tax pay
-
శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులు ఓపెన్.. కారణం..
ఆర్థిక సంవత్సరం 2023-24 ముగింపు సందర్భంగా కొన్ని ఆర్థిక లావాదేవీలకు గడువు ముగియనుంది. దాంతో కొన్ని సంస్థలు సెలవుదినాల్లోనూ తమ వినియోగదారులకు సేవలందించేందుకు సిద్ధపడుతున్నాయి. అందులో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కార్యాలయాలు శని, ఆదివారాలు (మార్చి 30, 31 తేదీల్లో) పని చేస్తాయని ప్రకటించింది. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది. ఇదీ చదవండి: టికెట్ లేకుండా విమానం ఎక్కిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే.. ఈ నేపథ్యంలోనే భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) సూచనల మేరకు.. పాలసీదారులకు అవసరమైన సేవలను అందించేందుకు జోన్లు, డివిజన్ల పరిధిలోని కార్యాలయాలు సాధారణ పనివేళల వరకు తెరిచే ఉంటాయని ఎల్ఐసీ చెప్పింది. పన్ను శాఖ సంబంధిత కార్యకలాపాల కోసం, పెండింగ్‌లో ఉన్న డిపార్ట్మెంటల్ పనిని పూర్తి చేయడానికి దేశం అంతటా ఆదాయపు పన్ను కార్యాలయాలు మార్చి 30, 31 తేదీల్లో తెరిచే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. Press Release: Special Measures for extending services to Policy Holders of LIC of India#LIC pic.twitter.com/qH4oNVe7Gi — LIC India Forever (@LICIndiaForever) March 28, 2024 -
మార్చిలో ముఖ్యమైన డెడ్లైన్లు.. తప్పిస్తే నష్టమే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఈ మార్చి 31తో ముగుస్తుంది. ఆర్థికపరంగా ఈ మార్చి నెల ముగిసేలోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. పాన్- ఆధార్ లింక్, ముందస్తు పన్ను చెల్లింపు, పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ప్రధానమంత్రి వయా వందన యోజన దరఖాస్తుకు మార్చిలో గడువులు ముగుస్తాయి. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! పాన్-ఆధార్ కార్డ్ లింక్ మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్‌తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతకు ముందు కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువును చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ. 1,000 పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోవాలి. ప్రస్తుత గడువు తప్పితే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ పని చేయదని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ముందస్తు పన్ను చెల్లింపు ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ముందస్తు పన్ను చెల్లింపు చివరి వాయిదా చెల్లింపునకు చివరి తేదీ మార్చి 15. ముందస్తు పన్ను చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ అయితే పన్ను చెల్లింపుదారు సంబంధిత పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. టీడీఎస్ మినహాయించిన తర్వాత రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేసే పెట్టుబడులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు మార్చి 31 చివరి తేదీ. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, ట్యాక్స్‌ను ఆదా చేయడానికి ఈ పన్ను ప్రణాళిక సహాయపడుతుంది. పన్ను చెల్లింపుదారులు గణనీయమైన మొత్తంలో పన్ను ఆదా చేసుకోవడానికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన ఇది సీనియర్ సిటిజన్లకు భద్రతను అందించే బీమా పాలసీ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని భారతీయ బీమా సంస్థ అందిస్తోంది. ఇందులో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మార్చి 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై 10 సంవత్సరాలకు ఏటా 7.4 శాతం వడ్డీ వస్తుంది. నెలవారీ, త్రైమాసికం, లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. -
