పీఎస్లో తన్నుకున్న 'తమ్ముళ్లు'
కడప: వైఎస్ఆర్ జిల్లాలో తెలుగుతమ్ముళ్ల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. జిల్లాలోని తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్స్టేషన్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. నీరు - చెట్టు కాంట్రాక్ట్ విషయంలో రెండు వర్గాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు 10 మంది గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి... వైద్య చికిత్స అందిస్తున్నారు.