Telangana Budget -2015
-
తగ్గిన ‘దీపం’ వెలుగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదింటి మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘దీపం’ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకానికి రూ.37.61 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.21.61కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే 6,55,354 మందికి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 5,43,412 మంది అర్హులను గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. భారీ లక్ష్యం ముందున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో కేటాయింపులను తగ్గించినట్లుగా తెలుస్తోంది. -
బడ్జెట్ ఫలితాలిచ్చేదిగా లేదు
బీసీ సంక్షేమాన్ని మరిచారు మండలిలో డీఎస్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితాలిచ్చేదిగా కనిపించడం లేదని, బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్న అంకెల్లో స్పష్టత లోపించిందని శాసన మండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ సర్కారుపై ధ్వజమెత్తారు. శనివారం మండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం అధిక జనాభా కలిగిన బలహీనవర్గాలను నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తుందన్నారు. బీసీల సంక్షేమానికి అదనంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక తమకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశపడ్డారని, ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వారిని నిరాశకు గురిచేస్తుందని అన్నారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేన్లు ఇవ్వాలని, వయోపరిమితిని పదేళ్ల వరకు సడలించాలని ఆయన డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే 60నుంచి 70శాతం పనులు పూర్తయి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కూడా చేపట్టాలన్నారు. హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచుల గౌరవవేతనాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తామని, పొరపాట్లు చేస్తే వ్యతిరేకి స్తామని స్పష్టం చేశారు. -
‘కోట్ల’ ఆశలు!
బడ్జెట్ వైపు... ప్రభుత్వ శాఖల చూపు నిధుల కోసం నిరీక్షణ మరికొన్ని గంటల్లో తేలనున్న ‘లెక్క’ సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌పై గ్రేటర్‌లోని సర్కారు విభాగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాయి. విశ్వనగరం దిశగా వడివడిగా అడుగులేస్తున్న మహా నగర పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సర్కారు విభాగాలు భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. వీటికి బడ్జెట్లో నిధుల వరద పారుతుందని ఆశిస్తున్నాయి. రహదారులు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణ, మురికివాడల్లో కనీస వసతుల కల్పన, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలతో పాటు నేర రహిత రాజధానిగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు అవసరమవుతాయని జీహెచ్ఎంసీ, జలమండలి, మైనార్టీ సంక్షేమ, గృహ నిర్మాణ శాఖలు, హెచ్ఎండీఏ, వైద్య ఆరోగ్యశాఖ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు విభాగాలు ఆశిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి తొలిబడ్జెట్ ఇదే కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా సర్కారు నిధులు విదిలిస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. బల్దియా... రూ.2796 కోట్లు గత ఏడాది బడ్జెట్ (2014-15)లో జీహెచ్ఎంసీ రూ.1093 కోట్లు కోరగా... కేవలం రూ.373 కోట్లు కేటాయించారు. అయితే అది కేవలం నాలుగు నెలలకు సంబంధించినది కావడం గమనార్హం. ఆ మాత్రం నిధులు కేటాయించినా ఖర్చు చేసేందుకు వ్యవధి లేకపోయింది. ఈ నిధుల్లో యూసీడీకి రూ.35.03 లక్షలు, ఎంఎంటీఎస్‌కు రూ. 20.83 కోట్లు, పాదచారుల పథకానికి రూ.కోటి, హరిత నగరం ప్రాజెక్టుకు రూ.25 కోట్లు, స్లమ్ ఫ్రీ సిటీకి రూ.250 కోట్లు కేటాయించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాజా బడ్జెట్ (2015-16)లో వృత్తిపన్ను, ఆక్ట్రాయ్ పన్ను వాటా, వినోద పన్ను, ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను తదితరమైనవి దాదాపు రూ.1750 కోట్లు ప్రణాళికేతర బడ్జెట్లో కేటాయించాల్సిందిగా జీహెచ్ఎంసీ కోరినట్లు తెలిసింది. ప్రణాళిక నిధుల కింద మరో రూ.1046 కోట్లు కోరినట్లు సమాచారం. మొత్తం రూ. 2796 కోట్లు కోరినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి పత్రికలకు ఎలాంటి సమాచారం ఇవ్వరాదనే ఆదేశాలు ఉండటంతో అధికారులెవరూ పెదవి విప్పడానికి సాహసించడం లేదు. -
అమ్మా.. నోర్ముసుకో అనడం పద్ధతేనా
-
అమ్మా.. నోర్ముసుకో అనడం పద్ధతేనా