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ప్రీ-ఫిల్డ్ ఫారంలు వచ్చేశాయి
ఆదాయపు పన్ను శాఖ వారు సంస్కరణల పేరిట తీసుకొచ్చిన పెనుమార్పుల్లో కొత్త ఫారంలు కూడా ఉన్నాయి. వీటినే ప్రీ ఫిల్డ్ ఫారంలని కూడా అంటారు. కొత్త మార్పుల కారణంగా మనం సైటులోకి వెళ్లి ఫారంలోని ఒక్కొక్క అంశం టైప్ చేసి నింపాల్సిన అవసరం లేకుండా.. డౌన్లోడ్ చేసేసరికే ఫారంలో అంశాలు నింపేసి ఉంటాయి. అంటే డిపార్ట్మెంట్ సిబ్బందే మనకు సంబంధించిన వివరాలను ఫారంలో పొందుపర్చి ఉంచుతారు. మీరు వాటిని సరిచూసుకుని, సరిగ్గానే ఉన్నట్లయితే ఒక్క క్లిక్‌తో ఫారంను ఫైల్ చేయొచ్చు. ఒకవేళ సరిపోలకపోయిన పక్షంలో సదరు అంశాలను మీ లెక్కల ప్రకారం సవరించి, రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఈ విధానాన్ని 2019 నుంచి పాక్షికంగా ప్రవేశపెట్టగా.. ఈ సంవత్సరం నుంచి సమగ్రమైన వివరాలతో పూర్తి స్థాయిలో అమలు కాగలదని విశ్లేషకుల అంచనా. డిపార్ట్మెంట్ దగ్గర మన ఆదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. డిపార్ట్మెంట్ ఏం చెబుతోందంటే.. ఈ ఫారంలు నింపటం చాలా సులువు. చాలా త్వరగా నింపవచ్చు. పారదర్శకత మెరుగుపడుతుంది. ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. సమగ్రమైన సమాచారం కలిగి ఉంటుంది. చట్టాలకు అనుగుణంగా పని త్వరగా పూర్తవుతుంది. తప్పులకు ఆస్కారం ఉండదు. పన్నుల ఎగవేత తగ్గుతుంది. పైన పేర్కొన్న ప్రయోజనాలతో అంతా ఏకీభవించక తప్పదు. ఆదాయపు పన్ను శాఖ ఆలోచన అలాగే ఉంటుంది. ఎందుకంటే, ఎన్నో ఆర్థిక వ్యవహరాలు జరుగుతున్నా .. అసెసీలు వాటిని తమ తమ వార్షిక రిటర్నులలో చూపించడం లేదు. నిజాయితీగా ఆదాయం, ఆర్థిక వ్యవహారాలను చూపించని బడాబాబులు ఎందరో ఉంటారు. ఈ విషయం అలా ఉంచితే.. మీరు చేయవలసిందేమిటంటే.. మీ పేరు మీదనున్న అన్ని బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలను పరిగణనలోకి తీసుకోండి. అన్ని ఆదాయాలు .. జీతం, ఇంటద్దె, లాభాలు, క్యాపిటల్ గెయిన్స్, వడ్డీ, డివిడెండ్లు మొదలైనవన్నీ లెక్కలోకి తీసుకోండి. ప్రతి లావాదేవీకి వివరణ, కాగితాలను సమకూర్చుకోండి. ఫారం నింపే ముందు ఫారం 16, 16ఎ, 26ఏఎస్ మొదలైనవన్నీ పరిశీలించి చూసుకోండి. అంశాల్లో అంకెలు సరిపోలకపోతే... అంటే మిస్ మ్యాచ్ అయితే.. సరిచేసుకోండి. ప్రతీ మార్పు, చేర్పునకు వివరణ ఉంచుకోండి. అవసరం అయితే వృత్తి నిపుణులను సంప్రదించండి. ఇక, ఈ ప్రీ-ఫిల్డ్ ఫారంలలో కొన్ని సమస్యలు కూడా ఉంటున్నాయి. అవేంటంటే.. అంకెలు సరిపోలకపోవడం.. మిస్ మ్యాచ్ కేవలం టీడీఎస్ వివరాలు ఉంటున్నాయి. ఆదాయ వివరాలు ఉండటం లేదు. క్లోజ్ చేసిన బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా పొందుపర్చి ఉంటున్నాయి. కాబట్టి .. ఇలాంటివన్నీ చూసుకుని, తగు జాగ్రత్తలు తీసుకుని రిటర్నులు దాఖలు చేయాలి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
ఆదర్శప్రాయుడు
రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ సుబ్రమణ్యం ఆదాయపన్ను చెల్లింపులో అధికారులందరికీ ఆదర్శంగా నిలిచారు. 2016–17వ సంవత్సరానికి నిజాయితీగా పన్ను చెల్లించినందుకు ఆ శాఖ ఆయనను ప్రశంసిస్తూ మంగళవారం 'ప్రశంసా పత్రం' అందజేసింది.