Tej Pratap
-
తేజస్వి తేజ్ ప్రతాప్ ను నిర్బంధించిన పోలీసులు
-
లాలూకు ఎన్ఎస్జీ భద్రత ఉపసంహరణ
సాక్షి, పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు కొనసాగుతున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను కేంద్రం ఉపసంహరించింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్న ఆయనకు ఎన్ఎస్జీ కమెండోలు గార్డులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాలూకు ఉన్న జెడ్‌ప్లస్ క్యాటగిరీ నుంచి జెడ్‌కు కుదించింది. పలువురు ప్రముఖులకు ప్రస్తుతం అందజేస్తున్న భద్రత సదుపాయాలపై కేంద్ర హోంశాఖ ఇటీవలే సమీక్షించిన విషయం విదితమే. కాగా జెడ్‌ప్లస్ భద్రతలో ఎన్ఎస్జీ కమాండోలు రక్షణగా ఉంటారు. ఇకపై లాలూకు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. దీని ప్రకారం ఆయనకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండోలు రక్షణ ఉంటుంది. మరోవైపు లాలూకు భద్రత కుదింపుపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ స్పందించారు. ఒకవేళ తన తండ్రికి ఏమైనా జరిగితే అందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తన తండ్రిని హతమార్చడానికి కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితేన్ రామ్ మాంఝీకి ప్రస్తుతం ఉన్న జెడ్ క్యాటగిరీ భద్రతను పూర్తిగా తొలగించారు. కేంద్రమంత్రి హరిభాయ్ పి. చౌదరికి ప్రస్తుతం ఉన్న జెడ్ క్యాటగిరి భద్రతను వైప్లస్కు కుదించారు. దీని ప్రకారం భద్రత సిబ్బంది సంఖ్య తగ్గుతుంది. ఇంతకుముందు ఆయన కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన సమయంలో జెడ్ క్యాటగిరీలో భారీగా రక్షణ సిబ్బందిని నియమించారు. -
హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!
అమ్మాయిని బస్సులో ముట్టుకుంటేనే భయంతో ఆ అమ్మాయి మళ్లీ బస్సెక్కడానికి కొన్ని రోజులు పడుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని మనమే ఒక మాట అనం. ఈ దరిద్రులు.. ఆమె ప్రయాణిస్తున్న ప్రతిచోటా వెంబడిస్తూనే ఉన్నారు! ఛేజ్ చేస్తూనే ఉన్నారు! బస్సు కొంత నయం... నలుగురూ ఉంటారు. ఒంటరిగా టూ వీలర్ మీదో, కారులోనో వెళుతూ అమ్మాయి కనిపిస్తే ఇక ఈ నీచులకు అడ్డూ ఆపూ ఉంటుందా? ‘ఇది తప్పురా’ అని.. ఇంట్లో వాళ్ల అమ్మ చెప్పదా? లేక.. ‘ఆంబోతులా తిరుగురా’ అని వాళ్ల నాన్న చెప్పాడా? కొవ్వుతో కలిగిన బలుపుతో కలిసిన ఈ మదాంధుల్ని చెప్పుతో కొడితే లాభం లేదు. చట్టమే వీళ్లను తన చెప్పుచేతల్లోకి తీసుకుని కొత్త మార్గంలో నడిపించేలా చేయాలి. సినిమాలు చూసో.. వాళ్ల నాయన పలుకుబడిని చూసో.. హీరోలు అనుకుంటున్నారు కొడుకులు!! వీరేందర్ సింగ్ కుందు, ఐ.ఎ.ఎస్. రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి టూరిజం డిపార్ట్మెంట్ – హర్యానా ఐ.ఎ.ఎస్.లు ఎవరూ సాధారణంగా ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖలు రాయరు. కానీ వీరేందర్ సింగ్ కుందు 2017 ఆగస్టు 6 ఆదివారం ఫేస్బుక్లో ఒక లేఖను పోస్ట్ చేశారు! అయితే ఆ లేఖను ఆయన ఒక ఐ.