హైదరాబాద్ : మంత్రిగా పనిచేసిన వ్యక్తి శాసనసభలో శాసనసభ్యులను నోర్ముసుకో అనడం పద్ధతేనా అని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బంగ్లా రాజకీయాలు శాసనసభలో పడవవని ఆయన అన్నారు. కాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. అధికార సభ్యులను నోరు మూసుకో అని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ వ్యాఖ్యానించారు. డీకే అరుణ తీరుపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కొన్ని సమీకరణాల కారణంగా మహిళా సభ్యులకు మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయామన్నారు. అంతేకానీ కాంగ్రెస్ మాదిరిగా మహిళా మంత్రులను సీబీఐ కేసుల్లో ఇరికించలేదన్నారు. తాము మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో చేసినట్లు సభలో దాదాగిరి చేస్తే నడవదని, బంగ్లా రాజకీయాలు ఇక్కడ కుదరవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రశ్నోత్తరాల చర్చ సందర్భంగా డీకే అరుణ తమ నియోజకవర్గంలోని ఓ బ్రిడ్జి నిర్మాణం పూర్తిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. బ్రిడ్జి పనులను సభ్యురాలితో చర్చించి త్వరలోనే నిర్మాణ పనుల పూర్తికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి స్పందనపై డీకే అరుణ అసంతృప్తి వ్యక్తం చేయగా రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. మీతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన సంభాషణలో డీకే అరుణ అధికారపార్టీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి నిన్న సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. టీడీపీ పట్ల టీఆర్ఎస్ సర్కార్ కక్ష సాధిస్తుందంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా ఆందోళన చేస్తున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున 144 సెక్షన్ కారణంగా అసెంబ్లీ పరిసరాల్లో ఎలాంటి ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. అరెస్ట్ అయినవారిలో ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, సండ్ర వీరయ్య, మాధవరం కృష్ణారావు, గోపీనాథ్, గాంధీమోహన్, రాజేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులను అరెస్ట చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు నోటికి నల్ల రిబ్బర్లు కట్టుకుని నిరసన తెలిపారు. -
'తప్పు చేసినవారిని క్షమించవద్దు'
-
నోర్ముసుకో.. ఏంమాట్లాడుతున్నావ్..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం హాట్‌హాట్‌గా జరిగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మహబూబ్ నగర్ జిల్లా గుర్రం గడ్డ అభివృద్ధిపై మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. డీకె అరుణ.. అధికార పక్ష సభ్యులను నోరుమూసుకోండి అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు జోక్యం చేసుకోగా... నోర్ముసుకో..ఏం మాట్లాడుతున్నావ్...నోర్ముయ్...మహిళలతో మాట్లాడే పద్ధతి ఇదేనా.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇలాగేనా... టీఆర్ఎస్ పార్టీలో మహిళలను నోరు మూపించేశారు మీరు అంటూ డీకె అరుణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని మీ దాదాగిరి ఇక్కడ చెల్లదు...ఏమైనా ఉంటే మహబూబ్‌నగర్ లో చూపించుకోండి అని అన్నారు. -
'తప్పు చేసినవారిని క్షమించవద్దు'
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో జాతీయ గీతం ఆలాపన సందర్భంగా జరిగిన సంఘటనపై హామీ మేరకు స్పీకర్ మధుసూదనాచారి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి కోరారు. తప్పు చేసిన వారిని ఎవరిని క్షమించవద్దని ఆయన మంగళవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. గొడవకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. కాగా సభను వాయిదా వేసి సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించేవిధంగా స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎమ్మల్యేలు డీకే అరుణ, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్ తదితరులు సభలోనే జానారెడ్డికి సూచించారు. అయితే వారి సూచనలను జానారెడ్డి ఏమాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం. కాగా ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిన్న సభలో క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. -
డీకె.అరుణ ప్రవర్తన సిగ్గుచేటు
-
నోర్ముసుకో.. ఏంమాట్లాడుతున్నావ్..
-
తెలంగాణ అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం రాజకీయ పార్టీలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల ఆందోళనపై బీజేపీ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలంలో హరితహారం పేరుతో గిరిజన వ్యవసాయ భూములను బలవంతంగా భూములు లాక్కోవడంపై సీపీఎం వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే తెలంగాణ కౌన్సిల్లో...పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. -
సాయంత్రం వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం సాయంత్రం వరకూ కొనసాగనున్నాయి. నేడు సభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై చర్చ కొనసాగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. మరోవైపు అసెంబ్లీలో బుధవారం తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు.