Target Olympic podium
-
టాప్స్ నుంచి రెజ్లర్ సాక్షి ఔట్
న్యూఢిల్లీ: తెలుగు తేజం, వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)కు దూరమయ్యాడు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్‌తో పాటు రాహుల్‌ని ఆ పథకం నుంచి భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తొలగించింది. రెజ్లర్ సాక్షి గత కొంతకాలంగా నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. గుంటూరుకు చెందిన వెంకట్ కూడా కొంతకాలంగా గాయం కారణంగా అంతర్జాతీయ టోరీ్నలకు దూరంగా ఉన్నాడు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ఒలింపిక్ విజేతలుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని తెచ్చారు. కోచింగ్, ఇతర వసతులతో పాటు టాప్స్‌లో ఉన్న క్రీడాకారులకు నెలకు రూ. 50 వేల చొప్పున ఆరి్థక సాయం అందజేస్తారు. క్రీడాకారులకు అండదండలు అం దించే ఈ పథకంలో కొత్తగా రెజ్లర్ రవి దహియాకు చోటు దక్కింది. అతను ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల కేటగిరీలో కాంస్యం గెలిచాడు. ఆ ఈవెంట్లో సాక్షి (62 కేజీలు) కూడా తలపడింది. కానీ... తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. హైదరాబాదీ వెటరన్ షట్లర్ సైనా నెహా్వల్ తనకు వ్యక్తిగత ట్రెయినర్ సేవల్ని పొడిగించాలన్న అభ్యర్థనను ‘సాయ్’ మన్నించింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు దాకా ఆమె వ్యక్తిగత ఫిట్నెస్ ట్రెయినర్ స్వరూప్ సిన్హా ఏడు అంతర్జాతీయ టోర్నీల్లో ఆమెతో పాటు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల్ని ‘సాయ్’ భరిస్తుంది. -
ప్రభుత్వ ఉద్యోగాలకు అభినవ్ బింద్రా గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తన రెండు ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. షూటింగ్ విభాగంలో పరిశీలక హోదా బాధ్యతలకు, టార్గెట్ ఒలింపిక్ పోడియం(టీవోపీ) పథకం ఐడెంటిఫికేషన్ కమిటీ ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. కొన్ని ప్రైవేట్ స్పోర్ట్స్ ప్రాజెక్టులతో తాను సంబంధాలు పెంపొందించుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్‌కు ఓ లేఖ రాశారు. తనపై విశ్వాసం ఉంచి ఇన్నాళ్లు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలన్నారు. తన సొంత ప్రాజెక్టులైన అభినవ్ బింద్రా టార్గెటింగ్ పర్ఫామెన్స్(ఏబీటీపీ) సెంటర్లు దేశ వ్యాప్తంగా ఏర్పాటుచేసేందుకు సిద్ధమయ్యే క్రమంలో పలు ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేస్తున్నానని, మరింత సమర్ధంగా పనిచేసేందుకోసమే తాను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడం తప్పవుతోంది. -
నెలకు 50 వేల పాకెట్‌మనీ!
⇒152 మంది ‘టాప్’ అథ్లెట్లకు అందించనున్న కేంద్ర క్రీడాశాఖ ⇒జాబితాలో లేని లియాండర్ పేస్, సాకేత్ మైనేని! న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడల వంటి ప్రధాన ఈవెంట్లకు సిద్ధమవుతున్న భారత క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కేంద్ర క్రీడా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో భాగంగా ఉన్న 152 మందికి తమ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి నెలకు రూ. 50 వేల చొప్పున అందించనుంది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అభినవ్ బింద్రా నేతృత్వంలోని ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ ఈ 152 మంది పేర్లను ప్రతిపాదించింది. ఆటగాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సెప్టెంబర్ 1 నుంచి ‘పాకెట్‌మనీ’ పథకం అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ 152 మందిని ఎంపిక చేయడంలో ఎలాంటి విధి విధానాలు పాటించారో, ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారో అనేదానిపై స్పష్టత లేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టెన్నిస్ ఆటగాళ్ల జాబితాలో వెటరన్ లియాండర్ పేస్, యువ ఆటగాడు సాకేత్ మైనేనిలకు చోటు లభించలేదు. మహిళల విభాగంలో సింగిల్స్ భారత టాప్ (260వ వరల్డ్ ర్యాంక్) ర్యాంకర్ అంకితా రైనాను ఎంపిక చేయకపోగా... 801వ ర్యాంక్‌లో ఉన్న ప్రార్థనా తోంబరేని జాబితాలో చేర్చారు. జాబితా రూపకల్పనలో టెన్నిస్‌కు సంబంధించిన పరిశీలకుడిగా సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ ఉన్నాడు. అయితే ఇది తుది జాబితా కాదని, మున్ముందు ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి ఇందులో మార్పు చేర్పులు, సవరణలతో నిరంతర ప్రక్రియలా కొనసాగుతుం దని క్రీడా శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. -