ఎ.ఎస్. అధికారిగా రాయలేదు. ఒక సగటు ఆడపిల్ల తండ్రిగా రాశారు. ‘నిన్న అర్ధరాత్రి నా కూతురు వర్ణికకు ఒక భయానకమైన అనుభవం ఎదురైంది. డ్యూటీ ముగించుకుని ఆమె తన కారులో ఇంటికి వస్తుండగా, ఇద్దరు గూండాలు టాటా సఫారీలో ఆమెను వెంబడించారు. నా కూతురు గుండె నిబ్బరంతో వారి నుంచి వేగంగా తప్పించుకుని, కారును వేగంగా డ్రైవ్ చూస్తూనే పోలీసులకు ఫోన్ చేసింది. ఆ తర్వాత కూడా వాళ్లు ఆమె దారిని పదే పదే అడ్డగించారు. కొన్ని కిలోమీటర్ల్ల దూరం వరకు అలా చేశారు. ఒకచోటైతే వాళ్లలో ఒకడు టాటా సఫారీలోంచి దూకేసి, నా కూతురి కారులోకి దూరే ప్రయత్నం చేశాడు. ఈ లోపు పోలీస్‌లు రావడంతో వారు పారిపోయారు. మా అమ్మాయి ధైర్యంగా అయితే తప్పించుకోగలిగింది కానీ, ఆ భయం నుంచి ఇంకా తేరుకోలేదు. అందుకు ఇంకా కొంత సమయం పట్టేలా ఉంది. ఇద్దరు కూతుళ్ల తండ్రిగా నేనీ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టాలని అనుకోవడం లేదు. ఇదంతా మీకు చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి : ఇదీ వాస్తవంగా జరిగింది అని చెప్పడం. రెండు.. ఒకవేళ అవసరమైతే మద్దతు కూడగట్టుకోవడం కోసం. ఈ పోరాటాన్ని నేను ఆపదలచుకోలేదు. దోషులకు శిక్ష పడకపోతే ఇంకా ఎంతోమంది కూతుళ్లకు ఈ దుస్థితి రావచ్చు. వాళ్లందరూ నా కూతురంత అదృష్టవంతులు కాకపోవచ్చు. అలాంటి వారి కోసం ఎవరో ఒకరు నిలబడాలి. నేను నిలబడుతున్నాను. నిలబడగలిగినంత కాలం నిలబడతాను.’ ఇదీ వీరేందర్ సింగ్ కుందు రాసిన లేఖ. సోషల్ మీడియాలో ఈ లేఖ చదివిన వాళ్లంతా ఆ గూండాలపై విరుచుకు పడ్డారు. కానీ రణవీర్ భట్టీ అనే వ్యక్తి మాత్రం వీరేందర్ సింగ్ మీద విరుచుకు పడ్డాడు! రణవీర్ భట్టి హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడు! ‘‘అసలు అంత రాత్రప్పుడు ఆ పిల్లకు రోడ్ల మీద ఏం పని?’’ అన్నది రణవీర్ భట్టీ ప్రశ్న. ఆయన ప్రశ్నకు సమాధానం కాదు కానీ.. వర్ణిక.. డిస్క్ జాకీ. ఆ వేళప్పుడే ఆమె డ్యూటీ అయిపోతుంది. రోజూ ఆ వేళప్పుడే ఆమె తన కారులో ఇంటికి బయల్దేరుతుంది. ఆమె రోజూ వెళ్లొచ్చే రోడ్డు ఒకటే. కానీ ఆ గూండాల కారణంగా ఆ రోజు రాత్రి ఆమె రోడ్లన్నిటి మీదా పరుగులు తీయాల్సి వచ్చింది.. వాళ్ల నుంచి ఎస్కేప్ అవడానికి. ఆ రోజు వర్ణికను కిడ్నాప్ చేసేందుకు వేట కుక్కల్లా వెంటపడిన ఆ ఇద్దరు ఆగంతకులలో ఒకడు వికాస్ బరాలా. హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కొడుకు. ఇంకొడు వికాస్ స్నేహితుడు అశీష్ కుమార్. మొదట వికాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వి.ఐ.