Team india selection
-
షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్ 9న డెడ్‌లైన్!
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ టి20 ప్రపంచకప్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే స్టాండ్ బై ప్లేయర్‌గా కాకుండా షమీని ప్రధాన జట్టులోకి తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఆసీస్‌తో జరిగిన టి20 సిరీస్‌కు దూరమైన షమీ ఇంకా కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది. ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌కు మరో నెలరోజులు సమయం ఉండడంతో ఈలోగా షమీ కోలుకుంటే స్టాండ్ బై ప్లేయర్ నుంచి ప్రధాన జట్టులోకి తీసుకోవాలని అభిమానులు సహా క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. స్టాండ్ బై ప్లేయర్‌గా ఉంటే.. ప్రధాన జట్టులో ఎవరైనా గాయపడితేనే అప్పుడు టీంలోకి రావడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో షమీ టి20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉన్నప్పటికి మ్యాచ్ ఆడే అవకాశం ఉండదు. అయితే ఆస్ట్రేలియాలోని పిచ్‌లు షమీకి సరిగ్గా సరిపోతాయని.. అతను వేసే లైన్ అండ్ లెంగ్త్ డెలివరీలు ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడం ఖాయమని భావిస్తున్నారు. హర్షల్ పటేల్, భువనేశ్వర్‌లు విఫలమవుతున్న వేళ షమీ లాంటి పేసర్ సేవలు ఆస్ట్రేలియాలో ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. మరి స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న మహ్మద్ షమీని టీమిండియా ప్రధాన జట్టులోకి తీసుకోవచ్చా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం అక్టోబర్ 9 వరకు టి20 ప్రపంచకప్ ఆడనున్న ఆయా జట్లు తమ టీంలో మార్పులు.. చేర్పులు చేసుకోవచ్చు. అయితే ఎంపిక చేయాలనుకున్న ఆటగాడు ఎలాంటి గాయాలతో బాధపడకూడదు.. కచ్చితంగా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు రూల్స్ సరిగ్గా ఉంటే ఏ జట్టైనా తమ టీంను మార్చుకునే హక్కు ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఇక డెడ్‌లైన్(అక్టోబర్ 9) ముగిసిన తర్వాత ఐసీసీ అనుమతి తీసుకోవాల్సిందే. ఇక టీమిండియాతో ముగిసిన టి20 సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరున్ గ్రీన్ అదరగొట్టాడు. రెండు అర్థసెంచరీలతో రాణించిన గ్రీన్ వాస్తవానికి టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో లేడు. అయితే అతని ఆటతీరుకు ఫిదా అయిన క్రికెట్ ఆస్ట్రేలియా కామెరున్ గ్రీన్‌కు జట్టులో చోటు కల్పించాలని భావిస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోనుంది. దీంతో టీమిండియా అభిమానులు కూడా షమీని ప్రధాన జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అభిమానుల విజ్ఞప్తిని పట్టించుకొని షమీని బీసీసీఐ ప్రధాన జట్టులోకి ఎంపిక చేస్తుందేమో చూడాలి. ఎలాగో అక్టోబర్ 9 వరకు సమయం ఉంది కాబట్టి ఈలోగా షమీ కోలుకుంటే ఫిట్నెస్ నిరూపించుకునే అవకాశం ఉంది. ఇక అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న టి20 ప్రపంచకప్‌లో మొదట క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫయింగ్‌లో రెండు గ్రూఫ్‌ల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. ఇక అసలు సమరం అయిన సూపర్-12 దశ అక్టోబర్ 23 నుంచి మొదలుకానుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 24న(ఆదివారం) తలపడనుంది. చదవండి: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై సిరీస్ క్లీన్‌స్వీప్.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్‌వాక్ -
30 ఏళ్లు దాటిన వారిని టీమిండియాకు ఎంపిక చేయరట..!
ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేసే విధానంపై భారత వెటరన్ ఆటగాడు షెల్డన్ జాక్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో భారత సెలక్లర్లు అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేయట్లేదని ఓ సెలక్షన్ అధికారి తనతో చెప్పినట్లు పేర్కొన్న జాక్సన్.. వయసును సాకుగా చూపి భారత సెలక్టర్లు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా తనను టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 30 ఏళ్లు పైబడిన వారిని టీమిండియాకు ఎంపిక చేయకూడదనే చట్టం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. ఇలా ఏదైనా ఉంటే ఇటీవల ఓ 32 ఏళ్ల ఆటగాడిని భారత జట్టుకు ఎలా ఎంపిక చేశారని నిలదీశాడు. ప్రతి ఒక్క క్రికెటర్‌కు భారత జట్టుకు ఆడాలన్నది ఓ కల అని, దాన్ని సాకారం చేసుకునేందుకే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారని అన్నాడు. సెలక్టర్ల నుంచి పిలుపు అందే వరకు తన ప్రయత్నాలను విరమించేదేలేదని చెప్పుకొచ్చాడు. కాగా, 35 ఏళ్ల జాక్సన్ గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన జాక్సన్.. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన జాక్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50కి పైగా సగటుతో సత్తా చాటుతున్నాడు. 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 19 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సాయంతో 5634 పరుగులు చేశాడు. చదవండి: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా బౌలర్ -
యువరాజ్ సింగ్ మళ్లీ వచ్చేశాడు
-
యువరాజ్ సింగ్ మళ్లీ వచ్చేశాడు
ముంబై: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. ఎంఎస్ ధోని తప్పుకోవడంలో కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లికి అప్పగించారు. ఇంగ్లండ్ తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ఎంపిక చేసింది. కెప్టెన్ గా తప్పుకున్న ధోని వికెట్ కీపర్ గా కొనసాగుతాడు. ఆశ్చర్యకరంగా మూడేళ్ల తర్వాత యువరాజ్ సింగ్ జట్టులో చోటు సంపాదించాడు. వన్డే, టీ20 సిరీస్ కు అతడిని ఎంపిక చేశారు. సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా, బ్యాట్స్ మన్ సురేశ్ రైనాలకు మరోసారి పిలుపువచ్చింది. వీరిద్దరికీ టీ20 టీమ్ లో చోటు కల్పించారు. ధావన్ కు టీ20 జట్టులో చోటు దక్కలేదు. యువ బౌలర్లు రిషబ్ పంత్, చాహల్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. ట్రిఫుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ కు చాన్స్ దక్కలేదు. వన్డే టీమ్: కోహ్లి(కెప్టెన్), ధోని(వికెట్ కీపర్), రాహుల్, ధావన్, మనీష్ పాండే, జాదవ్, యువరాజ్ సింగ్, రహానే, పాండ్యా, అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రా, బుమ్రా, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ టీ20 టీమ్: టీ20 టీమ్: కోహ్లి(కెప్టెన్), ధోని(వికెట్ కీపర్), రాహుల్, సురేశ్ రైనా, మన్దీప్, మనీష్ పాండే, యువరాజ్ సింగ్, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, బుమ్రా, భువనేశ్వర్, రిషబ్ పంత్, చాహల్, మనీష్, ఆశిష్ నెహ్రా -
యువరాజ్ సింగ్‌కు ఉద్వాసన
న్యూఢిల్లీ: వరుసగా విఫలమవుతున్న సీనియర్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌కు సెలెక్షన్ కమిటీ షాక్ ఇచ్చింది. వన్డే జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికింది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును సెలెక్షన్ కమిటీ నేడు ఎంపిక చేసింది. యువరాజ్ సింగ్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో కర్ణాటక ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి వచ్చాడు. బౌలర్ మొహిత్ శర్మకు మొండిచేయి చూపారు. అతడి స్థానంలో పేసర్ వరుణ్ ఆరోన్‌ను తీసుకున్నారు. మధ్యప్రదేశ్ సీమర్ ఈశ్వర్ పాండే 'డబుల్' సాధించాడు. వన్డే, టెస్టు టీమ్‌లో అతడు చోటు సంపాదించాడు. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. టెస్టు టీమ్: ధోనీ(కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, పూజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, ఈశ్వర్ పాండే వన్డే టీమ్: ధోనీ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రహానే, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, ఈశ్వర్ పాండే