TAS
-
ఏకగ్రీవంగా టాస్ పరిపాలనా విభాగం ఎన్నిక
సెయింట్ లూయిస్ : అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ మిస్సోరి స్టేట్ యూఎస్ఏ(టాస్) జనరల్ అసెంబ్లీ నిర్వహించింది. టాస్ పరిపాలనా విభాగాన్ని సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టాస్ పరిపానా విభాగానికి ఎన్నికైన సభ్యులందరూ ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి 800మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ 2019-2020 ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్- సురేంద్ర బచిన వైస్ ప్రెసిడెంట్-వెంకట్ గోని ట్రెజరర్- రంగ సురేష్ చక్కా కల్చరల్ సెక్రటరీ- అర్చన ఉపామక ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ- తిరుమల రమేష్ కొండముట్టి బీఓడీ 2019-2022 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - జనార్థన్ రావు విజేండ్ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్- శ్రీనివాసరావు భూమ -
స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది వేడుకలు
సాక్షి, ఎడింబరో : స్కాట్లాండ్లోని తెలుగు ప్రవాసులు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్కాట్లాండ్ తెలుగు సంఘం(టాస్) ఆధ్వర్యంలో శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 7న ఎడింబరోలోని డల్కిత్ హై స్కూల్ ప్రాంగణం ఆడిటోరియంలో వైభవంగా జరిగాయి. టాస్ కార్యవర్గ సభ్యులు వేడుకలకు వచ్చిన వారందరికీ ఉగాది పచ్చడి అందించి స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలనతో ఉగాది 2018 వేడుకలు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న తెలుగు వారి పిల్లలు సంస్కృతిక శ్లోకాలు, వేమన పద్యాలు పాడి, సాంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యంతో అతిథులను ఆశ్చర్యపరిచారు. టాస్ ఛైర్మన్ సత్య శ్యాం కుమార్ మాట్లాడుతూ తెలుగు వారిగా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవలసిన బాధ్యత మనపైనే ఉందని, అందుకు ఇలాంటి వేడుకలు వేదిక అనీ అన్నారు. టాస్ లక్ష్యాలు, భవిష్యత్ కార్యచరణపై వివరించారు. ఈ సందర్భంగా ఆధ్యక్షుడు నాగుబండి రంజిత్ తెలుగు భాష ప్రత్యేకతను తెలియజేసే సిలికాన్ ఆంధ్ర మనబడిలో ఎక్కువ మార్కులు సాధించిన చిన్నారులకు, బహుమతుల ప్రదానం చేశారు. స్కాట్లాండ్లోని తెలుగు వారి పిల్లలు అందరూ తెలుగు నేర్చుకోవాలని సూచించారు. జనరల్ సెక్రటరీ చింపిరి శివ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ గీతం "జన గణ మణ" వందన సమర్పణతో స్కాట్లాండ్ తెలుగు సంఘం ఉగాది 2018 వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలోనే టాస్ నూతన కార్యవర్గ (2018 - 2020) సభ్యుల ఎన్నిక జరిగింది. టాస్ నూతన కార్యవర్గం(2018 - 2020) - జయంతి సత్య శ్యాం కుమార్ - సభాపతి (ఛైర్మన్) - కెంబూరి మైథిలి - ఆధ్యక్షుడు (ఫ్రెసిడెంట్) - చింపిరి శివ - ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రెటరి) - గడ్డం వెంకటేష్ - కోశాధ్యక్షులు (ట్రెజరర్) - కుచాడి ఉదయ్ కుమార్ - సాంస్కృతిక కార్యదర్శి (కల్చరల్ సెక్రెటరి) - అప్పరల రవి తేజస్వి - మహిళా కార్యదర్శి (విమెన్స్ సెక్రెటరి) - ప్రతిపటి చైతన్య - సాంకేతిక & (ఐ. టి. సెక్రెటరి) - నూక నిరంజన్ - పౌర సంబంధాల కార్యదర్శి (పి. ఆర్ సెక్రెటరి) - నరుకుళ్ళ రంగనాథ్ - క్రీడా కార్యదర్శి (స్పోర్ట్స్ సెక్రెటరి) - అప్పరాల మాధవి లత - ప్రాజెక్టుల కార్యదర్శి -
గ్లాస్గోలో ఘనంగా టీఏఎస్ దీపావళి వేడుకలు
గ్లాస్గో : స్కాట్లాండ్ తెలుగు సంఘం(టీఏఎస్) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో తెలుగుదనం ఉట్టిపడేలా దీపావళి, టీఏఎస్ 15 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ప్రెసిడెంట్ రంజిత్ నాగుబండి మాట్లాడుతూ టీఏస్ నిర్వహిస్తున్న సైక్లింగ్ ప్రాజెక్ట్, స్పోర్ట్స్, పిక్నిక్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి సామాజిక కార్యక్రమాలు, వాటిలో వాలంటీర్స్లకు ఉన్న అవకాశాలను అందరికి వివరించారు. ఈ సందర్భంగా టీఏఎస్ కార్యవర్గ సభ్యులందరిని సభకు పరిచయం చేశారు. టీఏఎస్ ఛైర్మన్ శ్యామ్ జయంతి, దీపావళి శుభాకాంక్షలతో అందరికి స్వాగతం పలికారు. తెలుగు భాష, సంస్కృతి, సామాజిక స్పూర్తిని ప్రోత్సహించడంలో టీఏఎస్ ప్రాముఖ్యతను తెలిపారు. పదిహేను సంవత్సరాలుగా టీఏఎస్ చేస్తున్న కార్యక్రమాలను అందరికి తెలిపారు. కల్చరల్ సెక్రటరీ శివ చింపిరి, ఉమెన్స్ సెక్రటరీ తేజ కంటమనేని ఆధ్వర్యంలో జరిగిన నాట్యాలు, పాటల కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. కోశాధికారి బెంజిమన్ తెలగాలపుడి, ఐటీ కార్యదర్శి వెంకటేష్ గడ్డం, యూత్ కార్యదర్శి ఉదయ్ కుచాడి, ఈమెంట్ మేనేజ్మెంట్ పనులు, భోజన కార్యక్రమాలు చూసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అందరికి జనరల్ సెక్రటరీ మైథిలి కెంబురి కృతజ్ఞతలు తెలిపారు. -
టీఏఎస్ ఏర్పాటుకు అధ్యయనం
వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు రాష్ట్ర బృందం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్–1 అధికారుల సంఘం, తెలంగాణ రెవెన్యూ జేఏసీ చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల పర్యటనకు తెలంగాణ ఎన్జీవో సెంట్రల్ యూనియన్ ప్రతినిధులకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. టీఏసీలో కేడర్ సంఖ్య ప్రతిపాదనలు, టీఏసీ పరిధిలో ఉంచాల్సిన హెచ్వోడీలు, పోస్టులు, పోస్టుల వారీగా గ్రేడ్, స్కేల్ ఆఫ్ పే వివరాలు, టీఏసీ, రిక్రూట్మెంట్ ఏజెన్సీకి అధికారుల ఎంపిక, ఎంపిక విధానం, టీఏసీల పదోన్నతుల విధానం, ప్రస్తుతం ఉన్న గ్రూప్–1 అధికారులను టీఏసీలో చేర్చటం, టీఏసీ అధికారులకు శిక్షణ, తరగతుల నిర్వహణ తదితర అంశాలను కూడా అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. -
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు తేవాల్సిందే!
