teacher misbehave
-
కీచక ఉపాధ్యాయుడు.. ప్రత్యేక తరగతులని చెప్పి విద్యార్థినిని..
సాక్షి, హుస్నాబాద్: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జనగామ జిల్లా నర్మెట్టకు చెందిన ఏనుగు రవి ఈనెల 20న బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక తరగతులు ఉన్నాయని, కాలేజీకి రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన సోదరుడితో కలిసి బైక్‌పై కళాశాలకు వచ్చింది. ఆదివారం కావడం, కళాశాల మూసి ఉండడంతో వెంటనే ఉపాధ్యాయుడికి ఫోన్ చేసింది. తాను నర్మెట్ట నుంచి వస్తున్నాని, లద్నూరు వరకు రావాలని విద్యార్థినికి సూచించాడు. యువతి తన సోదరుడితో కలిసి లద్నూరుకు వెళ్లింది. ఉపాధ్యాయుడు చెప్పిన చోటుకు నడుచుకుంటూ వెళ్లగా, అతడు తన బైక్‌పై ఎక్కించుకొని లద్నూరు రిజర్వాయర్ పైకి తీసుకువెళ్లాడు. గమనించిన యువతి సోదరుడు మరికొంత మందితో కలిసి ఉపాధ్యాయుడిని వెంబడించి పట్టుకున్నారు. ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థిని ఎక్కడి తీసుకువెళుతున్నావని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి సోదరుడు, మరికొంత మంది కలిసి ఉపాధ్యాయుడు రవికి దేహశుద్ధి చేశారు. ఈ విషయంపై ఎస్ఐ నారాయణను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సెపరేటు.. దొంగలతో చేతులు కలిపి -
విద్యార్థినికి టీచర్ ప్రేమలేఖ!
సాక్షి, అనంతపురం: తల్లిదండ్రుల తర్వాత గురువు దేవుడితో సమానం అంటారు. అదే నమ్మకంతోనే తల్లిదండ్రులు యుక్తవయసులో ఉన్న ఆడ పిల్లలను కూడా ధైర్యంగా పాఠశాలలకు పంపుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువుకు సమాజంలో ఎనలేని స్థానం ఉంది. అయితే గురువు అనే పదానికి మాయని మచ్చలా వ్యవహరించాడు రామగిరి మండలం నసనకోటలోని మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలోని ఓ టీచరు. వివరాల్లోకి వెళ్తే.. ఈ స్కూల్లో 5 నుంచి 9వ తరగతి వరకు బాలికలు చదువుతున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు కొంతకాలంగా ఓ విద్యార్థినిపై కన్నేశాడు. అభంశుభం తెలియని అమ్మాయిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. తరచూ ఆ బాలికతో ప్రత్యేకంగా మాట్లాడేవాడు. వెకిలిచేష్టలకు పాల్పడేవాడు. తోటి విద్యార్థినులతో పాటు కొందరు ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించారు. సదరు టీచరును హెచ్చరించినట్లు తెలిసింది. అయినా అతడిలో మార్పు రాలేదు. తరచూ బాలికకు ప్రేమలేఖలు రాస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం గుట్టుగా వ్యవహరించింది. అదికాస్తా గ్రామస్తులకు నాలుగు రోజుల కిందట తెలిసింది. స్కూల్‌కు వచ్చి యాజమాన్యంతో గొడవకు దిగారు. కీచక గురువుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో సదరు టీచరును మూడు రోజుల కిందట స్కూల్ నుంచి పంపించేశారు. చిన్నపిల్లలను ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఇలాంటి టీచర్లను శిక్షించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్కూల్ ప్రిన్సిపల్ సంగీతకుమారిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆ టీచరును స్కూల్ నుంచి తప్పించామన్నారు. -
వివాహితకు ఉపాధ్యాయుడి వేధింపులు
సాలూరు: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి, పదిమందికీ మంచీ చెడు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే తప్పుదారిలో వెళ్లి చావుదెబ్బలు తిన్నాడు. సదరు ఉపాధ్యాయుడు ఓ గృహిణిని సెల్ఫోన్లో లైంగిక వేధింపులకు గురిచేయడంతో విషయం బయటపడింది. బాధిత మహిళతోపాటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన ఐ. గున్నరాజు, మామిడిపల్లి గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పట్టణంలోని కోటవీధికి చెందిన ఓ వివాహితపై నిందితుడు కన్నేశాడు. ఆమె భర్తకు దూరంగా కుమారునితో కలిసి తల్లివద్ద ఉంటోందని తెలుసుకున్న గున్నరాజు కొద్దిరోజులుగా ఆమెకు ఫోన్‌చేస్తూ లైంగికంగా వేధించసాగాడు. ఎప్పటిలాగే గున్నరాజు ఆదివారం రాత్రి ఆమెకు ఫోన్‌చేసి అసభ్యంగా మాట్లాడాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన సమీప బంధువులు, స్నేహితులకు చెప్పి బోరుమంది. నిందితుడు ఎక్కడున్నాడో తెలుసుకుని బాధితురాలి బంధువులు, స్నేహితులు అక్కడకు వెళ్లి ఉపాధ్యాయుడిని చితకబాదారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి గృహిణి, ఉపాధ్యాయుడి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. -
విద్యార్థినులపట్ల లెక్కల మాస్టర్ వికృతచేష్టలు
పాఠశాలలోని విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సిన మాస్టారే వక్రమార్గం పట్టాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం పాఠాశాలలోని లెక్కల మాస్టారు నాగేశ్వరరావు తరగతి గదిలో విద్యార్థిని విద్యార్థుల ముందు ద్వంద్వర్థాలు మాట్లాడటమే కాకుండా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విద్యార్థినులు టీచర్ పై తల్లితండ్రులకు ఫిర్యాదు చేశారు. దాంతో విద్యార్థిని విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకుని, టీచర్‌ను వెంటనే విధుల నుంచి ఆ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు వెంటనే స్పందించి లెక్కల టీచర్ నాగేశ్వరరావు విచారణ జరిపించి, టీచర్‌పై తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లితండ్రులకు హామీ ఇచ్చారు.