విజేందర్ ప్రత్యర్థి జిలెన్
ఈనెల 30న రెండో బౌట్
లండన్: ప్రొఫెషనల్ కెరీర్ అరంగేట్రం బౌట్‌లోనే ‘టెక్నికల్ నాకౌట్’ విజయంతో అదరగొట్టిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ రెండో బౌట్‌కు సిద్ధమయ్యాడు. ఈనెల 30న లండన్‌లో జరిగే రెండో ప్రొఫెషనల్ బౌట్లో బ్రిటన్‌కు చెందిన 33 ఏళ్ల డీన్ జిలెన్తో విజేందర్ తలపడతాడు. మాంచెస్టర్ ఎరీనాలో సోనీ వైటింగ్ (ఇంగ్లండ్)తో జరిగిన తొలి బౌట్లో విజేందర్ మూడో రౌండ్లోనే గెలిచాడు. గత మేలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగుపెట్టిన జిలెన్ ఆడిన రెండు బౌట్లలో విజయం సాధించడం విశేషం. అంతకుముందు అమెచ్యూర్ బాక్సర్‌గా జిలెన్ 2013లో ప్రపంచ పోలీస్ గేమ్స్, ఫైర్ ఫైటర్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు.