'కేసీఆర్ ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తోంది' | DK Aruna takes on KCR Govt | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తోంది'

Published Wed, Mar 18 2015 1:36 PM | Last Updated on Thu, Aug 16 2018 3:23 PM

'కేసీఆర్ ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తోంది' - Sakshi

'కేసీఆర్ ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తోంది'

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. అందులోభాగంగానే అసెంబ్లీలో తనను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద డీకే అరుణ మాట్లాడుతూ... మైనింగ్ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తుందని... ఈ నేపథ్యంలో మైనింగ్ అంశాన్ని సభలో లేవనెత్తడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.

తనపై విప్ సునీత అనవరస వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈ సందర్బంగా అరుణ విజ్ఞప్తి చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement