TDS burden
-
అక్టోబర్ నుంచి ఆరు మార్పులు అమలు
ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి అక్టోబర్ 1 నుంచి ప్రధానంగా ఆరు మార్పులు అమల్లోకి వచ్చాయి. వివాద్ సే విశ్వాస్ పథకం ప్రారంభం, పాన్-ఆధార్, టీడీఎస్..వంటి నిబంధనల్లో మార్పలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అవి ఏంటో తెలుసుకుందాం.1. వివాద్ సే విశ్వాస్ పథకంప్రత్యక్ష పన్ను మదింపులో హెచ్చుతగ్గులు సహజం. ఈ పథకం ప్రకారం మనం లెక్కించిన దానికన్నా పన్ను భారం పెరిగితే మనం అప్పీలుకు వెళ్లవచ్చు. అలాగే డిపార్టుమెంటు వారు కూడా అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలుకు వెళ్లడం అంటే వివాదమే. ఈ వివాదాలు ఒక కొలిక్కి వచ్చేసరికి సమయం ఎంతో వృధా అవుతుంది. కాలయాపనతో పాటు మనశ్శాంతి లేకపోవటం, అశాంతి, అనారోగ్యం మొదలైనవి ఏర్పడతాయి. అటువంటి వివాదాల జోలికి పోకుండా పన్ను భారాన్ని వీలున్నంత వరకు తగ్గించి కట్టేలా చేసే స్కీమ్ ఇది. ఇది 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వివాదాలు పోయి ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పొందడమే దీని పరమావధి.2. ఆదార్ నంబర్ తప్పనిసరిపాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఆధార్ నంబరుకు బదులుగా గతంలో ఆధార్ కార్డు నమోదు ఐడీని నింపమనేవారు. కానీ ఇక నుంచి ఆ తంతు కొనసాగదు. కచ్చితంగా పాన్ దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్ వేయాల్సిందే. ఆధార్ నంబరు వేయకపోవడం వల్ల పాన్ విషయంలో దుర్వినియోగం అవుతోంది. పాన్, ఆధార్ కార్డు అనుసంధానం సరిగ్గా జరగడం లేదు. ఈ మార్పుతో జాప్యాన్ని, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.3. ఎస్టీటీ పెంపుస్టాక్మార్కెట్ ట్రేడింగ్ విషయంలో ఫ్యూచర్స్, ఆప్షన్స్‌కి సంబంధించి ఎస్టీటీ ఛార్జీని పెంచారు. ఇక నుంచి ఫ్యూచర్స్ విషయంలో ఈ రేటు 0.02%గా ఉంటుంది. అలాగే ఆప్షన్స్‌కి ఎస్టీటీ రేటు 0.01%గా ఉంటుంది. ఇవి ఈ మార్కెట్ వృద్ధికి తగ్గట్లుగా ఉంటాయని, రేట్ల క్రమబద్ధీకరణ జరుగుతుందని అంచనా.ఇదీ చదవండి: 70 ఏళ్లు నిండిన వారికి ఉచిత బీమా!4. ఫ్లోటింగ్ టీడీఎస్ రేటుఇది చిన్న మదుపర్లకు ఇబ్బంది కలగకుండా అంటే, బాండ్ల మీద సమకూరే వడ్డీ సంవత్సరానికి రూ.10,000 దాటితే వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల మీద 10 శాతం ఫ్లోటింగ్ రేటు అమలు చేస్తారు.5. బైబ్యాక్ షేర్లపై పన్నుఇక నుంచి మదుపర్లపై కాకుండా కంపెనీలకు పన్ను విధిస్తారు. ఎలాగైతే డివిడెండ్ల విషయంలో కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకొచ్చారో అలాగే దీన్ని కూడా ప్రతిపాదించారు.6. టీడీఎస్ రేట్ల సవరణకొన్ని టీడీఎస్ రేట్లను సవరించారు. సెక్షన్ 194D కింద బీమా కమీషన్ చెల్లింపులపై టీడీఎస్ రేటు 5% నుంచి 2%కు తగ్గించారు. జీవిత బీమా చెల్లింపులపై టీడీఎస్ రేటు 5% నుంచి 2% కు చేర్చారు. లాటరీ టికెట్ కమీషన్లపై ఈ రేటును 2% కి తగ్గించారు. -
Income Tax : జులై 1 నుంచి కొత్త టీడీఎస్ రూల్స్
గత రెండేళ్లుగా టీడీఎస్ ద్వారా పన్ను మినహాయింపు పొందిన వారికి గమనిక. ఆదాయపు పన్ను శాఖ కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలతో మీరు మీరు డబుల్ టీడీఎస్ కట్టాల్సి రావొచ్చు. రెండేళ్లుగా ఇన్‌కం ట్యాక్స్ కట్టకున్నా, టీడీఎస్ ద్వారా రూ. 50,000లకు మించి పన్ను మినహాయింపు పొందినా... కొత్త చట్టాల ప్రకారం మీరు ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి రావొచ్చు. జులై 1 నుంచి ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో టీడీఎస్ చెల్లించని వారు, ప్రతీ ఏడు టీడీఎస్ ద్వారా రూ.50వేలకు మించి మినహాయింపు దాటిన వారి నుంచి పన్ను వసూలు చేసేలా నిబంధనలు మారాయి. జులై 1 నుంచి వీరు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఎక్కువ ఛార్జీలు ఆదాయపు పన్ను శాఖకు చెల్లించే పరిస్థితి ఎదురు కావొచ్చు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇన్‌కం ట్యాక్స్‌కి సంబంధించిన ఈ ఫైలింగ్ పోర్టల్‌లో గత రెండేళ్ళుగా ఆదాయపు పన్ను దాఖలు అయిందా ? లేదా అని తెలుసుకోవడం మంచింది. ఇలా ఉండొచ్చు కొత్త సెక్షన్ 206 ఏబి కింద నిర్దుష్ట పన్ను చెల్లింపుదారులు గత రెండేళ్లుగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే అధికమొత్తంలో టీడీఎస్ చెల్లించాల్సి వస్తుంది. ఈ అధిక టీడీఎస్ రేటు సంబంధిత విభాగం కంటే రెండు రెట్లు లేదా అమలులో ఉన్న రేటుకు రెండింతలు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్త సెక్షన్లు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే వారి సంఖ్య పెంచడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు 2021 బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త టీడీఎస్ రేట్లు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయని వారికి టీడీఎస్ అధికరేట్లు విధించేందుకు 206 ఏబి, 206 సీసీఏ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చదవండి : పెట్రోల్, డీజిల్‌లతోకాదు.. ..ఇథనాల్‌తో నడిచేలా .. -
టీడీఎస్ భారం తగ్గించుకుందామిలా..
