Tejaswi Prasad Yadav
-
ED: లాలూ, తేజస్వీలకు మళ్లీ ఈడీ నోటీసులు
పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి, మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. భూములు రాయించుకుని రైల్వే ఉద్యోగాలు ఇచ్చారని తండ్రీ కొడుకులపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఈడీ లాలూ, తేజస్వీలను విచారించనుంది. విచారణ కోసం పాట్నాలోని తమ కార్యాలయానికి రావాలని సమన్లలో ఈడీ తెలిపింది. జనవరి 29న లాలూ ప్రసాద్‌యాదవ్, 30న తేజస్వీ యాదవ్ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. ఇదే కేసులో వీరిద్దరికి గత డిసెంబర్లో సమన్లు జారీ చేసినా విచారణకు వారు దూరంగా ఉన్నారు. యూపీఏ వన్ ప్రభుత్వంలో లాలూ కేంద్ర రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణానికి పాల్పడ్డారనేది ఈడీ అభియోగం. ఇదీచదవండి.. జెండాల గౌరవం కాపాడండి -
‘వందల కోట్లు.. 29రోజుల్లో కూలిపోయింది’
-
‘వందల కోట్ల బ్రిడ్జి.. 29 రోజుల్లో కూలిపోయింది’
పట్నా: గత నాలుగు రోజులుగా బిహార్‌లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద తాకిడికి ఓ వంతెన కొట్టుకుపోయింది. దీనిలో పెద్ద విశేషం ఏం ఉంది అనుకుంటున్నారా. ఉంది.. ఏంటంటే ఈ వంతెన ప్రారంభమయ్యి సరిగా నెల రోజులు కూడా కాలేదు. నేటికి కేవలం 29 రోజులు మాత్రమే. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గండక్ నదిపై బ్రిడ్జిని నిర్మించారు. స్వయంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ వంతెనను ప్రారంభించారు. ఇది జరిగిన 29 రోజులకే గోపాల్‌గంజ్‌లోని సత్తర్‌ఘాట్ ప్రాంతంలో వంతెనలో కొంత భాగం నదిలో కూలిపోయింది. దీని గురించి అధికారులను ప్రశ్నించగా.. ‘వంతెనను.. రహదారిని అనుసంధానిస్తూ నిర్మించిన కల్వర్టులు పెరుగుతున్న నీటి మట్టాన్ని తట్టుకోలేకపోయాయి. దాంతో వంతెన కూలిపోయింది’ అని సెలవిచ్చారు. (‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’) ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్.. ‘రూ. 263 కోట్లు ఖర్చు చేసి.. ఎనిమిదేళ్లు కష్టపడి నిర్మించిన బ్రిడ్జి కేవలం 29 రోజుల్లో కూలిపోయింది. ఈ అవినీతి గురించి భీష్మా పితామహుడు వంటి నితీష్ జీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బిహార్‌లో ప్రతి చోటా ఇలాంటి దోపిడి ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్ జిల్లాలను కలిపే సత్తర్‌ఘాట్ వంతెన పొడవు 1.4 కి.మీ. దీనిని జూన్ 16న ప్రజల రవాణా కోసం సీఎం ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణాన్ని ఎనిమిదేళ్ల క్రితం బీహార్ రాజ్య పుల్ నిర్మన్ నిగం లిమిటెడ్ ప్రారంభించింది. -
మీసాలు రాకుండా మోసం చేయలేరా?
పట్నా: బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎలాంటి అవినీతికి ఆస్కారంలేని స్వచ్ఛమైన పాలనను అందిస్తానని రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్‌ను పదవి నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో మరో నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని తేజస్వీ ప్రసాద్‌తోపాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. 2005-06లో కుంభకోణం జరిగినప్పుడు తన కుమారుడికి 14 ఏళ్లని, అప్పుడు వాడి మూతిమీద మీసం కూడా మొలవలేదని, మీసం మొలవకుండా వాడెలా అవినీతికి పాల్పడతారని లాలూ ప్రసాద్ యాదవ్ నానా యాగి చేస్తున్నారు. తనకు మీసం మొలవని వయస్సులో తానెలా తప్పు చేస్తానని తేజస్వీ ప్రసాద్ కూడా సవాల్ చేస్తున్నారు. మీసం మొలవని వయస్సులో తప్పు చేయరా, చేసినా క్షమించి వదిలేయలా? వారి ఉద్దేశం ఏమిటీ? నిర్భయ కేసులో మైనరైన నిందితుడికి కూడా అప్పటికి మూతిమీద మీసం మొలవలేదు. అయినప్పటికీ అతన్ని ఉరితీయాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేశారు. చట్టం అందుకు అంగీకరించదు కనుక జువెనైల్ చట్టం కింద అతనికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష విధించి విడుదల చేశారు. ఇక్కడ ప్రధానంగా నేరం చేసిందీ తేజస్వీ ప్రసాద్ అన్న ఆరోపణకాదు. 2004 నుంచి 2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు ఒకరికి రైల్వే హోటల్ కాంట్రాక్టును అనుచితంగా ఇచ్చినందుకు 'క్విడ్ ప్రో' కింద తన కుమారుడు తేజస్వీ పేరిట పట్నాలో విలువైన ప్లాట్లను పొందారన్నది ఆరోపణ. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం లాలూ ప్రసాద్ 2005లో రైల్వే హోటల్ కాంట్రాక్టు ఒకరికి ఇచ్చారు. అందుకు బదులుగా 2006లో బినామీల కంపెనీ పేరిట కొన్ని విలువైన ప్లాట్లు రిజిస్టర్ అయ్యాయి. ఆ ప్లాట్లు 2014లో తేజస్వీ ప్రసాద్ పేరిట బదిలీ అయ్యాయి. నాటి క్విడ్ ప్రో కిందనే ఈ ప్లాట్లు తేజస్వీకి అందాయా, ఆయన డబ్బులు పెట్టి మార్కెట్ ధరకు కొనుక్కున్నారా ? కొనుక్కుంటే 2015 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ ప్లాట్ల వివరాలు ఎందుకు పొందుపర్చలేదన్న ప్రశ్నలు అవినీతి ఆరోపణలకు ఆస్కారమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తేజస్వీ ఓ రాజకీయ నాయకుడిగా తన డిప్యూటి ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేసి విచారణను ఎదుర్కోవాల్సిందే. 'అమాయకుడిని, మూతి మీద మీసాలు రాలేదు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న నాటకం' అంటూ మాయా మాటలు చెబితే మోసపోయేంత అమాయకులు కాదు నేటి ప్రజలు. -
లాలు తనయులకు కేబినెట్ బెర్తులు
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లకు మంత్రి పదవులు దక్కాయి. శుక్రవారం మధ్యాహ్నం బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం లాలు తనయులు తేజస్వి , తేజ్ ప్రతాప్ ప్రమాణం చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ వీరితో ప్రమాణం చేయించారు. లాలు చిన్న కొడుకు తేజస్వి (26)కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో లాలు ప్రసాద్ దూరంగా ఉండగా, ఆయన తనయులు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే.