గత రెండేళ్లుగా టీడీఎస్ ద్వారా పన్ను మినహాయింపు పొందిన వారికి గమనిక. ఆదాయపు పన్ను శాఖ కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలతో మీరు మీరు డబుల్ టీడీఎస్ కట్టాల్సి రావొచ్చు. రెండేళ్లుగా ఇన్‌కం ట్యాక్స్ కట్టకున్నా, టీడీఎస్ ద్వారా రూ. 50,000లకు మించి పన్ను మినహాయింపు పొందినా... కొత్త చట్టాల ప్రకారం మీరు ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి రావొచ్చు.
జులై 1 నుంచి
ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో టీడీఎస్ చెల్లించని వారు, ప్రతీ ఏడు టీడీఎస్ ద్వారా రూ.50వేలకు మించి మినహాయింపు దాటిన వారి నుంచి పన్ను వసూలు చేసేలా నిబంధనలు మారాయి. జులై 1 నుంచి వీరు ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ఎక్కువ ఛార్జీలు ఆదాయపు పన్ను శాఖకు చెల్లించే పరిస్థితి ఎదురు కావొచ్చు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇన్‌కం ట్యాక్స్‌కి సంబంధించిన ఈ ఫైలింగ్ పోర్టల్‌లో గత రెండేళ్ళుగా ఆదాయపు పన్ను దాఖలు అయిందా ? లేదా అని తెలుసుకోవడం మంచింది.
ఇలా ఉండొచ్చు
కొత్త సెక‌్షన్ 206 ఏబి కింద నిర్దుష్ట పన్ను చెల్లింపుదారులు గత రెండేళ్లుగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే అధికమొత్తంలో టీడీఎస్ చెల్లించాల్సి వస్తుంది. ఈ అధిక టీడీఎస్ రేటు సంబంధిత విభాగం కంటే రెండు రెట్లు లేదా అమలులో ఉన్న రేటుకు రెండింతలు ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కొత్త సెక‌్షన్లు
ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే వారి సంఖ్య పెంచడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు 2021 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కొత్త టీడీఎస్ రేట్లు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయని వారికి టీడీఎస్ అధికరేట్లు విధించేందుకు 206 ఏబి, 206 సీసీఏ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment