team arrested
-
తక్కువ ధరకు బంగారమంటూ మోసం
కొత్తగూడెం : తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసగించిన ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగారాన్ని తక్కువ ధరకు ఇస్తానంటూ ఓ వ్యక్తిని ఏడుగురు యువకులు మోసం చేశారు. దీంతో పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.3.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ శ్రీనివాస రాజు తెలిపారు. -
అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
- కరాచీ టు సిటీ వయా షార్జా... - ముగ్గురు నిందితుల అరెస్టు, రూ.9 లక్షలు సీజ్ - తొలిసారిగా వెలుగులోకి విమానమార్గ రవాణా హైదరాబాద్ : పాకిస్థాన్‌లో ముద్రితమైన నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ తీసుకువచ్చిన అంతర్జాతీయ ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.9 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం వెల్లడించారు. వీరి అరెస్టుతో నకిలీ నోట్లు విమానాల ద్వారానూ హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అఖీల్ మార్ఫానీ వృత్తిరీత్యా కార్పెంటర్ కావడంతో బతుకు తెరువు కోసం గతంలో సౌదీ వెళ్ళాడు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం నగరంలోనే నివసించిన ఇతగాడు గత ఏడాది జూలైలో షార్జా వెళ్ళాడు. అక్కడి ఓ శానిటరీ షాపులో కార్పెంటర్‌గా చేరాడు. అనారోగ్యంతో బాధపడిన ఇతగాడు కొన్ని రోజుల పాటు ఉద్యోగానికి వెళ్ళకపోవడంతో అప్పులు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్ఫానీ ఆర్థిక ఇబ్బందులపై ఫోన్ ద్వారా పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న తన మేనమామ మహ్మద్ యాసీన్‌కు చెప్పాడు. మొఘల్‌పుర ప్రాంతానికే చెందిన అతను దాదాపు 26 ఏళ్ళుగా కరాచీలో నివసిస్తున్నాడు. మార్ఫానీ ద్వారా విషయం తెలుసుకున్న యాసీన్ పాకిస్థాన్‌లో పక్కాగా ముద్రిమతమ్యే భారత నకిలీ నోట్ల మార్పిడి చేస్తే మంచి లాభాలు ఉంటాయని సలహా ఇచ్చాడు. ప్రాథమికంగా రూ.2 లక్షలు నగరంలోని మార్ఫానీ కుటుంబానికి పంపించాడు. ఆపై తన ఏజెంట్ ద్వారా రూ.వెయ్యి, రూ.500 డినామినేషన్లో ఉన్న రూ.9 లక్షల నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జాకు పంపుతానన్నాడు. ఆ నగదును హైదరాబాద్ తీసుకువెళ్ళి చెలామణి చేయాలని, తన వాటాగా రూ.3 లక్షలు ఇస్తే చాలని మార్ఫానీతో చెప్పాడు. దీనికి మార్ఫానీ అంగీకరించడంతో దుబాయ్‌లోని డేరా ప్రాంతంలో ఉన్న ఏజెంట్ ద్వారా యాసీన్ నకిలీ నోట్లు అందించాడు. ఈ నోట్లను ఓ బ్యాగ్ అడుగు భాగంగా నేర్పుగా పేర్చిన మార్ఫానీ దాన్ని తీసుకుని ఈ నెల 3న స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా నకిలీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌ను బ్యాగేజ్లో వేసి తీసుకువచ్చాడు. దీన్ని ఏ దశలోనూ అధికారులు గుర్తించకపోవడంతో నకిలీ నోట్లు బ్యాగ్‌ను మార్ఫానీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కొన్ని రోజుల పాటు రహస్య ప్రదేశంలో దాచి మార్పిడి కోసం తన స్నేహితులైన ఘియాస్ మోహియుద్దీన్ (హుస్సేనిఆలం), మహ్మద్ తౌఫీఖ్ అహ్మద్ (సంగారెడ్డి) సహాయం తీసుకోవాలని నిర్ణయించాడు. వాటాలు ఇస్తానని చెప్పడంతో వీరిద్దరూ ముందుకు వచ్చారు. ఈ ముగ్గురూ కలిసి నకిలీ నోట్లను మార్పిడి చేసే యత్నాల్లో ఉన్నారనే సమాచారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ శ్రీకాంత్‌కు అందింది. ఆయన సమాచారంతో అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య, ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్ కుమార్, కేఎస్ రవి తమ బృందాలతో వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. కేసును మహంకాళి పోలీసులకు అప్పగించామని, కరాచీలో ఉన్న యాసీన్ కోసం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తామని డీసీపీ తెలిపారు. -
నకిలీ నోట్ల ముఠా అరెస్టు
రూ. 15.84 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం ఐదుగురి అరెస్టు రాజమహేంద్రవరం క్రైం : నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం పోలీస్ గెస్ట్ హౌస్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజ కుమారి, అడిషినల్ ఎస్పీ రెడ్డి గంగాధర్ ఆ వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కడియం పోలీస్ స్టేషన్ సీఐ, ఆయన సిబ్బంది కడియం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డుపై వాహనాలను తనిఖీ చేస్తుండగా అనపర్తి వైపు నుంచి వస్తున్న మారుతీ కారు, మూడు మోటారు సైకిళ్లపై వస్తున్న వారిని తనిఖీ చేయగా వారి వద్ద నకిలీ రూ. 1000 నోట్లు లభించాయి. అనపర్తి, సావరం గ్రామానికి చెందిన కొవ్వూరి శ్రీనివాస రెడ్డి , బలభద్రపురం గ్రామానికి చెందిన నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, పొలమూరు గ్రామానికి చెందిన కర్రి రామకృష్ణారెడ్డి, అనపర్తికి చెందిన షేక్ సులూన్ సాహెచ్, కత్తిపూడికి చెందిన బర్నికల వీర వెంకట సత్యనారాయణలు ఒక్కొక్కరి నుంచి రూ.1000 నకిలీ నోట్ల కట్ట లక్ష రూపాయలు చొప్పున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నకిలీ నోట్లు తయారు చేయడానికి ఉపయోగించే కలర్ జిరాక్స్ మిషన్, కట్టర్, ప్రింటింగ్ కు ఉపయోగించే కటిరేడ్స్ కలర్స్ బాటిల్స్, నోట్లు ముద్రించేందుకు ఉపయోగించే పేపర్లు పొలమూరులోని కొవ్వూరి శ్రీనివాస రెడ్డి ఇంటి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్స్ వ్యాపారం పేరుతో చలామణి వీరు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ నకిలీ నోట్లు రుణగ్రహీతలకు ఇచ్చి చలామణి చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. కొవ్వూరి శ్రీనివాస రెడ్డి కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ నోట్ల చెలామణి కేసులో అరెస్టు అయ్యాడని తెలిపారు. అదే విధంగా కర్రి రామMýృష్ణ కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అరెస్టు అయ్యాడని పేర్కొన్నారు. రూ. 15 లక్షలు నకిలీ నోట్లు వేరే వారికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని రూ. 25 వేలతో కలర్ ప్రింటర్, పేపర్, కట్టర్, కలర్స్ కొనుగోలు చేశారని ఎస్పీ రాజకుమారి తెలిపారు. సత్తిరెడ్డి ఆధ్వర్యంలో వీటిని ముద్రించి చలామణి చేసేందుకు పథకం పన్నారని తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. ఈ ముఠాను అరెస్టు చేయడానికి సహకరించిన క్రైం డీఎస్పీ ఎ. సత్యనారాయణ, ఎస్సై జీవీ నారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎస్వీ రమణ, కె. సురేష్, కానిస్టేబుల్ వి. Mýృష్ణలకు అభినందనలు తెలిపారు. -
విదేశీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
కాకినాడలో 8 మంది అరెస్టు చలామణిలో లేని టర్కీ దేశ 5 లక్షల లిరాసినోట్లు 99 స్వాధీనం కాకినాడ సిటీ : చలామణిలో లేని విదేశీ కరెన్సీతో మోసగించి డబ్బు సంపాదించాలనుకున్న ముఠా గుట్టురట్టయ్యింది. కాకినాడ కోకిలా సెంటర్ సమీపంలోని జేఎంఎస్ సీఎన్ఆర్ అపార్ట్మెంట్లో ఈ ముఠా ఉన్నట్టు సమాచారం అందడంతో టూ టౌన్ పోలీసులు దాడిచేసి అక్కడ ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి టర్కీ దేశానికి చెందిన ఐదు లక్షల లిరాసి నోట్లు 99 స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు శనివారం టూ టౌన్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో తెలియ జేశారు. 2009–10లో టర్కీలో సంభవించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఐదు లక్షల లిరాసి నోట్లను నిషేధించారు. అవి ప్రస్తుతం చలామణిలో లేవని డీఎస్పీ తెలిపారు. అయితే ఆనోట్లను మోసపూరితంగా అమ్మడానికి ముఠా ప్రయత్నించిందన్నారు. వారి వద్ద నుంచి 5 లక్షల లిరాసి నోట్లు 99 స్వాధీనం చేసుకున్నామన్నారు. భారతదేశ రూపాయల్లో చూస్తే వాటి విలువ సుమారు రూ.108 కోట్ల 90 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన పట్నం శంకర్, తోలేటి ప్రకాష్, డేగల శ్రీరామకృష్ణ, నెల్లూరుకు చెందిన కుదిరి విజయభాస్కరరావు, కాకినాడకు చెందిన మిరియం లక్ష్మీనారాయణ, వాడపర్తి వెంకటేష్, రాజోలుకు చెందిన రేఖపల్లి సురేష్, రాజమండ్రికి చెందిన రాయుడు సత్యనారాయణలను కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు. ఈ ముఠాతో పాటు ఇంకా కొంత మంది ఉన్నట్టు తెలిసిందని, ఈ కేసుతో సంబంధం ఉన్నవారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సీఐలు చైతన్యకృష్ణ, దుర్గారావు పాల్గొన్నారు. -
నకిలీ సరుకుల తయారీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నిత్యావసర సరుకులను కల్తీ చేస్తున్న ఓ ముఠాను కుషాయిగూడ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పసుపు, కుంకుమతో పాటు మసాల దినుసులను కల్తీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 క్వింటాళ్ల కల్తీ పసుపు, 2 క్వింటాళ్ల మసాల దినుసులను స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుడు మధును అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.