షట్లర్లకు ‘టాప్’ సాయం
న్యూఢిల్లీ: టార్గెట్ ఓలింపిక్ పోడియం (టాప్) పథకానికి ఎంపికై పుల్లెల గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నలుగురు షట్లర్ల సౌకర్యార్థం మంగళవారం కేంద్రం నిధుల్ని విడుదల చేసింది. జిమ్ పరికారాల కోసం రూ. 30 లక్షలు, ఫిజియోథెరపిస్ట్‌కు నెలకు రూ. 40వేలు, ఇతరత్ర ఖర్చుల కోసం నెలకు రూ. 50వేల చొప్పున కేటాయిస్తున్నట్లు తెలిపింది. జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్ఎస్డీఎఫ్) నుంచి ఈ నిధుల్ని విడుదల చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సౌకర్యాల్ని ఈ నలుగురు ఆటగాళ్లకు మినహా వేరే వ్యక్తులు వాడరాదని తెలిపింది. ఈ పరికరాలపై యాజామన్య హక్కులు భారత క్రీడాప్రాదికార సంస్థ (సాయ్)కు చెందుతాయని వెల్లడించింది. ప్రఖ్యాత షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్, గురుసాయిదత్ టాప్ పథకానికి ఎంపికై, అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. -
‘టాప్’కు 45 మంది అథ్లెట్లు ఎంపిక
శిక్షణ కోసం ప్రస్తుతం రూ.97 లక్షలు విడుదల న్యూఢిల్లీ : టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకానికి ఆరు క్రీడాంశాల నుంచి 45 మంది అథ్లెట్లు ఎంపికయ్యారు. 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు ఈ స్కీమ్ కింద వీరికి తగిన ఆర్థిక సహాయం లభించనుంది. ► టాప్ పథకం కింద ఆటగాళ్లపై రూ.30.075 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికి రూ.96.80 లక్షలు విడుదలయ్యాయి. ఇటీవలి కాలంలో ఆటగాళ్ల ప్రదర్శన, నిలకడ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్టు క్రీడా శాఖ తెలిపింది. ► వీరందరికీ అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో పాటు సుశిక్షితులైన కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ► ఈ మేరకు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)తో క్రీడా శాఖ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో జాతీయ క్రీడా అభివృద్ధి నిధికి ఐఐఎఫ్‌సీఎల్ రూ.30 కోట్లు ఇవ్వనుంది. ప్రతీ ఏడాది రూ.10 కోట్లు ఇస్తుండగా ఈసారి ఆ నిధులను బ్యాడ్మింటన్‌కు వినియోగించనున్నారు. బ్యాడ్మింటన్ నుంచి సైనా, కశ్యప్, సింధు, గురుసాయిదత్, శ్రీకాంత్, ప్రణయ్ ఈ జాబితాలో ఉన్నారు. ► ఐదుగురు అథ్లెట్లకు రూ.12.5 లక్షల నుంచి రూ.కోటి వరకుమంజూరయ్యాయి. ఇందులో వికాస్ గౌడ (అథ్లెటిక్స్), అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, సంజీవ్ రాజ్‌పుత్, మానవ్‌జిత్ సింగ్ సంధూ (షూటింగ్) ఉన్నారు. ► రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, అమిత్ కుమార్ ఒక్కొక్కరికి రూ.75 లక్షలు... బజరంగ్, రాహుల్ అవారె... మహిళా రెజ్లర్లు వినేష్ ఫోగత్, బబితా కుమారి రూ.45 లక్షల చొప్పున పొందుతారు. ► సెయిలర్లు వర్ష గౌతమ్, ఐశ్వర్యలకు రూ.45 లక్షల చొప్పున అందుకుంటారు. బాక్సర్లు మేరీకోమ్, విజేందర్, సరితా దేవి, దేవేంద్రో సింగ్‌లకు రూ. 75 లక్షల చొప్పున.. పింకీ జంగ్రా, శివ థాపా, మన్దీప్, వికాస్‌లకు రూ.45 లక్షల చొప్పున అందుతాయి. ► మహిళా డిస్కస్ త్రోయర్లు సీమా అంటిల్‌కు రూ.75 లక్షలు, ట్రిపుల్ జంపర్ అర్పిందర్ సింగ్, 20 కి.మీ. రే స్ వాకర్లు ఖుష్బీర్ కౌర్, కేటీ ఇర్ఫాన్లకు రూ.45 లక్షల చొప్పున ఇస్తారు. అలాగే ‘టాప్’లో తమ పేర్లు లేవని ఇప్పటికే క్రీడా శాఖపై ధ్వజమెత్తిన డబుల్స్ క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని పేర్లను కూడా త్వరలోనే చేర్చుతామని ఆ శాఖ తెలిపింది.