పి. కొడుకని తెలిసి వదిలేశారు. తర్వాత వర్ణిక, ఆమె తండ్రి ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం, మీడియా ఒత్తిడి తేవడంతో వికాస్‌ను అరెస్ట్ చేశారు. ఆ వెంటనే వికాస్ తండ్రి పార్టీలో తన పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం వర్ణిక కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా.. గతంలో విఐపీ పుత్రరత్నాలు చేసిన కొన్ని ఘనకార్యాలను ఒకసారి చూద్దాం. మార్చి 2016 సుశీల్ కుమార్ సన్నాఫ్ రావెల కిషోర్ సుశీల్ మంత్రిగారి అబ్బాయి. నాన్నగారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. బంజారా హిల్స్‌లో నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళా టీచర్‌ను సుశీల్ కారులో వెంబడించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నలుగురూ గుమికూడారు. పోలీసులు బాధితురాలి కంప్లైంట్ తీసుకున్నారు. సుశీల్‌పై ఐ.పి.సి. సెక్షన్ 354 మోలెస్టేషన్ కేసును నమోదు చేశారు. జూన్ 2015 రితురాజ్ సన్నాఫ్ ప్రణతి ఫుకాన్ ప్రణతి ఫుకాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. చేనేత, జౌళి ఉత్పతులు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి. ఆమె ఉండడం అస్సాంలో. తనయుడు రితురాజ్ ఉండడం బెంగళూరులో. ఫ్రెండ్స్‌తో కలిసి ఏదో బిజినెస్ చేస్తున్నాడు. పదేళ్ల బాలికను రేప్ చేసి, ఆ చిన్నారి మరణానికి కారణం అయ్యాడన్న ఫిర్యాదుపై సంజయ్ నగర్ పోలీసులు రితురాజ్పై కేసు ఫైల్ చేశారు. బాలిక తల్లి వీళ్ల దగ్గరే ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తుంటుంది. అయితే విషయాన్ని పై అధికారులు బైటకు పొక్కనీయలేదు. మంత్రి గారి కొడుకును, అతడి స్నేహితులను తప్పించే ప్రయత్నాలు జరిగాయి. జూలై 2014 సురేశ్ బదానా సన్నాఫ్ హేమ్‌సింగ్ బదానా హేమ్‌సింగ్ రాజస్థాన్ పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన సుపుత్రుడు సురేశ్ అల్వార్‌లోని షాలిమార్ కాలనీలోకి.. కోళ్ల గంపలోకి దూరిన పిల్లిలా.. దూరాడు. ఒక యువతిని అసభ్యంగా కామెంట్ చేశాడు. నలుగురూ పట్టుకుని తన్నబోతే కాలనీలోని 308 క్వార్టర్లోకి దూరి తలుపేసుకున్నాడు. అది నాన్నగారికి ప్రభుత్వం కేటాయించిన క్వార్టరే. ఎవరొచ్చి తలుపు తట్టినా తియ్యలేదు. అర్ధరాత్రెప్పుడో బాల్కనీ లోంచి గోడ దూకి తప్పించుకున్నాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. జూన్ 2013 ఆదర్శ్ సన్నాఫ్ జోస్ తెట్టాయిల్ అప్పటికి లె ట్టాయిల్ కేరళ అపోజిషన్ లీడర్. ఎల్.డి.ఎఫ్. పార్టీ నాయకుడు. అంతకు ముందు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి. ఆయన నియోజకవర్గం అంగమల్లి. అక్కడి ఓ యువతి ఈ తండ్రీ కొడుకులిద్దరూ తనను లైంగికంగా వేధించారని కేసు పెట్టింది. ‘అబ్బే.. అలాంటిదేమీ లేదు. నా వెనుక పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోంది’ అని తప్పించుకోబోయాడు. విశేషం ఏంటంటే.. ఈ కేసులో తండ్రే ప్రధాన నిందితుడు. కొడుకు రెండో నిందితుడు. జూలై 2011 రోహిత్ సన్నాఫ్ అటనేషియో మాన్సెరెట్ మాన్సెరెట్ గోవా విద్యాశాఖ మంత్రి. గోవాలో ఉంటున్న ఒక జర్మన్ మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో 2008 నవంబరులో రోహిత్‌ను అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయికి అసభ్యకరమైన మెజేస్‌లు కూడా అతడు పంపించినట్లు రూడీ అయింది. అయితే మాన్సెరెట్ తన పలుకుబడితో కొడుక్కి శిక్ష పడకుండా కాపాడుకుంటూ వచ్చాడు. కేసు నాలుగేళ్లు నడిచింది. చివరికి కోర్టు రోహిత్‌ను నిర్దోషిగా వదిలిపెట్టింది. జనవరి 2008 తేజస్వీ, తేజ్ ప్రతాప్.. సన్స్ ఆఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగింది ఈ ఘటన. న్యూ ఇయర్ వేడుకల్లో ఆయన ఇద్దరు కుమారులు కన్నూమిన్నూ కానకుండా అమ్మాయిల్నీ వేధించారు. గుర్తు తెలియని యువకులు వారికి దేహశుద్ధి చేశారు. ఈ తోపులాటలో తేజస్వి, తేజ్ ప్రతాప్‌ల గన్‌మెన్ తుపాకీని ఎవరో లాక్కున్నారు. దానిపై కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు వీళ్ల భాగోతం అంతా బయటపడింది. ముందు అశోకా హోటల్ దగ్గర కొందరు ఆడపిల్లల్ని ఏడిపించారు. తర్వాత కన్నాట్ ప్లేస్‌లో టీజ్ చేశారు. ఢిల్లీ–హర్యానా బార్డర్‌లోని ఛతార్పూర్లో పార్టీ ఉంటే, అక్కడికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మెహ్రాలీ దగ్గర ఫామ్ హౌస్ దగ్గర అమ్మాయిల మీద చెయ్యి వేశారు. అదిగో అప్పుడే ఇద్దర్నీ పట్టుకుని లోకల్ హీరోలు కొట్టేశారు. ముఖాలు వాచిపోయాయి. ప్రథమ చికిత్స కోసం అన్నదమ్ముల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్లమీద కేసు మాత్రం నమోదు కాలేదు! ఏడుగురు అక్కచెల్లెళ్లు ఉన్న ఈ ఇద్దరు ప్రబుద్ధులు అమ్మాయిల్ని ఏడిపించడం ఏమిటో! డిసెంబర్ 2007 మిస్టర్ ‘హూ?’ గ్రాండ్ సన్ ఆఫ్ ఎ సీనియర్ లీడర్ దేశంలోని మిగతా కేసుల్లోనైనా ప్రబుద్ధులెవరో, వారి సుపుత్రులెవరో పేర్లు తెలిశాయి కానీ, పదేళ్ల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో జరిగిన ఆయేషా హత్య కేసులో దోషులెవరో ఇంతవరకు తేల్లేదు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ కి ఇవ్వాలా వద్దా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆయేషా హత్యను చేసింది ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్ మనవడు అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే సత్యంబాబు అనే యువకుడిని హంతకుడిగా నిర్థారించి, పదేళ్ల జైలు శిక్ష తర్వాత నిర్దోషిగా ఈ ఏడాదే విడుదల చేశారు. ఇన్నేళ్లలోనూ అసలు నేరస్థుడు దొరకలేదంటే.. వెనుక వీఐపీల ప్రెజర్ ఉన్నట్లేనని అనుకోవాల్సి వస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వి.ఐ.పి.ల పుత్రరత్నాలు తమ తండ్రుల పలుకుబడితో కేసుల నుండి, శిక్షల నుండి తప్పించుకుంటున్నారు. ఈ ధోరణి వల్ల సగటు బాధితురాలు న్యాయం కోసం పోరాడే మానసిక స్థయిర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. -
తేజ్ ప్రతాప్ రాయని డైరీ
గవర్నమెంటులో ఉన్నవాళ్లను గవర్నమెంటులో లేనివాళ్లు చికాకు పెడుతున్నారంటే గవర్నమెంటు ఉన్నట్టా? లేనట్టా? నేను హెల్త్ మినిస్టర్‌ని. మా తమ్ముడు డిప్యూటీ సీఎం. బిహార్‌లో నితీశ్ కుమార్ గవర్నమెంట్ నిలబడి ఉందంటేనే మా ఫ్యామిలీ వల్ల. ఇంత పవర్ ఉండీ మా అన్నదమ్ములం ఉదయం లేవగానే ఎవరి పనులు వాళ్లం చేసుకోలేకపోతున్నాం! రెండు నెలలుగా మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ప్రెస్ మీట్లు పెట్టి