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది. జనవరి నెల వచ్చిందంటే చాలు ఆఫీసులోని హెచ్ఆర్ సిబ్బంది మీ ఇన్వెస్ట్మెంట్ వివరాలను ఇవ్వమని కోరతారు. వీటిని ఇవ్వకపోతే టీడీఎస్ పేరుతో మీ జీతం నుంచి భారీ కోతలు కోస్తారు. సరైన ప్రణాళికతో వెళితే ఈ టీడీఎస్ భారం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. పన్ను భారం తప్పించుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 80సీ ప్రధానమైనది. ఈ సెక్షన్ ప్రకారం రూ. 1.5 లక్షలు ఆదాయం నుంచి తగ్గించి చూపించుకునే వెసులుబాటు ఉంటుంది. ఎటువంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒక చక్కటి సాధనం. ఇందులో గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ మొత్తంపై పన్ను లాభాలను పొందవచ్చు. మీ పేరున లేదా మీపై ఆధారపడి జీవించే వారి పేరు మీద ఈ అకౌంట్ ప్రారంభించొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై 8.7 శాతం వడ్డీ లభిస్తోంది. నెలలో ఒకటవ తేదీ నుంచి అయిదవ తేదీ లోపల ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా నెల మొత్తానికి వడ్డీ లభిస్తుంది. 5 తర్వాత ఇన్వెస్ట్ చేస్తే ఆ నెల మొత్తానికి వడ్డీ లభించదు. దీని కాలపరిమతి 15 ఏళ్లు. సెక్షన్ 80సీ పరిధిలోకి అనేక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు, వ్యయాలు వస్తాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్), న్యూ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ (పోస్టాఫీసుల్లో లభిస్తాయి), ట్యాక్స్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, ఇద్దరు పిల్లలకు చెల్లించే స్కూలు, కాలేజీ ట్యూషన్ ఫీజులు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇంటి గృహరుణానికి చెల్లించే ఈఎంఐలో అసలు వాటా ఇవన్నీ 80సీ పరిధిలోకే వస్తాయి. వీటిల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. పన్ను లాభాల కోసమే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించకండి. గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలు సరిపోయింది కదా అని ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆపొద్దు. ఈ పథకాలు మీ భవిష్యత్తు ఆర్థిక అవసరాలు, రిటైర్మెంట్కు తోడ్పాటును అందిస్తాయి. హెచ్ఆర్ఏ ఒకవేళ మీరు ఇంటి అద్దె చెల్లిస్తుంటే దాని నుంచి కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రయోజనం పొందాలంటే మీరు పనిచేసే సంస్థ హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అద్దెను చెక్ రూపంలో చెల్లించి, దానికి సంబంధించిన రశీదులను దగ్గర పెట్టుకోండి. ఇంటి ఓనర్ పాన్ నంబర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ పన్ను ప్రయోజనాలను లెక్కించడానికి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఆదాయం నుంచి తగ్గించి చూపిస్తారు. 1. కంపెనీ ఇస్తున్న వాస్తవ హెచ్ఆర్ఏ అలవెన్స్. 2. చెల్లిస్తున్న అద్దెలోంచి బేసిక్ శాలరీలో 10 శాతం తీసివేయగా వచ్చే మొత్తం. 3. మెట్రోలో నివసిస్తుంటే బేసిక్ శాలరీలో 50 శాతం, ఇతర పట్టణాల్లో అయితే 40 శాతం. ఒకవేళ మీకు సొంతిల్లు ఉండి, అది పనిచేస్తున్న కార్యాలయానికి దూరంగా ఉండటం వల్ల అద్దె ఇంట్లో ఉంటే కూడా హెచ్ఆర్ఏ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవచ్చు. రుణాలపై.. రుణం తీసుకొని ఇంటిని నిర్మిస్తే లేదా కొంటే...దానిపై రెండు రకాల పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రుణానికి చెల్లించే ఈఎంఐలో అసలుకు చెల్లించిన మొత్తంపై సెక్షన్ 80సీ ప్రయోజనం లభిస్తుంది. చెల్లించే వడ్డీపై సెక్షన్ 24 కింద గరిష్టంగా రూ. 2 లక్షలు ఆదాయం నుంచి మినహాయించుకోవచ్చు. బ్యాంకు నుంచి అసలు, వడ్డీ రూపంలో ఎంత మొత్తం చెల్లించారో కాగితం తీసుకొని అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. ఇవి కాకుండా మీ ఉన్నత చదువుల కోసం లేదా భార్యా పిల్లల చదువుల కోసం తీసుకొనే రుణాలపై ఎటువంటి పరిమితి లేకుండా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి కాకుండా సెక్షన్ 80జీ కింద వివిధ సంస్థలకు ఇచ్చే విరాళాలపై కూడా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సకాలంలో ఈ వివరాలన్నీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఇవ్వడం ద్వారా వచ్చే మూడు నెలలు జీతంలో భారీ కోతల నుంచి తప్పించుకోవచ్చు. - అనిల్ రెగో సీఈవో, రైట్ హొరైజన్స్