
నోర్ముసుకో.. ఏంమాట్లాడుతున్నావ్..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం హాట్హాట్గా జరిగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మహబూబ్ నగర్ జిల్లా గుర్రం గడ్డ అభివృద్ధిపై మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
డీకె అరుణ.. అధికార పక్ష సభ్యులను నోరుమూసుకోండి అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యులు జోక్యం చేసుకోగా... నోర్ముసుకో..ఏం మాట్లాడుతున్నావ్...నోర్ముయ్...మహిళలతో మాట్లాడే పద్ధతి ఇదేనా.. మహిళలకు ఇచ్చే గౌరవం ఇలాగేనా... టీఆర్ఎస్ పార్టీలో మహిళలను నోరు మూపించేశారు మీరు అంటూ డీకె అరుణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని మీ దాదాగిరి ఇక్కడ చెల్లదు...ఏమైనా ఉంటే మహబూబ్నగర్ లో చూపించుకోండి అని అన్నారు.