ముంబై: టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లి ఎంపికయ్యాడు. ఎంఎస్ ధోని తప్పుకోవడంలో కెప్టెన్సీ బాధ్యతలు కోహ్లికి అప్పగించారు. ఇంగ్లండ్ తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు జట్టును సెలక్షన్ కమిటీ శుక్రవారం ఎంపిక చేసింది. కెప్టెన్ గా తప్పుకున్న ధోని వికెట్ కీపర్ గా కొనసాగుతాడు.
ఆశ్చర్యకరంగా మూడేళ్ల తర్వాత యువరాజ్ సింగ్ జట్టులో చోటు సంపాదించాడు. వన్డే, టీ20 సిరీస్ కు అతడిని ఎంపిక చేశారు. సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా, బ్యాట్స్ మన్ సురేశ్ రైనాలకు మరోసారి పిలుపువచ్చింది. వీరిద్దరికీ టీ20 టీమ్ లో చోటు కల్పించారు. ధావన్ కు టీ20 జట్టులో చోటు దక్కలేదు. యువ బౌలర్లు రిషబ్ పంత్, చాహల్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నారు. ట్రిఫుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ కు చాన్స్ దక్కలేదు.
వన్డే టీమ్:
కోహ్లి(కెప్టెన్), ధోని(వికెట్ కీపర్), రాహుల్, ధావన్, మనీష్ పాండే, జాదవ్, యువరాజ్ సింగ్, రహానే, పాండ్యా, అశ్విన్, జడేజా, అమిత్ మిశ్రా, బుమ్రా, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్
టీ20 టీమ్:
టీ20 టీమ్: కోహ్లి(కెప్టెన్), ధోని(వికెట్ కీపర్), రాహుల్, సురేశ్ రైనా, మన్‌దీప్, మనీష్ పాండే, యువరాజ్ సింగ్, హార్ధిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, బుమ్రా, భువనేశ్వర్, రిషబ్ పంత్, చాహల్, మనీష్, ఆశిష్ నెహ్రా