Tata Open Badminton tournament
-
సెమీ ఫైనల్లో రామ్‌కుమార్–బోపన్న
పుణే: టాటా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. సింగిల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. గురువారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–రామ్‌కుమార్ ద్వయం 7–6 (7/3), 7–6 (7/4)తో అలెగ్జాండర్ ఎర్లెర్ (ఆస్ట్రియా)–జిరి వెసెలీ (చెక్ రిపబ్లిక్) జంటపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా–చెక్ జోడీతో భారత జంటకు హోరాహోరీ పోరు ఎదురైంది. దీంతో రెండు సెట్లలోనూ టైబ్రేక్ తప్పలేదు. మరో భారత జోడీ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం కూడా సెమీస్ చేరింది. క్వార్టర్స్‌లో వీరి ప్రత్యర్థులు గియన్లుకా మగెర్ (ఇటలీ)–ఎమిల్ రుసువూరి (ఫిన్లాండ్) గాయంతో వైదొలగడంతో విష్ణు–శ్రీరామ్ జంట వాకోవర్‌తో సెమీస్ చేరింది. సెమీఫైనల్లో ఈ జోడీ... ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ సవిల్లే–జాన్ ప్యాట్రిక్ స్మిత్ జంటతో, బోపన్న–రామ్‌కుమార్ జంట ఫ్రాన్స్‌కు చెందిన సాడియో డౌంబియా–ఫాబిన్ రెబొల్ ద్వయంతో తలపడతాయి. సాకేత్ మైనేని–ముకుంద్ శశికుమార్ జంట 6–3, 5–7, 3–10తో ల్యూక్ సవిల్లే– జాన్ ప్యాట్రిక్ జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ 3–6, 2–6తో ఎనిమిదో సీడ్ స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) చేతిలో పరాజయం చవిచూశాడు. ప్రపంచ 93వ ర్యాంకర్ ధాటికి 29 ఏళ్ల యూకీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. వరుస సెట్లలోనే చేతులెత్తేశాడు. తొలి రౌండ్లో స్టెఫానో... భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. తాజా విజయంతో ఇటలీ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలిరౌండ్లోనే ప్రజ్నేశ్ గుణేశ్వరన్, అర్జున్ ఖడేలు కూడా ఓడిపోవడంతో ఈ టోర్నీ సింగిల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. ఇతర మ్యాచ్‌ల్లో స్వీడెన్కు చెందిన ఎలీస్ యెమెర్ టాప్ సీడ్ అస్లన్ కరత్సెవ (రష్యా)కు షాకిచ్చాడు. 163వ ర్యాంకులో ఉన్న యెమెర్ 6–2, 7–6 (7/3)తో ప్రపంచ 15వ ర్యాంకర్ కరత్సెవను కంగుతినిపించి క్వార్టర్స్ చేరాడు. సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేనికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. దీంతో ఈ నెల 7 (సోమవారం) నుంచి జరిగే ఈ టోర్నీలో 34 ఏళ్ల తెలుగు ఆటగాడు నేరుగా మెయిన్ డ్రాలో పోటీపడతాడు. -
రామ్‌కుమార్‌కు ‘వైల్డ్ కార్డు’
‘టాటా ఓపెన్’ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్‌కు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. దాంతో రామ్‌కుమార్ పురుషుల సింగిల్స్‌లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడతాడు. టాటా గ్రూప్ స్పాన్సర్ చేస్తున్న ఈ టోర్నీ మహారాష్ట్రలోని పుణేలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగుతుంది. గత నవంబర్‌లో రామ్ బహ్రెయిన్ ఓపెన్ లో విజేతగా నిలిచి కెరీర్లో తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్‌ను సాధించాడు. చదవండి: IPL: వాళ్లిద్దరు నా ఫేవరెట్ ప్లేయర్లు... ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది: దక్షిణాఫ్రికా యువ సంచలనం ఏబీడీ 2.0! -
విజేత రుత్విక శివాని
ముంబై: టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ రుత్విక 21–12, 23–21తో రియా ముఖర్జీ (భారత్)పై గెలిచింది. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 20 ఏళ్ల రుత్విక రెండో గేమ్‌లో ఒకదశలో 17–20తో మూడు గేమ్ పాయింట్లను కాచుకుంది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు గెలిచిన రుత్విక 20–20తో స్కోరును సమం చేసింది. అనంతరం ఇద్దరూ చెరో పాయింట్ గెలవడంతో స్కోరు 21–21తో సమమైంది. ఈ దశలో రుత్విక వరుసగా రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. టాటా ఓపెన్‌ను రుత్విక నెగ్గడం ఇది రెండోసారి. 2014లో తొలిసారి ఆమె ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 21–15, 14–21, 19–21తో సితికామ్ థమాసిన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. -
మనీషా-సాత్విక్ జంటకు ‘మిక్స్డ్’ టైటిల్
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ముంబై: ఆద్యంతం నిలకడగా రాణించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు కె.మనీషా-సాత్విక్ సాయిరాజ్ ద్వయం టాటా ఓపెన్ ఇండియన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మనీషా-సాత్విక్ జంట 21-13, 21-16తో రెండో సీడ్ అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (భారత్) జోడిపై విజయం సాధించింది. శనివారం టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించిన మనీషా-సాత్విక్ అదే జోరును ఫైనల్లోను కనబరిచారు. సమన్వయంతో ఆడుతూ తమ ప్రత్యర్థికి ఏదశలోనూ తేరుకునే అవకాశం ఇవ్వలేదు. విజేతగా నిలిచిన మనీషా-సాత్విక్ జోడికి 1,185 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 79 వేలు)తోపాటు 4000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మనీషా కెరీర్లో ఇది రెండో అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ టైటిల్. గతంలో ఆమె నందగోపాల్‌తో కలిసి 2013లో మాల్దీవ్స్ ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో మనీషా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో మనీషా-సిక్కి రెడ్డి జంట 11-21, 21-15, 13-21తో టాప్ సీడ్ చలాద్‌చలమ్ చాయనిత్-ఫతైమాన్ మ్యున్‌వోంగ్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్ విభాగంలో మనీషా రన్నరప్‌గా నిలవడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది మేఘనతో కలిసి ఫైనల్ ఆడిన మనీషాకు ఓటమి ఎదురైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. తన సోదరుడు సౌరభ్ వర్మతో జరిగిన ఫైనల్లో సమీర్ వర్మ 21-11, 21-18తో విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ (భారత్) జోడీ 14-21, 9-21తో వానవత్-ఇస్రియానాతె (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే విజేతలకు ట్రోఫీలను అందజేశారు.