technical cooperation
-
ఓఎన్జీసీతో టోటల్ఎనర్జీస్ జట్టు
న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ క్షేత్రాల్లో కొత్త నిక్షేపాల వెలికితీతకు అవసరమైన సాంకేతిక సహకారం కోసం ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ అంతర్జాతీయ సంస్థలతో చేతులు కలుపుతోంది. ఇందులో భాగంగా తాజాగా మహానది, అండమాన్ క్షేత్రాలకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ఎనర్జీస్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సముద్ర లోతుల్లో నిక్షేపాల అన్వేషణకు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్జీసీ) ట్విటర్లో వెల్లడించింది. ఎక్సాన్‌మొబిల్, షెవ్రాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఓఎన్జీసీ ఇప్పటికే ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఓఎన్జీసీకి వివిధ ప్రాంతాల్లో గ్యాస్, చమురు నిక్షేపాల వెలికితీత, ఉత్పత్తికి లైసె న్సు ఉంది. అయితే, కంపెనీకి కేటాయించిన క్షేత్రా ల్లో ఉత్పత్తి తగ్గిపోతుండటంతో పాటు కొత్తగా మరే నిక్షేపాలు ఇటీవలి కాలంలో బైటపడటం లేదు. దీంతో సంక్లిష్టమైన క్షేత్రాల్లో గ్యాస్, చమురు నిల్వలను అన్వేషించేందుకు, ఉత్పత్తిని పెంచుకునేందుకు ఓఎన్జీసీ ఇతర సంస్థలతో జట్టు కడుతోంది. -
టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు: ఏపీ-ఎఫ్ఏవో మధ్య ఒప్పందం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యునైటెడ్ నేషన్స్‌కు చెందిన పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) బృందం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ప్రతినిధులు కలిశారు. సుస్థిర వ్యవసాయ–ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడంతో పాటు రాష్ట్రంలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు ఎఫ్ఏఓ– ఏపీల మధ్య టీసీపీ(టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు) ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య.. టోమియో షిచిరి, కంట్రీ డైరెక్టర్ (ఇండియా), పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) యునైటెడ్ నేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏ కె సింగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. చదవండి: CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ నూతన ఏడాది కానుక అందరికీ ఆహార భద్రతపై అంతర్జాతీయంగా ఏఫ్ఏఓ కృషి చేస్తోంది. రాష్ట్రంలో ఆర్బీకేలకు సాంకేతికంగా, ఆర్ధికంగా సాయం అందించనుంది. రైతు భరోసా కేంద్రాల బలోపేతం చేసేందుకు ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ సహకరించనున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు ఎఫ్ఏఓ శిక్షణ అందించనుంది. ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతుల్లోనూ రైతులకు శిక్షణ అందించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులను ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఆర్బీకేల ద్వారా రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. గతంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల వాడకం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారని.. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆర్బీకేలు వచ్చాయని సీఎం అన్నారు. అలాగే రైతులకు మద్దతు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇ– క్రాపింగ్ గురించి సీఎం వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయరంగంలో పెను మార్పులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్ ఎండీ జి శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
విత్తనోత్పత్తిలో జర్మనీ సహకారం
ఆ దేశ ప్రతినిధులతో మంత్రి పోచారం సమావేశం సాక్షి, హైదరాబాద్: విత్తనోత్పత్తిలో జర్మనీ సాంకేతిక సహకారం తీసుకుంటామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్మనీ వ్యవసాయ, ఆహార మంత్రి త్వ ప్రతినిధి డాక్టర్ ఉల్రైక్ ముల్లర్, ఇండిపెండెంట్ ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ బ్రిటర్నిట్జ్ హార్ట్విగ్లతో మంత్రి శుక్రవారం సచివాల యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, విత ్తన ధ్రువీకరణ సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని మంత్రి జర్మనీ ప్రతినిధులకు వివరించారు. అనంతరం పోచారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తికి గల అవకాశాలను జర్మనీ ప్రతి నిధులు అధ్యయనం చేస్తున్నారన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడంలో జర్మనీ ప్రభుత్వ సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 400 ప్రైవేటు విత్తన కంపెనీలు రెండు లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నాయన్నారు. విత్తనోత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో వారు మ రో మూడు రోజులు పర్యటిస్తారని... అనంతరం మరోసారి సమావేశమై పర స్పర సహకారానికి తీసుకోవాల్సిన అంశాలను చర్చిస్తామన్నారు. జర్మనీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రం విత్తనోత్పత్తిలో అగ్రగామిగా ఉండటం తమకు స్ఫూర్తినిస్తుందన్నారు. రాష్ట్రానికి అవసరమైన సహకారం ఇస్తామన్నారు. విత్తనోత్పత్తిలో పరస్పర సహకారం ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.