విత్తనోత్పత్తిలో జర్మనీ సహకారం
ఆ దేశ ప్రతినిధులతో మంత్రి పోచారం సమావేశం
సాక్షి, హైదరాబాద్: విత్తనోత్పత్తిలో జర్మనీ సాంకేతిక సహకారం తీసుకుంటామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్మనీ వ్యవసాయ, ఆహార మంత్రి త్వ ప్రతినిధి డాక్టర్ ఉల్‌రైక్ ముల్లర్, ఇండిపెండెంట్ ఫ్రీలాన్స్ కన్సల్టెంట్ బ్రిటర్‌నిట్జ్ హార్ట్‌విగ్‌లతో మంత్రి శుక్రవారం సచివాల యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, విత ్తన ధ్రువీకరణ సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని మంత్రి జర్మనీ ప్రతినిధులకు వివరించారు.
అనంతరం పోచారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విత్తనోత్పత్తికి గల అవకాశాలను జర్మనీ ప్రతి నిధులు అధ్యయనం చేస్తున్నారన్నారు. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడంలో జర్మనీ ప్రభుత్వ సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 400 ప్రైవేటు విత్తన కంపెనీలు రెండు లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నాయన్నారు. విత్తనోత్పత్తిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో వారు మ రో మూడు రోజులు పర్యటిస్తారని... అనంతరం మరోసారి సమావేశమై పర స్పర సహకారానికి తీసుకోవాల్సిన అంశాలను చర్చిస్తామన్నారు. జర్మనీ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రం విత్తనోత్పత్తిలో అగ్రగామిగా ఉండటం తమకు స్ఫూర్తినిస్తుందన్నారు. రాష్ట్రానికి అవసరమైన సహకారం ఇస్తామన్నారు. విత్తనోత్పత్తిలో పరస్పర సహకారం ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.