Tamil Nadu Minister
-
మంత్రులూ... అవేం మాటలు?
చెన్నై: అధికారంలో ఉన్నవారిలో సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచి్చంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెపె్టంబర్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. ‘సనాతన ధర్మ నిర్మూలన’పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంటరానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు తలంటింది. మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి స్టవిస్ జి.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజంలో మరింత చీలిక తేవడమే కాదా?’’అని ప్రశ్నించారు. మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా?’’అన్నారు. నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా: ఉదయనిధి చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ అంశంపై న్యాయ వివాదం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ‘సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిది. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దాన్ని నిర్మూలించాలి‘ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమారానికి దారితీయడం తెలిసిందే. అణగారిన, పీడిత వర్గాల తరఫున తనలా మాట్లాడానని ఆయన సోమవారం చెప్పుకొచ్చారు. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి గొప్ప నేతలు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. -
వాళ్ల నాలుక చీరేయాలి.. కళ్లు పెరికేయాలి: కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
జైపూర్: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి, కనుగుడ్లు పెరికివేయాలంటూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గత వారం రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మంత్రి మాట్లాడారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ.. ‘ఇటువంటి సవాళ్లను మనం ఎదుర్కోవాలి. సనాతన్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారి నాలుక చీరేయాలి. వారి కళ్లు పెరికివేయాలి. సనాతనధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మన చరిత్ర, సంస్కృతులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వారికి అధికారం, పదవులు దక్కనివ్వరాదు’అని పేర్కొన్నారు. హిందూయిజంతో ప్రపంచానికే ప్రమాదం: రాజా చెన్నై: హిందూమతంపై తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. ఇటీవల సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఆ పార్టీకే చెందిన ఎంపీ ఎ.రాజా హిందూమతాన్ని హెచ్ఐవీ, కుష్టు వ్యాధితో పోల్చారు. తాజాగా ఎంపీ రాజా మరోసారి హిందూమతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న వీడియోను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా విడుదల చేశారు. ‘కులమనే ప్రపంచ వ్యాధికి హిందూమతానిదే బాధ్యత. భారత్ కులం ఆధారంగా ప్రజలను విడదీస్తోంది. సామాజిక అస్థిరత, ఆర్థిక అసమానతలను సృష్టించేందుకు కులాన్ని వాడుకున్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు హిందూయిజం పేరుతో కులాన్ని వ్యాప్తి చేస్తున్నారు. భారత్‌కే కాదు, ప్రపంచానికే హిందూమతం ప్రమాదకరం’అని ఆయన అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. చదవండి: ప్రధాని మోదీకి ఖలిస్తానీ నేత హెచ్చరిక -
‘పొన్నియన్ సెల్వన్ చూసి మణిరత్నంకి ఇంట్లోనే సెల్యూట్ చేశా’
దర్శకుడు మణిరత్నం 25 ఏళ్ల కల నిజం చేసిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ఇదే పేరుతో ల్కీ రాసిన నవలçను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఇందులో నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, నటి ఐశ్వర్యరాయ్, త్రిష వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి లైకా ఫిలింస్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం మొదటి భాగం గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా రెండవ భాగం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో భారీఎత్తున నిర్వహించారు. తమిళనాడు మంత్రి దురైమరుగన్, విశ్వనటుడు కమలహాసన్, నటి ఐశ్వర్యరాయ్, దర్శకుడు భారతీరాజా, సంచలన నటుడు శింబు, నటి కుష్బూ, సుహాసిని మణిరత్నం, శోభన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై మంత్రి దరైమురుగన్ మాట్లాడుతూ ఒక ఛారిత్రక కథను చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా రూపొందించిన అందరికీ ధన్యవాదాలన్నారు. ఈ చిత్రం చూసిన తరువాత దర్శకుడు మణిరత్నానికి ఇంట్లోనే సెల్యూట్ చేశానన్నారు. వాద్ధియదేవన్ పాత్రలో నటుడు కార్తీ చాలా బాగా నటించారని, తన నియోజక వర్గం పరిధిలోనిదే వాద్ధియదేవన్ ఊర్ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. -
వారసత్వ ముద్రను పనితీరుతో తొలగిస్తా: ఉదయనిధి
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్(45) బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణంచేశారు. చపాక్–తిరువళ్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని డీఎంకే వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో చెన్నైలో గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆర్ఎన్ రవి ఈయన చేత మంత్రిగా ప్రమాణంచేయించారు. పార్టీలో యువజన విభాగం కార్యదర్శి అయిన ఈయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను డీఎంకే సర్కార్ కేటాయించింది. కుటుంబ రాజకీయాలను విమర్శించే వారికి తన అద్భుత పనితీరు ద్వారా సమాధానం చెప్తానని ఈ సందర్భంగా ఉదయనిధి వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రాన్ని దేశానికే క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇదీ చదవండి: Gujarat Election 2022: గుజరాత్ ఓటేసిందిలా... -
డీఎంకే మంత్రి అనిత’కు ఈడీ షాక్!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే హయాంలో చేసిన తప్పులు.. ప్రస్తుత డీఎంకే మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్‌ను వెంటాడుతున్నాయి. ఆయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఆస్తులను అటాచ్ చేస్తూ శనివారం ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లాలో తన కంటూ వ్యక్తిగత బలం కల్గిన నేత అనిత ఆర్ రాధాకృష్ణన్. అన్నాడీఎంకేలో కొన్నేళ్ల పాటూ ఆ జిల్లా కీలక నేతగా ఆయన చక్రం తిప్పారు. 2001 నుంచి 2006 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో పశుసంవర్థక, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలితతో విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్నా, చివరకు డీఎంకేలో చేరి ఓటమి ఎరుగని నేతగా తూత్తుకుడిలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం డీఎంకే అధికారంలోకి రావడంతో ఆయన మత్స్యశాఖ మంత్రి అయ్యారు. వెంటాడుతున్న ఈడీ.. 2001–2006 మధ్య కాలంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులను అనిత ఆర్ రాధాకృష్ణన్ గడించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు ఏడుగురిపై తొలుత ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే, మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. అయితే దశాబ్దం కాలం ఎలాంటి పురోగతి లేకుండా ఉన్న ఈకేసు.. ఇటీవల మళ్లీ తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వర్గాలు అక్రమ సంపాదనతో 160 ఎకరాల స్థలాన్ని ఆయన కొన్నట్లు తేల్చింది. అలాగే, మరో 18 చోట్ల కూడా స్థిర, చర ఆస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీంతో ఆ స్థలాలతో పాటుగా రూ. 6 కోట్ల మేరకు ఉన్న మరికొన్ని ఆస్తులను అటాచ్ చేస్తూ గతంలో ఈడీ వర్గాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ అనిత కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అయితే గత నెల మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు వైద్యనాథన్, జగదీశ్ చంద్ర నేతృత్వంలోని బెంచ్ ముందు స్టే ఎత్తి వేత కోసం ఈడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. అనిత తరపు న్యాయవాదులు తమ వాదనను కోర్టుకు వినిపించారు. అయితే, స్టేను ఎత్తి వేస్తున్నామని, ఈడీ విచారణకు ఆదేశిస్తున్నామని కోర్టు ప్రకటించడంతో అనితకు షాక్ తప్పలేదు. అస్సలే తూత్తుకుడి డీఎంకే రాజకీయాలు రచ్చకెక్కి ఉన్న నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు అనితను చిక్కుల్లో పడేశాయి.ఈ సమయంలో శనివారం ఈడీ మరో అడుగు ముందుకు వేసింది. ఆయనకు చెందిన రూ. 6.54 కోట్ల విలువైన 160 ఎకరాల స్థలం, మరో 18 ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. -
వైరల్: బూట్లు తడుస్తాయని పడవ దిగనన్న మంత్రి.. ‘సిగ్గుచేటు’
