్పోతున్న వారనే రెండు వర్గాలు పుట్టుకొచ్చి సంఘర్షణాత్మక అగాథం ఏర్పుడుతోంది. సివిల్ సర్వీసుల్లలో ప్రవేశానికి గ్రామీణ అభ్యర్థులకు ఇవ్వాల్సిన చేయూతను ఒక మహా యజ్ఞంలా కొనసాగించాలి. 2017 సివిల్ సర్వీసుల పరీక్షలో తొలి 25 ర్యాంకులను సాధిం చివారు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, విశ్వవిద్యాల యాల్లో చదివారు. అయినప్పటికీ 9 మంది ఫిజి కల్లీ ఛాలెంజెడ్, 8 మంది విజువల్లీ ఛాలెంజ్డ్, 12 మంది వినికిడి సమస్య ఉన్న అభ్యర్థులు కూడా ఈసారి విజేతల్లో ఉన్నారనే వాస్తవం తెలిస్తే ఎవరిలోనైనా విశ్వాసం ఉబికి వస్తుంది. కాబట్టి తెలంగాణ సీఎం ప్రతిపాదించిన శిక్షణను కేవలం ఇంటర్వ్యూ అభ్యర్థులకే కాకుండా అన్ని స్థాయిల్లో ఇవ్వాలి. ప్రభుత్వం, విద్యాసంస్థలు దీక్షబూని గ్రామీణ విద్యార్థులకు కూడా సివిల్ సర్వీసుల్లో ఎంపికయ్యేలా శిక్షణ నిస్తే పరిపాలనలో పల్లెటూళ్ల ప్రతిభ మెరుస్తుంది. గ్రామీణ భారతావని పులకరిస్తుంది. వంగీపురం శ్రీనివాసాచారి, ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ (మొబైల్ : 99480 90051) -
వెబ్సైట్లోకి ‘ప్రతిభా’వంతుల వివరాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : మార్చి–16 పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభా అవార్డులకు ఎంపికైన జిల్లాలోని 378 మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంటు తదితర వివరాలు ఈనెల 10లోగా నమోదు చేయాలని డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు. ఈ బాధ్యతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలన్నారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అవార్డు నగదు జమ కాదన్నారు.