► అధికారుల కమిటీతో రెవెన్యూ, గ్రూప్-1, గెజిటెడ్ సంఘాలు ► విధివిధానాల్లోనే మార్పులు అవసరమని వెల్లడి సాక్షి , హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును (టీఏఎస్) అమల్లోకి తేవాల్సిందేనని వివిధ ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. అయితే విధి విధానాల రూపకల్పనలో మాత్రం అన్ని విభాగాల ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కోరాయి. ప్రభుత్వం మరింత లోతుగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. టీఏఎస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ నేతృత్వంలో నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం సచివాలయంలో గ్రూప్-1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ, గెజిటెడ్ అధికారుల సంఘం నేతలతో సమావేశమైంది. ఆయా సంఘాల అభిప్రాయాలను స్వీకరించింది. ఈ సందర్భంగా గ్రూప్-1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి చేసిన అధ్యయన నివేదికలను అందజేసి.. వాటిలోని అంశాలపై చర్చించాయి. సమావేశంలో గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, రెవెన్యూ అధికారుల జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, కన్వీనర్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్-1 అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘాలు టీఏఎస్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొనగా, రెవెన్యూ అధికారుల సంఘం మాత్రం టీఏఎస్ అక్కర్లేదని, ఒకవేళ ఏర్పాటు చేస్తే రెవెన్యూ అధికారులతోనే ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రస్తుత రెవెన్యూ విధానాన్ని టీఏఎస్గా మార్చాలి: రెవెన్యూ జేఏసీ చిన్న జిల్లాల నేపథ్యంలో టీఏఎస్ అవసరం లేదు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఆందోళనలో ఉన్నారు. పని లేక, అవకాశాలు లేక చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. ఒకవేళ చేస్తే రెవెన్యూ విధానాన్ని టీఏఎస్గా మార్చాలి. దీనిపై అవసరమైతే మేం మరిన్ని రాష్ట్రాల్లో మరోసారి అధ్యయనం చేస్తాం. కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లోని రాష్ట్ర పరిపాలన సర్వీసుల్లో 50 శాతం డెరైక్టు నియామకాల విధానం ఉంది. అందరికి అవకాశం వచ్చేలా టీఏఎస్: గెజిటెడ్ అధికారుల సంఘం అందరికి అవకాశాలు వచ్చేలా టీఏఎస్ ఉండాలి. విధి విధానాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి. గ్రూప్-1 సర్వీసెస్ స్థానంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగులను ఎంపిక చేయాలి. గ్రూప్-1 సర్వీసులోని ఉద్యోగులను టీఏఎస్‌లో జూనియర్, సీనియర్, సూపర్ సీనియర్ కేటగిరీలుగా విభజించాలి. ఈ కేటగిరీల కిందే ఉద్యోగాలను భర్తీ చేయాలి. టీఏఎస్‌లో వారి కామన్ సీనియారిటీని కొనసాగించాలి. ఒక్క శాఖకే పరిమితం చేయకుండా టీఏఎస్ పరిధిలోనే బదిలీలు ఉండాలి. ఒక్క సబ్జెక్టుతో వచ్చిన వారైన ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ వారిని వెనక్కి పంపించాలి. డిపార్ట్మెంట్లలోని సీనియర్లనే విభాగాధిపతులుగా నియమించాలి. అందరిని ఒప్పించి చేయాలి. మేం అధ్యయనం చేస్తాం. అధికారుల కమిటీ కూడా అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకోవాలి. టీఏఎస్ తప్పనిసరి: గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్రంలో టీఏఎస్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రస్తుతమున్న గ్రూప్-1 అధికారులతో టీఏఎస్ తొలి కేడర్ సంఖ్యను నిర్దేశించాలి. ప్రస్తుతమున్న గ్రూప్1 సర్వీసుల నియామకాలు యథాతథంగా కొనసాగించాలి. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయ్యాక టీఏఎస్‌కు బదిలీ చేయాలి. టీఏఎస్‌లో 3 గ్రేడ్లుండాలి. 8 ఏళ్ల గ్రూప్-1 సర్వీసు పూర్తి చేసిన వారిని 12 ఏళ్ల వరకు జూనియర్ గ్రేడ్‌గా పరిగణించాలి. 12-16 వరకు సీనియర్ గ్రేడ్, 16 ఏళ్ల సర్వీసు నిండిన వారిని సూపర్ టైమ్ గ్రేడ్‌గా పరిగణించాలి. వివిధ విభాగాధిపతులు (హెచ్‌వోడీ), ఎండీలు, రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా టీఏఎస్ అధికారులను నియమించాలి. ఐఏఎస్ పదోన్నతుల్లో అన్ని శాఖలకు అవకాశమివ్వాలి. డిప్యూటీ కలెక్టర్లతోపాటు నాన్ రెవిన్యూ అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలి.