విద్యార్థినులపట్ల లెక్కల మాస్టర్ వికృతచేష్టలు | High School teacher accused of sexual misconduct with students | Sakshi
Sakshi News home page

విద్యార్థినులపట్ల లెక్కల మాస్టర్ వికృతచేష్టలు

Published Fri, Dec 20 2013 12:31 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

High School teacher accused of sexual misconduct with students

పాఠశాలలోని విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సిన మాస్టారే వక్రమార్గం పట్టాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం పాఠాశాలలోని లెక్కల మాస్టారు నాగేశ్వరరావు తరగతి గదిలో  విద్యార్థిని విద్యార్థుల ముందు ద్వంద్వర్థాలు మాట్లాడటమే కాకుండా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో విద్యార్థినులు టీచర్ పై తల్లితండ్రులకు ఫిర్యాదు చేశారు.

 

దాంతో విద్యార్థిని విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాలకు చేరుకుని, టీచర్ను వెంటనే విధుల నుంచి ఆ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు వెంటనే స్పందించి లెక్కల టీచర్ నాగేశ్వరరావు విచారణ జరిపించి, టీచర్పై తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లితండ్రులకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement