ఆర్థిక సంవత్సరం 2023-24 ముగింపు సందర్భంగా కొన్ని ఆర్థిక లావాదేవీలకు గడువు ముగియనుంది. దాంతో కొన్ని సంస్థలు సెలవుదినాల్లోనూ తమ వినియోగదారులకు సేవలందించేందుకు సిద్ధపడుతున్నాయి. అందులో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కార్యాలయాలు శని, ఆదివారాలు (మార్చి 30, 31 తేదీల్లో) పని చేస్తాయని ప్రకటించింది.
పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది.
ఇదీ చదవండి: టికెట్ లేకుండా విమానం ఎక్కిన వ్యక్తి.. చివరికి ఏమైందంటే..
ఈ నేపథ్యంలోనే భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సూచనల మేరకు.. పాలసీదారులకు అవసరమైన సేవలను అందించేందుకు జోన్లు, డివిజన్ల పరిధిలోని కార్యాలయాలు సాధారణ పనివేళల వరకు తెరిచే ఉంటాయని ఎల్‌ఐసీ చెప్పింది. పన్ను శాఖ సంబంధిత కార్యకలాపాల కోసం, పెండింగ్‌లో ఉన్న డిపార్ట్‌మెంటల్ పనిని పూర్తి చేయడానికి దేశం అంతటా ఆదాయపు పన్ను కార్యాలయాలు మార్చి 30, 31 తేదీల్లో తెరిచే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.
Press Release: Special Measures for extending services to Policy Holders of LIC of India#LIC pic.twitter.com/qH4oNVe7Gi
— LIC India Forever (@LICIndiaForever) March 28, 2024
Comments
Please login to add a commentAdd a comment