Tejinder Pal Singh Toor
-
పారుల్, తజిందర్‌లకు స్వర్ణ పతకాలు
బ్యాంకాక్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం ఉన్నాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్లో పారుల్ చౌధరీ విజేతగా నిలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్ 9 నిమిషాల 38.76 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సుధా సింగ్ (2013, 2017), లలితా బబర్ (2015) తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణం నెగ్గిన మూడో భారతీయ అథ్లెట్‌గా పారుల్ నిలిచింది. మహిళల లాంగ్‌జంప్ ఈవెంట్లో ఉత్తరప్రదేశ్‌కే చెందిన 19 ఏళ్ల శైలీ సింగ్ రజత పతకం గెలిచింది. శైలీ సింగ్ 6.54 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. పురుషుల షాట్‌పుట్ ఈవెంట్లో తజిందర్‌పాల్ సింగ్ తూర్ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల తజిందర్‌పాల్ ఇనుప గుండును 20.23 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. బిలాల్ సాద్ ముబారక్ (ఖతర్), ఘరీబ్ అల్ జిన్కావి (కువైట్) తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండుసార్లు షాట్‌పుట్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు నెగ్గిన మూడో అథ్లెట్‌గా తజిందర్‌పాల్ గుర్తింపు పొందాడు. మూడో రోజు పోటీల తర్వాత భారత్ ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో తొమ్మిది పతకాలతో మూడో స్థానంలో ఉంది. -
పతాకధారిగా తేజిందర్ పాల్
న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బందానికి పతాకధారిగా షాట్‌పుట్ క్రీడాకారుడు తేజిందర్ సింగ్ పాల్ తూర్ వ్యవహరించనున్నాడు. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో 25 ఏళ్ల తేజిందర్ స్వర్ణ పతకం సాధించాడు. దక్షిణాసియా క్రీడలు నేపాల్ రాజధాని కఠ్మాండూలో నేడు ప్రారంభమవుతాయి. 10 రోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, మాల్దీవులు దేశాల నుంచి 2,715 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 26 క్రీడాంశాల్లో 1119 పతకాల కోసం క్రీడాకారులు పోటీపడతారు. భారత్ నుంచి 487 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో బరిలో ఉన్నారు. అథ్లెటిక్స్‌లో భారత్ తరఫున 75 మంది బరిలోకి దిగుతున్నారు. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత్ 188 స్వర్ణాలు, 90 రజతాలు, 30 కాంస్యాలతో కలిపి మొత్తం 308 పతకాలు సాధించింది. ఫైనల్లో భారత మహిళల జట్టు వాలీబాల్ క్రీడాంశంలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి సెమీఫైనల్లో భారత్ 25–14, 25–6, 25–17తో మాల్దీవులు జట్టును ఓడించింది. ఫైనల్లో నేపాల్‌తో భారత్ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో నేపాల్ 25–14, 25–18, 25–21తో శ్రీలంకపై గెలిచింది. పురుషుల విభాగంలో నేడు జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంకతో భారత్; పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడతాయి. దక్షిణాసియా క్రీడలు నేడు అధికారికంగా ప్రారంభమవుతున్నా... కొన్ని క్రీడాంశాల్లో మాత్రం ముందే మ్యాచ్‌లు మొదలయ్యాయి. -
కొడుకు స్వర్ణ పతకాన్ని చూడకుండానే..
మోగా: ఆసియా క్రీడల్లో తన కొడుకు సాధించిన బంగారు పతకాన్ని చూడకుండానే కన్నుమూశాడు షాట్ పుట్టర్ తేజిందర్ పాల్ సింగ్ తండ్రి. షాట్ పుట్లో బంగారు పతకం సాధించి చరిత్రలో నిలిచిన తేజిందర్.. తన తండ్రికి తాను సాధించిన పతకాన్ని చూపించాలని ఎంతో ఆశపడ్డాడు. బంగారు పతకం సాధించిన విజయంతో, ఎంతో సంతోషంగా దానిని తండ్రికి చూపిద్దామని ఆశతో విమానశ్రయంలో దిగిన తేజిందర్ పాల్‌కు చేదు వార్త స్వాగతం పలికింది. తేజిందర్ తండ్రి కరమ్ సింగ్ రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. అయినప్పటికీ కొడుకుని ఆసియా క్రీడలకు పంపడం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేశారు. ప్రతి విజయంలో తోడుగా ఉన్న తండ్రికి తాను సాధించిన బంగారు పతకాన్ని చూపిద్దామని ఎన్నో ఆశలతో జకార్తా నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే తండ్రి పరిస్థితి విషమంగా ఉందన్న వార్త తెలిసింది. తేజిందర్ పంజాబ్‌లోని మోగాకు ఢిల్లీ నుంచి రోడ్డు మార్గం ద్వారా పయనమయ్యాడు. కానీ, ఇంకా ఇంటికి కొద్ది దూరంలో ఉండగానే తండ్రి చనిపోయిన విషయం తెలిసింది. ‘తాను బంగారు పతకం సాధించలన్నది నా తండ్రి చివరి కోరిక. కానీ ఇప్పుడు పతకాన్ని తండ్రికి చూపించి ఆ కోరిక తీర్చాలనుకుంటే, దేవుడు ఆ కోరిక తీరకుండా చేశాడు' అని తేజిందర్ కన్నీరుమున్నీరవుతున్నాడు. చదవండి: బంగారు గుండు