telangana discoms
-
రూ.6,756.92 కోట్ల కరెంట్ బాకీలు కట్టండి.. తెలంగాణకు కేంద్రం ఆదేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థలకు దీర్ఘకాలంగా బకాయిపడ్డ రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్కో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకూ తెలంగాణకు అందచేసిన ఈ విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు దీర్ఘకాలంగా పేరుకుపోయాయి. తెలంగాణ సర్కారు ఈ బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ విద్యుత్తు సంస్థలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రాన్ని కోరింది. సరిగ్గా వారం రోజుల క్రితం ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే అంశాన్ని ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ప్రస్తావించారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి కూడా తెచ్చారు. ఈ నేపథ్యంలో రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనూప్ సింగ్ బిస్త్ సోమవారం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సకాలంలో చెల్లించకపోవడంతో.. ఏపీ జెన్కో సరఫరా చేసిన 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కమ్‌లు రూ.3,441.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ ఏడాది జూలై 31 నాటికి మరో రూ.3,315.14 కోట్లు లేట్ పేమెంట్ సర్ చార్జీ పడింది. ఈ మొత్తం రూ.6,756.92 కోట్లను ఏపీకి చెల్లించాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ మొండి వైఖరి 2019 ఆగస్టు 19న జరిగిన ఇరు రాష్ట్రాల సంయుక్త సమావేశంతో పాటు పలు సందర్భాల్లో ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ డిస్కమ్‌లు ఒప్పుకున్నా డబ్బులు మాత్రం విడుదల కాలేదు. 2020 జనవరిలో జరిగిన ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ బకాయిల అంశాన్ని చర్చించారు. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ (ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్ డీమెర్జర్ ప్లాన్) పూర్తైన తరువాత బకాయిల గురించి ఆలోచిస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తోంది. అప్పుచేసి మరీ కరెంట్ సరఫరా.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల (ఆర్ఈసీ) నుంచి 2014 జూన్ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5,625 కోట్ల రుణాలను ఏపీ జెన్కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయగలిగింది. కానీ వాడుకున్న విద్యుత్‌కు తెలంగాణ డిస్కమ్‌లు డబ్బులివ్వకపోవడంతో పీఎఫ్సీ, ఆర్ఈసీలకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏపీజెన్కోకు ఏర్పడింది. కేంద్రం జోక్యాన్ని కోరిన ఏపీ.. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు కోరింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహించిన ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శుల సమావేశంలోనూ ఈ మేరకు ఏపీ అధికారులు అభ్యర్థించారు. తెలంగాణ డిస్కమ్‌లు కేంద్రం నుంచి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద పొందుతున్న రుణాన్ని ఏపీ జెన్కో బకాయిలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని 15 రోజుల్లో ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్ సూచించారు. గడువులోగా తేల్చుకోలేని పక్షంలో తమ దృష్టికి తెస్తే కేంద్ర హోంశాఖతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ చర్చలు సఫలం కాకపోగా తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ కొత్త మెలిక పెట్టింది. పట్టుబట్టి సాధించిన సీఎం జగన్.. తెలంగాణ సర్కారు మొండి వైఖరితో విసిగిపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాలని పట్టుబట్టింది. గతేడాది నవంబర్‌లో తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి ఈ అంశాన్ని సీఎం జగన్ తెచ్చారు. బకాయిలు చెల్లించేలా తెలంగాణను ఆదేశించాలని కోరారు. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీతో జరిగిన భేటీలోనూ, తాజాగా ఈ నెల 22న మరోసారి ప్రధానిని కలిసినప్పుడు కూడా తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిల అంశాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోనే కేంద్ర విద్యుత్‌శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. -
TSSPDCL: ఒత్తిళ్లకు తలొగ్గి.. వివాదంలో ఇంజినీర్ల బదిలీలు
సాక్షి, సిటీబ్యరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఇంజినీర్ల బదిలీల అంశం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఫోకల్ పోస్టులో పనిచేస్తున్న వారిని నాన్ ఫోకల్‌కు కాకుండా మళ్లీ అదే ఫోకల్ పోస్టులకు బదిలీ చేయడమే ఇందుకు కారణం. అంతేకాదు ఏడు నెలల క్రితం ఏఈ నుంచి ఏడీఈగా పదోన్నతి పొంది.. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు స్వీకరించకుండా విధులకు దూరంగా ఉంటున్న ముగ్గురు ఇంజినీర్లకు కీలక ఫోకల్ పోస్టుల్లో ఏడీఈలుగా అధికారాలు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పరిపాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రతి మూడేళ్లకోసారి ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ చేస్తుంటారు. ఇందులో భాగంగా డిస్కం పరిధిలో 65 మంది సీనియర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు సహా 304 మంది ఏఈలు, 135 మంది ఏడీఈలు, 65 మంది డీఈలను బదిలీ చేసింది. ఆ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ బదిలీల్లో అనేక అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల పాటు ఫోకల్ (ఆపరేషన్ విభాగం)పోస్టులో పని చేసిన వారికి ఆ తర్వాత నాన్‌ఫోకల్ పోస్టులో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. కానీ.. నేతలు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గిన యాజవన్యం ఒక్క గ్రేటర్‌లోనే 15 మంది డీఈలకు ఫోకల్ టు ఫోకల్ పోస్టులను కట్టబెట్టిందని తెలుస్తోంది. ఫోకల్ పోస్టుల కోసం పోటాపోటీ.. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఫోకల్, నాన్ ఫోకల్ అంటూ ప్రత్యేక విభాగాలు అంటూ ఏమీ ఉండవు. కానీ విద్యుత్ శాఖలో కొత్త కనెక్షన్లు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భారీ భవన నిర్మాణాలు, సంస్థకు రెవిన్యూ ఎక్కువగా (ఆపరేషన్ విభాగం)వచ్చే ప్రాంతాలను ఫోకల్ పోస్టులుగా, నష్టాలు ఎక్కువగా ఉండే పాతబస్తీ సహా మారుమూల జిల్లాలను నాన్ ఫోకల్ పోస్టులుగా విభజించారు. గ్రేటర్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు, 22 డివిజన్లు ఉన్నాయి. వీటిలో శివారు ప్రాంతాల్లోని కొండాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, చంపాపేట్, సరర్నగర్, హబ్సిగూడ, కూకట్పల్లి, సైబర్‌సిటీ, బంజారాహిల్స్, జీడిమెట్ల, శంషాబాద్, కీసర సహా శివారు ప్రాంతాల్లో సిటీకి ఆనుకుని ఉన్న చౌటుప్పల్, యాదాద్రి, షాద్‌నగర్ డివిజన్లను ఫోకల్ పోస్టులు భావిస్తారు. పాతబస్తీ సహా మారుమూల జిల్లాల్లోని డివిజన్లను నాన్‌ఫోకల్‌గా విభజించారు. వీటిలో కొత్తగా అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ అనుబంధ కంపెనీలు, పరిశ్రమలు, ఇతర పెట్టుబడి సంస్థలే కాదు కొత్త విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు ఎక్కువ. ఇవి ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజినీర్ల పాలిట కామధేనువుల్లా మారుతున్నాయి. పదోన్నతులు పొందినా విధుల్లో చేరని వైనం సంస్థ పరిధిలో పని చేస్తున్న పలువురు ఏఈలకు ఇటీవల సీనియార్టీ ప్రతిపాదికన పదోన్నతులు కల్పింంది. ఈ మేరకు జనవరి 10వ తేదీన 153 మంది ఏ ఈలకు ఏడీఈలుగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్‌లు కూడా ఇ్చంది. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వారెవర కొత్త పోస్టుల్లో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఏడీఈగా బాధ్యతలు స్వీకరించని ముగ్గురు ఇంజనీర్లకు యాజవన్యం ప్రస్తుత బదిలీల్లో కీలకమైన ఫోకల్ పోస్టులను కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై డిస్కం మానవ వనరుల విభాగం(హెచ్ఆర్) డైరెక్టర్ పర్వతంను వివరణ కోరగా..అంతా పారదర్శకంగానే జరిగినట్లు చెప్పడం విశేషం. ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి అక్రమాలు, అవినీతి చోటు చేసుకోలేదని, సీనియార్టీ ఆధారంగానే బదిలీల ప్రక్రియను పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: అమ్మాయివి నీకెందుకమ్మా? నన్ను చూసి నవ్వుకున్నారు.. -
తెలంగాణ డిస్కంల పనితీరు అధ్వానం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు, ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు వెల్లడైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 41 డిస్కంల పనితీరును కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిశీలించి రేటింగ్స్ నిర్ధారించింది. తాజాగా ప్రకటించిన 9వ వార్షిక సమగ్ర రేటింగ్స్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు ‘బీ -గ్రేడ్’, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు ‘సీ -గ్రేడ్’దక్కాయి. ఉత్తర తెలంగాణ డిస్కం బీహార్ లాంటి రాష్ట్రాల డిస్కంల సరసన నిలవడం గమనార్హం. అత్యుత్తమ పనితీరుతో గుజరాత్‌లోని నాలుగు డిస్కంలతోపాటు హర్యానాలోని ఒక డిస్కం ‘ఏ+’ గ్రేడ్‌ను సాధించి జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలవగా హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలకు చెందిన ఒక్కో డిస్కం ‘ఏ’ గ్రేడ్‌ను దక్కించుకున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్లో లోపాలు నిర్దేశితం కన్నా అధిక వ్యయంతో విద్యుత్ కొనుగోళ్లు చేయడం గడువులోగా 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల టారిఫ్ ప్రతిపాదనల (ఏఆర్ఆర్)ను ఈఆర్సీకి సమర్పించకపోవడం సంస్థకు వరుసగా మూడేళ్లు నష్టాలు రావడం విద్యుత్ బిల్లుల వసూళ్లతోపాటు కొనుగోళ్లకు జరిపే చెల్లింపుల్లో తీవ్ర జాప్యం పెరుగుతున్న ఇంధన వ్యయానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా టారిఫ్‌ను పెంచే వ్యవస్థ లేకపోవడం సాంకేతిక, వాణిజ్య(ఏటీ అండ్ సీ) విద్యుత్ నష్టాలను తగ్గించుకోకపోవడం టీఎస్ఎన్పీడీసీఎల్లోని కీలక లోపాలు 2018-19లో 26.66 శాతం ఉన్న విద్యుత్ నష్టాలు 2019-20లో 34.49 శాతానికి పెరిగిపోవడం 2019-20లో యూనిట్‌కు రూ.5.26 చొప్పున అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడం 2020-21, 2021-22ల టారిఫ్ ప్రతిపాదనలను నిర్దేశిత గడువులోగా ఈఆర్సీకి సమర్పించకపోవడం 2019-20లో అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు జరపడం, ప్రభుత్వం నుంచి సకాలంలో సబ్సిడీలు రాకపోవడంతో సంస్థ చేసిన వ్యయం తిరిగి రాబట్టుకోలేకపోవడం పెరుగుతున్న ఇంధన వ్యయానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా టారిఫ్‌ను పెంచే వ్యవస్థ లేకపోవడం విద్యుత్ బిల్లుల వసూళ్లు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం -
ప్రత్యేక కేటగిరీ కింద విద్యుత్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ‘ప్రత్యేక కేటగిరీ’కింద విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు 400 కేవీల భారీ లోడ్‌తో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండటంతో ఇందు కోసం కొత్త కేటగిరీని సృష్టించనుంది. ప్రస్తుతం నీటిపారుదల ప్రాజెక్టులకు హెచ్‌టీ–4 (ఏ) కేటగిరీ కింద యూనిట్‌కు రూ.5.8 చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నారు. 11కేవీ, 33 కేవీ, 132 కేవీ లోడ్ లోపు విద్యుత్ సరఫరాకు ఈ కేటగిరీ వర్తిస్తుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయితే రోజుకు 3 టీఎంసీ ల నీటిని తరలించేందుకు గరిష్టంగా 7,152 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుంది. ఇంత భారీ మొత్తంలో విద్యుత్‌ను 400 కేవీ లోడ్‌తో సరఫరా చేస్తారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాల కోసం విద్యుత్ సరఫరా కోసం కొత్త కేటగిరీ సృష్టించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కొత్త కేటగిరీ కింద విద్యుత్ టారీఫ్ ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రతిపాదించనున్నాయి. 2019–20కు సంబంధించి త్వరలో ఈఆర్సీకి సమర్పించనున్న వార్షిక టారీఫ్ ప్రతిపాదనల్లో కొత్త కేటగిరీని చేర్చే అవకాశముంది. కొత్త కేటగిరీ కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే అవకాశం ఉంది. ఒకట్రెండేళ్ల తర్వాతే స్పష్టత కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ వ్యయభారంపై ఒకట్రెండేళ్లు గడిచిన తర్వాతే స్పష్టత రానుందని ట్రాన్స్‌కో అధికార వర్గాలు చెబుతున్నాయి. నీటిపారుదల శాఖ కోరిన మేరకు సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్‌ను సమీకరించి పెట్టుకున్నా, వాస్తవానికి వినియోగం ఎంతో ఇప్పుడే చెప్పలేమంటున్నాయి. ఇంకా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల నీటినే తరలిస్తారు. దీంతో ఈ ఏడాది 3,800 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించాలని నిర్ణయించడంతో 4,992 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గరిష్టంగా 7,152 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. ఈ ప్రాజెక్టు అవసరాల కోసం ఏటా 13,558 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని ప్రాజెక్టు డీపీఆర్‌లో అంచనా వేశారు. ఒకటి రెండేళ్లు గడిస్తే ప్రాజెక్టు విద్యుత్ వినియోగంపై స్పష్టత వస్తుందని, అప్పుడు విద్యుత్ వ్యయ భారంపై స్పష్టత వస్తుందని అధికారవరాలు చెబుతు న్నాయి. కొత్త కేటగిరీ కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు సరఫరా చేసే విద్యుత్ టారీఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించాల్సి ఉంది. యూనిట్‌కు రూ.3 చొç ³్పున తక్కువ ధరతో విద్యుత్ సరఫరా చే యాలని నిర్ణయించినా, డీపీఆర్ అంచనాల ప్ర కారం ఈ ప్రాజెక్టు విద్యుత్ చార్జీల వ్యయం ఏటా రూ.4,067 కోట్లు కానున్నాయి. యూనిట్‌కు రూ.4 చొప్పున విద్యుత్ సరఫరా చేయా లని నిర్ణయిస్తే, ఏటా రూ.5,423 కోట్ల విద్యుత్ వ్యయం కానుంది. యూనిట్‌కు రూ.5 చొప్పున విద్యుత్ సరఫరా చేయాలని కోరితే ఏటా రూ. 6,779 కోట్ల విద్యుత్ చార్జీలు కానున్నాయి. -
‘విద్యుత్’ నష్టాలు పైపైకి!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ నష్టాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. డిస్కంల అగ్రిగేట్ ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ (ఏటీ అండ్ సీ) నష్టాల్లో క్రమంగా భారీ పెరుగుదల నమోదవుతోంది. 2017–18లో 10.51 శాతంగా నమోదైన నష్టాలు 2018–19 నాటికి 13.27కు పెరగనున్నాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి డిస్కంలు నివేదించాయి. అంటే రాష్ట్రానికి సరఫరా చేసేందుకు డిస్కంలు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌లో 13.27 శాతం నష్టాల పాలవనుంది. టీఎస్ఈఆర్సీ జారీ చేసిన టారీఫ్ ఉత్తర్వుల ప్రకారం 2018–19లో రాష్ట్ర విద్యుత్ అవసరాలు 57,631.27 మిలియన్ యూనిట్లు (ఎంయూ) కాగా.. అందులో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల వాటా 7,910.48 ఎంయూలు ఉండనుంది. ఆ ప్రకారం విద్యుత్ కొనుగోలు యూనిట్‌కు రూ.4.07 చొప్పున నష్టాల పాలవనున్న విద్యుత్ విలువ రూ.3,219.56 కోట్లు. నష్టాల రికవరీ కూడా పరిగణనలోకి తీసుకుని వినియోగదారుల నుంచి వసూలు చేసే విద్యుత్ టారీఫ్‌ను ఈఆర్సీ నిర్ణయిస్తుంది. డిస్కంల ‘ఏటీ అండ్ సీ’నష్టాలు ఇలా పెరుగుతూ పోతే భవిష్యత్‌లో వినియోగదారులపై చార్జీల భారం పెరగడంతో పాటు డిస్కంలు సైతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది. -
కృష్ణపట్నం.. డబుల్ దగా
రెండో యూనిట్ ట్రయల్ రన్ ఈ వారం నుంచే ప్రయోగాత్మక ఉత్పత్తి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు వాటాల పంపిణీ వ్యత్యాసం పెరిగిపోతోంది. తెలంగాణకు కృష్ణపట్నం నుంచి రావాల్సిన విద్యుత్తు వాటాల లోటు రెండింతలకు పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణపట్నంలో రెండో యూనిట్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. సోమవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వారం నుంచే ఇన్ఫర్మ్ పవర్ (ప్రయోగాత్మక దశ) ఉత్పత్తి మొదలవనుంది. ప్రస్తుతం కృష్ణపట్నం ప్లాంట్‌లో 800 మెగావాట్ల మొదటి యూనిట్ ఉత్పత్తి కొనసాగుతోంది. మార్చి నుంచి ఇప్పటివరకు అందులో ఒక్క యూనిట్‌నూ తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ అడ్డుకుంటోంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం నుంచి 53.89 శాతం విద్యుత్తు తెలంగాణ డిస్కంలకు రావాల్సి ఉంది. వాటా ప్రకారం మొదటి యూనిట్ విద్యుత్తు రాకపోవటంతో గడచిన తొమ్మిది నెలల్లో దాదాపు రూ.120 కోట్లు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో రెండో యూనిట్ కూడా ప్రారంభమవుతుండటంతో... ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ చేస్తుందా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మొండికేస్తే.. విద్యుత్తు వాటాల పంపిణీపై మరింత పట్టు పట్టాలని తెలంగాణ జెన్కో, డిస్కం అధికారులు భావిస్తున్నారు. చట్ట ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు వాటాల పంపిణీ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఇటీవలే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం రెండో యూనిట్లో విద్యుదుత్పత్తి ఎటువైపు మలుపు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది. -
పీపీఏలపై భేటీకి హిందూజా డుమ్మా
* సవరణలపై కంపెనీ అభ్యంతరాలు * కన్సల్టెంట్లతో డిస్కం అధికారుల చర్చలు * తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ ఇవ్వాల్సిందేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డిస్కంతో మంగళవారం జరిపే సంప్రదింపులకు హిందూజా కంపెనీ డుమ్మా కొట్టింది. ఆకస్మిక పనులు ఉన్నందున రాలేకపోతున్నామని ఈ మెయిల్ ద్వారా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం పంపించింది. డిసెంబర్ మొదటి వారంలో చర్చలకు వచ్చేందుకు కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని టీఎస్ ఎస్పీడీసీఎల్ ఛైర్మన్, ఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దీంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఆ కంపెనీ లేవనెత్తిన అభ్యంతరాలను కన్సల్టెంట్లు డిస్కం అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో కన్సల్టెంట్లతోనే అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఒప్పందాలు, సవరణలు, కంపెనీ ప్రస్తావించి న అభ్యంతరాలపై చర్చలు జరిపారు. గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం మేరకు, తెలంగాణకు రావాల్సిన వాటాను ఆ కంపెనీ సమకూర్చాల్సి ఉంటుందని కన్సల్టెంట్లకు తేల్చిచెప్పారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హిందూజా కంపెనీ నుంచి తెలంగాణకు 53.89 శాతం విద్యుత్ (280 మెగావాట్లు) రావాలి. ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడే 1994లో హిందూజా కంపెనీతో అప్పటి ఏపీఎస్ఈబీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. మారిన నిబంధనల ప్రకారం 1998లో పీపీఏను సవరించుకుంది. ఆ కంపెనీ విద్యుత్‌ప్లాంట్ నిర్మాణం నిదానంగా సాగడంతో ఒప్పందాలు అమల్లోకి రాలేదు. ఈలోగా కేంద్ర ప్రభుత్వ 2003 విద్యుత్ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో పాత పీపీఏల్లో కొన్ని నిబంధనలు సవరించుకోవాలని డిస్కం అధికారులు తెలిపారు. కానీ చర్చలకు రాకుండానే హిందూజా కంపెనీ షరతులపై అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో డిస్కం ఈ వ్యవహారాన్ని తెలంగాణ ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లనుంది. -
విద్యుత్ కొనుగోలుకు అనుమతివ్వండి
ఈఆర్సీని కోరిన తెలంగాణ డిస్కంలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ లోటును పూడ్చుకునేందుకు రానున్న 25 ఏళ్ల పాటు ఏటా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని తెలంగాణ డిస్కంలు కోరాయి. ఈ మేరకు ఈఆర్సీకి తెలంగాణ డిస్కంలు శనివారం దరఖాస్తు చేసుకున్నాయి. దీర్ఘకాలానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటుచేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. అయితే, విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్ ద్వారా చేయాలా? లేక అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) ద్వారానా అన్నది నిర్ణయించాల్సి ఉంది. ఎంఓయూ ద్వారా కొనుగోలుకు అనుమతించాల్సిందిగా ఈఆర్సీని ప్రభుత్వం అభ్యర్థించే అవకాశముంది. కానీ, బిడ్డింగ్ ద్వారానే కొనుగోలు చేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ స్పష్టం చేస్తోంది. ఆగస్టు 30 నాటికి కృష్ణపట్నం రెడీ: నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో 800 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ తొలి యూనిట్ ఆగస్టు 30 నాటికి సిద్ధం కానుంది. దాంతో ఆగస్టు 30 నుంచి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి ప్రారంభించాలని శనివారం జరిగిన ఏపీసీపీడీసీఎల్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, 200 మెగావాట్ల రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 30 నాటికి గ్రిడ్‌కు అనుసంధానించాలని తీర్మానించారు. అయితే, కృష్ణపట్నం ప్లాంట్ ఒప్పందం మేరకు తెలంగాణ వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ఈ సమావేశంలో తెలంగాణ డిస్కంల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయన్నారు. మీ ఆదేశాలు పాటించడం లేదు: సీలేరు ప్లాంట్ నుంచి విద్యుత్‌ను తెలంగాణకే ఇవ్వాలని గోదావరి జల నియంత్రణ బోర్డు చైర్మన్ మహేంద్రన్ రెండు రోజుల కిందట ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆ ఆదేశాలు జారీ అయి 48 గంటలు దాటినప్పటికీ తమకు విద్యుత్ ఇవ్వడం లేదని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి సురేష్ చంద్ర శనివారం గోదావరి జల నియంత్రణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఆదేశాలను వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.