Tatas
-
'టాటాలు లీడ్ చేస్తారు.. ఫాలో అవ్వరు'
టాటా సన్స్ కొత్త చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ నూతనోత్సవంతో రంగంలోకి దిగారు. అన్ని వ్యాపారాల్లోనూ ఇండస్ట్రి లీడింగ్ ఫర్ఫార్మెన్స్ ఉండేలా తన పాలనను కొనసాగిస్తానని వాగ్దానం చేశారు. అన్ని వ్యాపారాల్లో పరిశ్రమలన్నింటిన్నీ మనమే లీడ్ చేసేలా అందరూ కలిసి పనిచేద్దామని గ్రూప్ కంపెనీలకు పిలుపునిచ్చారు. టాటాలు లీడ్ చేస్తారు, ఫాలో అవ్వరు అని మీడియాకు తెలిపారు. ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ల వరకున్న టాటా గ్రూప్ బిజినెస్ లకు రథసారథిగా చంద్రశేఖరన్ నేడు బాంబే హౌజ్‌లో తన బాధ్యతలు స్వీకరించారు. ''నేను ఈ బాధ్యతలు స్వీకరించడం నాకు దక్కిన ఓ గౌరవం, హక్కు. ప్రతిఒక్కరూ నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నా'' అని చంద్రశేఖరన్ చెప్పారు. గ్రూప్ కొత్త చీఫ్ గా బాధ్యతలు స్వీకరించగానే, బాంబే హౌజ్ లో టాటా సన్స్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఉదయం 9.15కు గ్రూప్ ప్రధాన కార్యాలయానికి చంద్ర చేరుకున్నారు. అనంతరం రతన్ టాటా, ఇతర బోర్డు మెంబర్లు బాంబే హౌజ్ కు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత తాత్కాలిక చైర్మన్ గా ఉన్న రతన్ టాటా నుంచి చంద్ర తన బాధ్యతలు స్వీకరించారు. 150 ఏళ్లు కలిగిన టాటా సన్స్‌కు తొలిసారి నాన్-పార్సి చైర్మన్‌గా చంద్రశేఖరన్ ఎంపికైన సంగతి తెలిసిందే. -
టాటా, బిర్లాల నష్టం ఎంతో తెలుసా?
-
టాటా, బిర్లాల నష్టం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడా పారిశ్రామికవేత్తలకు భారీగానే తాకింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరెన్సీ నోట్ల రద్దు టాటా, బిర్లాకు భారీ షాకిచ్చింది. టాటా, బిర్లా, మహేంద్ర గ్రూపులకు చెందిన మార్కెట్ వాల్యూ కుప్పకూలింది. దాదాపు రూ. 61,664 కోట్ల (9 బిలియన్ డాలర్ల) సంపద తుడుచు పెట్టుకుపోయింది. ఒకవైపు స్టాక్ మార్కెట్ భారీ ఒడిదుడులకు మధ్య కొనసాగుతుండగా.. టాటా,బిర్లా గ్రూపు కంపెనీల లాభాలు కేవలం8 సెషన్లలో భారీగా నష్టపోయాయి. భారీ అమ్మకాల నేపథ్యంలో దాదాపు అన్ని మేజర్ కంపెనీలు భారీగా పతనమవుతుండగా ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మాత్రం స్వల్ప నష్టాలను పరిమితం కావడం విశేషం. నవంబరు 8-21 మధ్య కాలంలో టాటా గ్రూపులోని 27మంది వాటాదారులకు చెందిన 39,636 కోట్లు,టీసీఎస్ రూ.21,839 కోట్లు , టాటా మెటార్స్ రూ.8,954 కోట్లు, టైటాన్ రూ. 3,131 కోట్లు, టాటా స్టీల్ రూ.1,128 కోట్లు ఆవిరై పోయాయి. అలాగే బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ కూడా భారీగానే నష్టపోయింది. ఈ కంపెనీలో 62.26 వాటా కలిగివున్న ప్రమోటర్లు రూ.10,678 కోట్లు నష్టపోయారు. అలాగే గ్రాసిం ఇండస్ట్రీస్ వెయ్యికోట్లు, హిందాల్కో సుమారు 800 కోట్లను కోల్పోయాయి. మహేంద్ర గ్రూపు 6 వేలకోట్లు నష్టపోయింది. ఎంఅండ్ఎం, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సంస్థ వాటాదారులరూ. 5278 కోట్ల పెట్టుబడులు గల్లంతయ్యాయి. కాగా రిలయన్స్ గ్రూపు 1.78 శాతం మాత్రమే నష్టపోయింది. మిగతా మార్కెట్ దిగ్గజ కంపెనీలతో పోలిస్తే ముఖ్యంగా ఆర్ఐఎల్ 1748కోట్లను, టీవీ18 రూ.704కోట్ల నష్టాలతో సరిపెట్టుకుంది. కాగా ఆపరేషన్ బ్లాక్ మనీ, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సెన్సెక్స్ కూడా 7శాతం పతనాన్ని నమోదుచేసింది. దీంతోపాటుగా నోట్ల రద్దు ప్రభావం, ఫెడ్ వడ్డీరేట్లు పెంచనుందనే అంచనాలతో దేశీయ కరెన్సీ విలవిల్లాడుతోంది. డాలర్ మారకపు రేటుతో రూపాయి రూ.68.50 వద్ద తొమ్మిది నెలల కనిష్టాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
టాటాల మరో కీలక అడుగు?
టాటా గ్రూప్ లోసైరస్ మిస్త్రీ తొలగింపు దుమారం చల్లారకముందే టాటాలు కీలక పావులు కదుపుతున్నారు. ఈ వివాదంలో మిగిలిన కార్యక్రమాలను చకచకా చక్క పెట్టే పనిలో టాటా గ్రూప్ బిజీగా ఉంది. ముఖ్యంగా టాటాలోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలు దారులకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. టాటా సన్స్ లోని షాపూర్జీ పల్లోంజి 18 శాతం వాటాను విక్రయించాలనుకుంటే... ఆసక్తిగల ఫ్రెండ్లీ పార్టనర్స్ కోసం వెతుకుతోందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు చేసింది. సమర్థవంతమైన కొనుగోలుదారులకోసం ప్రాథమిక చర్చలు మొదలు పెట్టిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే టాటాలు మిస్త్రీ కుటుంబం వాటాను కొనుగోలుకు ఆసక్తి వున్న సావరిన్ హెల్త్ ఫండ్ (ప్రభుత్వ ఆధీనంలో ఇన్వెస్ట్మెంట్ ఫండ్) ఇతర దీర్ఘకాల పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్టు నివేదించింది. టాటా సన్స్ లిస్టెడ్ కంపెనీలో 65 బిలియన్ డాలర్ల వాటాను కలిగి ఉంది. అయితే ఈవార్తలను ఈక్విటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోత్రా ఖండించారు. ఇది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదనీ, మిస్త్రీ తన పోరాటాన్ని వదులుకోరని వ్యాఖ్యానించారు. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి టాటాసన్స్, షాపూర్జీ పల్లాంజీ గ్రూపు తిరస్కరించాయి. కాగా టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైరస్ మిస్త్రీకి అకస్మాత్తుగా ఉద్వాసన పలకడం చట్టవిరుద్ధమని టాటా గ్రూప్ లోని మెజార్టీ స్టాక్ హోల్డర్స్ షాపూర్జీ , పల్లోంజి గ్రూప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. , -
పెదవి విప్పిన సైరస్ మిస్త్రీ
ముంబై : మార్కెట్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతూ టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తనను ఉన్న పళంగా తొలగించడంపై వస్తున్న పుకార్లను సైరస్ మిస్త్రీ కొట్టిపారేశారు. నేడు ఓ మీడియా ప్రకటనను విడుదల చేశారు. ఈ 24 గంటలు జరిగిన తతంగమంతా ఆశ్చర్యకరమైనది కానప్పటికీ, చాలా సెన్సిటివ్ అని మాత్రం మిస్త్రీ పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అగౌరవమైన రీతిలో మిస్త్రీని తొలగించడంపై బోర్డు నిర్ణయంపై పల్లోంజి గ్రూప్, మిస్త్రీ కోర్టులో సవాలుచేయనున్నట్టు పలు టీవీ చానెల్స్ రిపోర్టు చేశాయి. ఈ మధ్యాహ్నం లోపు ఆయన బొంబాయి హైకోర్టు ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నాయి. కానీ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని షాపూర్జీ పల్లోంజి గ్రూప్, మిస్త్రీ పేర్కొన్నారు. షాపూర్జీ గ్రూప్ కానీ, సైరస్ మిస్త్రీ గ్రూప్ కానీ ఇప్పటివరకు కోర్టుకు వెళ్తున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదని, వ్యాజ్యాన్ని దాఖలు చేస్తాం అనే మీడియా ఊహాగానాలకు ఎలాంటి ఆధారాలు లేవని పల్లోంజి గ్రూప్ తెలిపింది. కోర్టుకు వెళ్లాలంటే పబ్లిక్ ప్రకటన తప్పనిసరి అని గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. టాటా గ్రూప్ ముందస్తు జాగ్రత్తలు మరోవైపు టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీలు కోర్టులో తమ వాదనలు వినిపించుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తులు పడినట్టు తెలిసింది. టాటా గ్రూప్ హైకోర్టులో ముందస్తుగా ఓ కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేయగా... మిస్త్రీ కూడా టాటా సన్స్‌కు, రతన్‌టాటాకు, సర్ దోరబ్జీ ట్రస్ట్‌లకు వ్యతిరేకంగా నాలుగు కేవియట్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ తాను ఎలాంటి కేవియట్ పిటిషన్లను దాఖలు చేయలేదని మిస్త్రీ పేర్కొన్నారు. ఏకపక్షంలో వాదనలు మాత్రమే వినకుండా ఇతరుల అభిప్రాయాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకునేలా ఈ కేవియట్ పిటిషన్లు దోహదం చేయనున్నాయి. సీఈవోలతో రతన్ టాటా భేటీ సోమవారం జరిగిన అనూహ్య నిర్ణయాల నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా, తన గ్రూప్ సీఈవోలందరితో భేటీ అయ్యారు. గ్రూప్ హెడ్ ఆఫీసు బొంబాయిలో ఈ భేటీ జరిగింది. ఇదేమీ యజమాన్య పరంగా వస్తున్న యుద్ధం కాదని మిస్త్రీ తొలగింపుపై రతన్ టాటా వ్యాఖ్యానించారు. సంబంధిత వ్యాపారాల్లో సహ అధినేతలు ఎక్కువగా దృష్టిసారించాలని రతన్ టాటా ఆదేశించారు. తన ఎంపిక స్వల్పకాలం మాత్రమేనని, కొత్త చైర్మన్ ఈ పదవికి త్వరలోనే ఎంపికవుతారని పేర్కొన్నారు. మార్కెట్ పొజిషన్‌పై దృష్టిసారిస్తూనే, పోటీవాతావరణంపై కూడా ఫోకస్ చేయాలని గ్రూప్ సీఈవోలకు రతన్ టాటా తెలిపారు. -
ఉద్యోగులకు టాటా గ్రూపు మరో బంపర్ ఆఫర్
ముంబై: మహిళా ఉద్యోగులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన టాటా గ్రూపు తన మాటను నిలబెట్టుకుంది. మహిళలకు అవకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో దేశంలోనే అతి పెద్ద సంస్థగా రికార్డు సొంతం చేసుకున్న టాటా గ్రూపు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. గతంలో 7 నెలల ప్రసూతి సెలవులను ప్రకటించిన టాటా గ్రూపు ..తమ మహిళా ఉద్యోగుల కోసం మరో కీలక అడుగు వేసింది. తమ కంపెనీల్లో భారీ సంఖ్యలో మహిళలకు కంపెనీ బాధ్యతలు అప్పగించేందుకు, వారిలో లీడర్ షిప్ క్వాలిటీస్ పెంపొందించేందుకు వీలుగా ఒక ప్రాజెక్ట్ ను చేపట్టింది. దీంట్లో ఎంపిక చేసిన మహిళా ఎగ్జిక్యూటివ్ లఅభివృద్ధికి తోడ్పడేలా, కంపెనీలో ఉన్నత పదవులను చేపట్టేందుకు సహకరించేందుకు ఒక మెంటరింగ్ కమిటీని నియమించింది. దీని ద్వారా నైపుణ్యం కల మహిళా ఉద్యోగుల టాలెంట్ కు మెరుగులు దిద్ది నాయకత్వం స్థానాల్లో నిలబడేలా శిక్షణనిస్తుంది. సుమారు 300 నైపుణ్యం గల మహిళా ఎగ్జిక్యూటివ్ లకు నాయకత్వస్థానాల్లో ఎదిగేందుకు గాను శిక్షణ ఇస్తుంది. 45 గ్రూపు కంపెనీలకు చెందిన 180 సీఎక్స్‌వోలు, 35 మంది సీఈవోలుఈ ప్రాజెక్ట్ లో పాలుపంచుకోనున్నారు. టాటా గ్రూపు కంపెనీలో పనిచేసే మహిళల్లో దాగునున్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచి వారికి కంపెనీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని ..మహిళలు కూడా నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకుని ముందుకు పోవాలని టాటా సన్స్ గ్రూప్ చీఫ్ ఆఫీసర్ ఎన్ఎస్ రాజన్ చెప్పారు. సుమారులక్షా 45 వేల మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న టాటాగ్రూపు ప్రాజెక్ట్ లో మొదటిది, కీలకమైన దశ పూర్తి అయిందని తెలిపారు. రెండవదైన టెక్నాలజీ, లాజిస్టిక్ పని, మెంటార్లు, మహిళా ఉద్యోగుల మధ్య అనుసంధానం తుది దశలో ఉందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇండియాకే పరిమితం కాదనీ, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా ఉన్న తమ కంపెనీల్లో కూడా దీన్ని అమలు చేయనున్నామని తెలిపారు. కాగా ఈ దశాబ్దాంతానికి సుమారు 1000 మంది మహిళా లీడర్లు తమ కంపెనీలో నియమించుకునే ఆలోచనలో ఉన్నట్టు గతంలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మ్రిస్తీ వ్యాఖ్యానించారు. కంపెనీలో మహిళలు ప్రాధాన్యం తక్కువగా ఉందంటే మనం 50 శాతం టాలెంట్‌ను కోల్పోయినట్లే లెక్క అని కంపెనీల్లో మహిళలు కీలక పాత్త్ర పోషించాలన్నారు. ప్రపంచంలోని పలు కంపెనీల్లో మహిళలుకూడా ఒక భాగమని ఈ నేపథ్యంలోనే మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. మహిళలు కూడా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని వారిలో నైపుణ్యాన్ని వెలికి తీయాలన్నారు. ఫలితంగా కంపెనీ అభివృద్ధి చెందుతుందనీ, కంపెనీతో పాటు వారు అభివృద్ధి చెందాలన్నారు. ఈ స్ఫూరినే టాటా గ్రూపునకు చెందిన అన్నీ కంపెనీలు అమలు చేయాలన్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.