చంపుతున్నాడు సుశీల్ కుమార్ మోదీ. మాకు ఇన్నిన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో, డైలీ ఆయన ఇంటికెళ్లి డాక్యుమెంట్స్ చూపించి రావాలట! పవర్లో లేనివాడు ఏదైనా అడుగుతాడు. ‘‘రోజూ మనకు ఈ .. మన్ కీ బాత్ ఏంటి నితీశ్‌జీ’’ అని అడిగాను. ‘‘నన్నెందుకు కలుపుకుంటారు తేజ్ బాబూ’’ అన్నారు నితీశ్! ఆశ్చర్యపోయాను. ఢిల్లీ వెళ్లి మోదీతో లంచ్ చేసి వచ్చినప్పటి నుంచీ నితీశ్ బిహార్ చీఫ్ మినిస్టర్‌లా బిహేవ్ చెయ్యడం లేదు. తనని తను బీజేపీ చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నట్లున్నాడు. ‘‘మిమ్మల్ని మేము కలుపుకోవడం ఏంటి నితీశ్‌జీ! మీ మంత్రివర్గంలోనే కదా ఉన్నాం.. నేను, మా తమ్ముడు’’ అన్నాను. ‘‘క్యాబినెట్లో ఉన్నంత మాత్రాన, కలిసి ఉన్నామనేనా తేజ్ బాబూ’’ అన్నారు నితీశ్. నితీశ్ నావైపు చూసి మాట్లాడ్డం లేదు. నేను లేని వైపు చూసి మాట్లాడుతున్నారు! ‘‘సుశీల్ మోదీ ఎక్కువ చేస్తున్నాడు నితీశ్‌జీ’’ అన్నాను. నితీశ్ మౌనంగా ఉన్నారు. ‘‘తన పేరులో మోదీ ఉందని చెప్పి, తనను మోదీ అనుకుంటున్నాడు నితీశ్‌జీ’’ అన్నాను. నితీశ్ మౌనంగా ఉన్నారు! ఆయనేమీ మాట్లాడదలచుకోలేదని నాకు అర్థమైంది. ‘‘వెళ్తున్నాను నితీశ్‌జీ’’ అన్నాను. అప్పుడడిగారు.. ‘‘ఏదైనా పనిమీద వచ్చావా తేజ్ బాబూ’’ అని! ‘‘ఇవాళ నాన్నగారి బర్త్‌డే. ఇవాళొక్కరోజూ సుశీల్ మోదీ ప్రెస్‌మీట్ పెట్టకుండా చూడగలరా నితీశ్‌జీ’’ అని అడిగాను. ‘‘నాన్నగారికి బర్త్‌డే విషెస్ చెప్పడం ఒక్కటే నా చేతుల్లో ఉంది తేజ్ బాబు’’ అన్నారు నితీశ్! గుడ్డ సంచిలోంచి ప్రసాదం తీసి ఆయన చేతికి ఇచ్చాను. ‘‘శ్రీకృష్ణ ప్రసాదం నితీశ్‌జీ. బృందావనా నికి వెళ్లొచ్చాను’’ అని చెప్పి బయల్దేరాను. ‘‘బృందావనమా! ఏమిటి యు.పి. విశేషాలు’’ అని అడిగారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ కొత్త స్పెషల్ సెక్రెటరీని అపాయింట్ చేసుకున్నారు నితీశ్‌జీ. అదే విశేషం’’ అని చెప్పాను. ‘అందులో విశేషం ఏముంది తేజ్ బాబూ’ అన్నట్లు చూశారు నితీశ్. ఆ స్పెషల్ సెక్రెటరీ పేరు నితీశ్ కుమార్. ఆ విషయమే నితీశ్‌జీ కి చెప్పి వచ్చేశాను. - మాధవ్ శింగరాజు -
సుశీల్ కుమార్ మోదీకి జేడీయూ వార్నింగ్
లక్నో : బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌పై బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యలను జేడీయూ తీవ్రంగా ఖండించింది. సుశీల్ కుమార్ తన హుందాతనాన్ని కాపాడుకోవాలని జనతాదళ్ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ సూచించారు. 'ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా సీనియర్ నేతలు. వాళ్లే తమ భాషను అదుపులో పెట్టుకోలేకపోతే, వారిని చూసి యువత ఏం నేర్చుకుంటారు. సుశీల్ మోదీ హుందాగా ప్రవర్తించాలి' అని అన్నారు. ఇప్పటికైనా సుశీల్ కుమార్ మోదీ నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. కాగా బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను పెళ్లి చేసుకుంటామంటూ ఆయన వాట్సప్ నెంబర్‌కు ఏకంగా 44వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ ... తన పెద్దకొడుకును కాకుండా చిన్న కొడుకును డిప్యూటీ సీఎంను చేసిన లాలూ ప్రసాద్ యాదవ్..వాళ్ల వివాహ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తారేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. ముందుగా చిన్నకొడుకు తేజస్వి యాదవ్‌కు పెళ్లి చేశాకే...పెద్ద కుమారుడికి వివాహం చేసేలా ఉన్నారన్నారు. దీనికి తేజ్ ప్రతాప్ కౌంటర్‌గా సుశీల్ కుమార్ మోదీ కుమారుడు ఇంపోటెంట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పెళ్లి విషయంలో ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన కుమారుడి గురించి ఆలోచిస్తే మంచిదని అన్నారు. ఈ నేపథ్యంలో సుశీల్ కుమార్, తేజ్ ప్రతాప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన పరిణితి చెందలేదనిపిస్తోందని సుశీల్ కుమార్ మోదీ అన్నారు. -
సెక్స్ రాకెట్ నిందితుడితో మోదీ ఫొటో!
పట్నా: జర్నలిస్టు హత్య కేసులో నిందితుడైన షార్ప్ షూటర్ మహమ్మద్ ఖైఫీతో లాలూ తనయుడు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ దిగిన ఫొటో బిహార్‌లో పెద్ద దుమారం రేపుతోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. మహమ్మద్ ఖైఫీ ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆర్జేడీ మాజీ ఎంపీ షాహబుద్దీన్ అనుచరుడు. సివాన్ పాత్రికేయుడైన రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఖైఫీతో తేజ్‌ప్రతాప్ ఉన్న ఫొటో వెలుగుచూడటం నితీశ్ సర్కార్‌ను ఇరకాటంలో పడేసింది. ఇప్పటికే షాహబుద్దీన్ విడుదలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ సర్కారు.. తాజాగా ఈ ఫొటోతో మరింతగా ఇరకాటంలో పడింది. మరోవైపు లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ తనపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించారు. సెక్స్ రాకెట్ నిందితుడు అయిన టీనూ జైన్ గతంలో ప్రధాని నరేంద్రమోదీతో ఫొటోలు దిగారని పేర్కొంటూ వాటిని విడుదల చేశారు. ఖైఫీతో ఫొటో విషయంలో తన రాజీనామా అడుగుతున్న వారు మొదట ప్రధాని మోదీతో రాజీనామా చేయించాలని తన ఫేస్బుక్ పోస్టులో డిమాండ్ చేశారు. తాను రాజకీయ నాయకుడినని, తనతో చాలామంది ఫొటోలు దిగుతారని, అంతమాత్రాన తనతో వారికి సంబంధం ఉందని పేర్కొనడం సరికాదని పేర్కొన్నారు. -
లాలు తనయులకు కేబినెట్ బెర్తులు
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లకు మంత్రి పదవులు దక్కాయి. శుక్రవారం మధ్యాహ్నం బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లాలు తనయులు తేజస్వి , తేజ్ ప్రతాప్ ప్రమాణం చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ వీరితో ప్రమాణం చేయించారు. లాలు చిన్న కొడుకు తేజస్వి (26)కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో లాలు ప్రసాద్ దూరంగా ఉండగా, ఆయన తనయులు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే. -
చిన్నోడే పెద్దోడట!
పట్నా: ఎన్నికల పుణ్యమా అని అన్న తమ్ముడు అయ్యాడు, తమ్ముడు అన్నయ్యాడు! బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూ తనయుల ఉదంతం ఇది. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్(25) సోమవారం వైశాలి జిల్లాలోని రఘోపూర్ స్థానానికి నామినేషన్ వేశా డు. చిన్న కొడుకు తేజస్వీ ప్రసాద్ కూడా అదే జిల్లాలోని మహువాకి నామినేషన్ వేశారు. అయితే తేజస్వి తన వయసు 26గా అఫిడవిట్లో పేర్కొన్నారు. తేజస్వి తన వయసును అన్నకంటే ఏడాది ఎక్కువగా చెప్పడంతో వివా దం రేగింది. అన్నదమ్ములిద్దరి అఫిడవిట్లపై దర్యాప్తు జరపాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. లాలూ, ఆయన తనయులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ‘ఓటరు గుర్తింపు కార్డు ల్లో ఉన్నదే అంతిమం. వాటిలో ఉన్న వయసునేవారు పేర్కొన్నారు’ అని లాలూ అన్నారు. మతవిద్వేషాలతో చెడగొట్టే యత్నం బిహార్‌లో వాతావరణాన్ని మతద్వేషాలతో చెడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మాహా కూటమి నేతలైన సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌లు ధ్వజమెత్తారు. ‘కుక్కలు పెంచేవాళ్లు..’: ఓటమి భయంతో బీజేపీ మత ఎజెండా అనుసరిస్తోందని లాలూ విమర్శించారు.‘కుక్కలు పెంచేవారు ఆవును పెంచేవారికి పాఠాలు చెప్పొద్దు. గోమాత గురించి మాట్లాడే వారిని వారిలో ఎందరికి గోశాలలు ఉన్నాయని ప్రశ్నించాలి. మా గోశాలల్లో వంద నుంచి 500 ఆవులు ఉన్నాయి’ అని ట్విటర్లో పేర్కొన్నారు. లాలూ, అమిత్‌షాలపై కేసులు మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను నరమాంస భక్షకుడు అన్నందుకు లాలూపై, లాలూను గడ్డి దొంగ అని అన్నందుకు అమిత్‌షాపై కేసులు నమోదయ్యాయి. -
బంధువులు కాబోతున్న లాలూ, ములాయం
-
బంధువులు కాబోతున్న లాలూ, ములాయం
న్యూఢిల్లీ: ఉత్తరాది రాజకీయాలు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఇప్పటికే బీహార్‌లో అధికార జనతాదళ్ (యూ), మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ రాబోయే ఎన్నికల్లో కలసి పనిచేయాలని నిర్ణయించగా, ఈ కూటమికి ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడు అత్యంత సన్నిహితులయ్యారు. ఒకప్పుడు మిత్రులుగా కొనసాగి, ఆ తర్వాత శత్రువులుగా ఉన్న యాదవ ద్వయం త్వరలో బంధువులు కాబోతున్నారు. ములాయం మనవడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌కు, లాలూ చిన్న కుమార్తె రాజ్ లక్ష్మీకి వివాహం కుదిరింది. డిసెంబర్ మధ్యలో వీరి నిశ్చితార్థం జరిగే అవకాశముంది. ఇక పెళ్లి ఫిబ్రవరిలో చేయాలని భావిస్తున్నారు. తేజ్‌ప్రతాప్ యూపీలోని మొయిన్‌పురి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తమ స్నేహం బంధుత్వంగా మారబోతోందని లాలూ, ములాయం చెప్పారు.