చెన్నై: అధికారంలోకి వచ్చాక రాజకీయ నాయకులపై బరువు, బాధ్యతలు పెరుగుతాయి. ప్రజలతో మమేకమై వారి అభివృద్ధి కోసం నిత్యం పోరాడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది నేతలకు మాత్రం గద్దె మీద కూర్చోవడంతో తమ పని అయిపోయింది అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. జనాలతో ఓట్లు వేయించుకొని వారికి సేవ చేయాల్సింది పోయి.. ప్రజలతో పనులు చేయించుకుంటారు. ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్ర మత్య్సకార శాఖామంత్రి అనితా రాధాకృష్ణన్ ఇటీవల సముద్రపు కోతను పరిశీలించేందుకు పాలవర్కడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రివర్యులు మత్స్యకారులో బోటు ఎక్కి కొంతదూరం సముద్రతీరంలో ప్రయాణించారు. జాలర్ల సమస్యలు తెలుసుకోడానికి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ కొంత దూరం పడవ ప్రయాణం చేశారు. అనంతరం నీళ్లలో అడుగుపెట్టి బోటు దిగడానికి ఇష్టపడలేదు. ఒకవేళ నీటిలో దిగితే తన ఖరీదైన బూట్లు, పంచె పాడవుతాయని భావించి అలాగే కూర్చున్నారు. దీంతో అక్కడున్న మత్స్యకారులు ఆయనను ఎత్తుకుని మోసుకెళ్లి నేలమీద దింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘మంత్రిని ఇలా ఎత్తుకు రావడం ఆయన అహంకారానికి నిదర్శనం. మంత్రి అయితే మాత్రం మరీ ఇంత అధికార గర్వమా, సిగ్గుచేటు. అతను మంత్రిగా ఉండటానికి తగినవాడు కాదు.ఈ ప్రవర్తన డీఎంకే పార్టీకి అవమానకరం.’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. TN's Fisheries Minister Anitha Radhakrishnan, who doesn't want to get his shoes wet, carried by a fisherman, reports @PramodMadhav6. Was at Palaverkadu to inspect effects of sea erosion. (via @polimernews) pic.twitter.com/uJ88rAdg5i — Shiv Aroor (@ShivAroor) July 8, 2021 -
అనర్హత ఎమ్మెల్యేలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు, విమర్శలకు కేంద్రబిందువైన రాష్ట్ర అటవీశాఖ మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ మరోసారి మాటల బాంబు పేల్చారు. ఈసారి ఏకంగా దివంగత ముఖ్యమంత్రి జయలలితపైనే విసిరారు. కోట్లు కొల్లగట్టిన జయలలిత ధనం దినకరన్ ద్వారా పొంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారని అనర్హత వేటుపడిన 18 మంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: దిండుగల్లులో సోమవారం రాత్రి జరిగిన కావేరి నదీ జలాల పోరాట విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హతవేటు కేసును విచారించిన ఇరువురు న్యాయమూర్తుల్లో చెల్లుతుందని ఒకరు, చెల్లదని ఒకరు తీర్పు చెప్పారు. కేసు మూడో న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. మూడో న్యాయమూర్తి సైతం వేటును సమర్థ్దిస్తే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఆ తరువాత ఫుల్‌బెంచ్‌కు మొరపెట్టుకోవచ్చు. ఈలోగా నాలుగైదు ఏళ్లు గడిచిపోతాయి. చివరి నిమిషంలో అప్పీలు పిటిషన్‌ను వెనక్కుతీసుకుంటామని వేటుపడిన ఎమ్మెల్యేల్లో ఒకరైన తంగతమిళ్‌సెల్వన్ ప్రకటిస్తారు. అంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైనదనే కదా. జయలలిత మరణం తరువాత పార్టీని రెండుగా చీల్చిన దినకరన్ వెంట 18 మంది ఎమ్మెల్యేలు నడవడం ద్రోహం. జయ వల్ల పార్టీ నుంచి తొలగించబడిన ద్రోహి దినకరన్. జయలలిత తన స్వేదం, రక్తాన్ని చిందించి, ఎంతోధనం ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలందరినీ గెలిపించింది. ఈ 18 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీ నాశనం కాదు. వివాదాస్పద వ్యాఖ్యలు: జయలలిత చలువతో కోట్లు గడించిన దినకరన్ నుంచి భారీస్థాయిలో ఆర్థిక లబ్ధి పొంది ఎన్నికల్లో గెలుపొందిన 18 మంది ఎమ్మెల్యేలు తమ సొంత పార్టీ ప్రభుత్వాన్నే కూలదోసేందుకు కుట్రపన్నుతున్నారు. వేటు పుణ్యమాన్ని మైసూరు, అమెరికాల్లో విహారయాత్ర చేçస్తుంటే చూస్తూ ఊరుకోలేమని ఆయన అన్నారు. జయలలితను అడ్డుపెట్టుకుని దినకరన్ కోట్లు గడించాడని దిండుగల్లు చేసిన విమర్శలతో వేదికపై ఉన్న నేతలు హడలిపోయారు. అమ్మ అభిమానుల్లో కంగారుపుట్టించాయి. అన్నాడీఎంకే మంత్రుల్లో అమ్మ గురించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎవ్వరూ చేయలేదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దిండుగల్లుకు కొత్తేమీ కాదు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జయలలిత ఇడ్లీ, చట్నీ తిన్నట్లుగా అప్పట్లో మేము చెప్పిన మాటలు అన్నీ అబద్దాలని గతంలో వ్యాఖ్యానించారు. అలాగే, డబ్బు లేకుండా ఎన్నికల్లో ఏమీ చేయలేమని మరోసారి అన్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం భారత ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి డెంగీ నివారణ చర్యలపై చర్చలు జరిపారని ఒక సందర్భంలో దిండుగల్లు మాట్లాడటంతో ప్రధాని ఎవరో కూడా ఈ మంత్రికి తెలియదని సామాజిక మాధ్యమాల్లో చలోక్తులు విసిరారు. దీంతో బహిరంగసభల్లో దిండుగల్లు ప్రసంగించకుండా పార్టీ దూరం పెట్టింది. అయితే కొంత విరామం తరువాత సోమవారం రాత్రి వేదికనెక్కిన దిండుగల్లు మరోసారి దివంగత జయలలితపై అక్రమార్జన మాటల బాంబును విసిరారు. వివాదాస్పదమైన మంత్రి దిండుగల్లు మాటలపై అన్నాడీఎంకే నేతలు లోలోన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా బహిరంగంగా ఎవ్వరూ ఖండించలేదు. -
అన్నాడీఎంకే పార్టీలో స్లీపర్ సెల్స్ కలకలం
-
'శశికళకు భయపడే అందరం అబద్దం చెప్పాం'
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆస్పత్రిలో జయలలితను కలుసుకునే అవకాశం కలిగి ఉంటే తాను ఎలా చంపబడుతున్నానో ఆమె తమకు చెప్పి ఉండేవారని తమిళనాడు మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మ కోలుకుంటోంది అంటూ శశికళకు భయపడి అందరం అబద్ధాలు చెప్పాం. దయచేసి క్షమించండి’ అని ప్రజలను వేడుకున్నారు. అన్నాదురై జయంతి సందర్భంగా మదురై పళంగానత్తంలో శుక్రవారం రాత్రి జరిగిన సభలో మంత్రి ప్రసంగిస్తూ... అనారోగ్యానికి గురైన జయలలితకు మందులు ఇవ్వకుండా ఆస్పత్రిలో పడవేశారని వెల్లడించారు. ‘‘ప్రజలారా నన్ను క్షమించండి.. చికిత్స సమయంలో జయలలిత ఇడ్లీ, చట్నీ తిన్నట్లుగా మేం చెప్పినదంతా అబద్ధం, పార్టీ రహస్యాలు బహిరంగ పరచకూడదనే ఉద్దేశంతో కలిసికట్టుగా అబద్ధాలు ఆడాం. కావాలంటే రాసిపెట్టుకోండి, ఈరోజు నేను చెప్పేది నిజం’’ అని చెప్పారు. శశికళకు భయపడి జయలలితకు చికిత్స విషయంలో అన్నీ అబద్ధాలాడమని తెలిపారు. జయలలిత ఉన్న రూంలోకి శశికళ, ఆమె కుటుంబీకులు మాత్రమే వెళ్లేవారని తెలిపారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్ ఉపా«ధ్యక్షులు రాహూల్‌గాంధీ, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ ఆస్పత్రికి వచ్చినపుడు అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, శశికళ కుటుంబీకులను మాత్రమే కలుసుకున్నార, జయలలితను చూసేందుకు వారికి అవకాశం ఇవ్వకుండా ఇన్ఫెక్షన్ సాకు చూపి అడ్డుకున్నారని వెల్లడించారు. సాధారణ వార్డు బాయ్ కూడా జయలలితను చూశాడనీ, మంత్రులుగా తాము చూడలేకపోయామని ఆయన వాపోయారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడిన అసాధారణ పరిస్థితుల్లో శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నామని చెప్పారు. అయితే అపోలో ఆసుపత్రిలో జయలలితకు అందిన చికిత్స వీడియోను విచారణ కమిషన్ ముందు విడుదల చేస్తామని టీటీవీ దినకరన్ శనివారం చెన్నైలో తెలిపారు. -
అమ్మాయిలకు మంత్రి వివాదాస్పద ప్రశ్నలు
తమిళనాడు క్రీడలు, యవజన సర్వీసుల శాఖ మంత్రి సుందర్ రాజ్.. విద్యార్థినుల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. జవాబులు చెప్పడానికి ఇబ్బందికరమైనటువంటి వివాదాస్పద ప్రశ్నలను మహిళా అథ్లెట్లను అడిగారు. సుందర్ రాజ్ ఇటీవల పుదుకొట్టాయ్లోని పాఠశాలను ఆకస్మింగా సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా అథ్లెట్లతో మంత్రి మాట్లాడారు. హాకీ క్రీడాకారిణులను ఉద్దేశించి మీకు తగినన్ని లోదుస్తులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్ని పతకాలు గెలిచారని అడిగిన మంత్రి ఆ తర్వాత ఏ పతకం కూడా గెలవకుంటే భోజనం ఎందుకు పెట్టాలని అన్నారు. మంత్రి మరో విద్యార్థిని.. 'నీవు బరువు పెరిగావా, లేదా? నీకు భోజనం కోసం రోజు 250 రూపాయలు ఇస్తున్నాం. కాలేజీ విద్యార్థులకు నెలకు 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. వారి కంటే మీకే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం. మీ భోజనం కోసం మాత్రమే ఇస్తున్నాం' అని అన్నారు. మరో విద్యార్థిని దగ్గరికి వెళ్లి.. హాస్టల్లో చేరిన తర్వాత పెద్దమనిషివి అయ్యావా? అని ప్రశ్నించారు. విద్యార్థులను మంత్రి ఇలా ప్రశ్నించడం దుమారం రేపింది. అయితే తాను ఇలాంటి ప్రశ్నలను విద్యార్థులను అడగలేదని, వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించానని మంత్రి చెప్పారు.