TSSPDCL: ఒత్తిళ్లకు తలొగ్గి.. వివాదంలో ఇంజినీర్ల బదిలీలు | Engineers Transfers Issue In TSSPDCL Has Become Controversial | Sakshi
Sakshi News home page

TSSPDCL: ఒత్తిళ్లకు తలొగ్గి.. వివాదంలో ఇంజినీర్ల బదిలీలు

Published Mon, Aug 9 2021 8:24 AM | Last Updated on Mon, Aug 9 2021 8:31 AM

Engineers Transfers Issue In TSSPDCL Has Become Controversial - Sakshi

సాక్షి, సిటీబ్యరో: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)లో ఇంజినీర్ల బదిలీల అంశం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఫోకల్‌ పోస్టులో పనిచేస్తున్న వారిని నాన్‌ ఫోకల్‌కు కాకుండా మళ్లీ అదే ఫోకల్‌ పోస్టులకు బదిలీ చేయడమే ఇందుకు కారణం. అంతేకాదు ఏడు నెలల క్రితం ఏఈ నుంచి ఏడీఈగా పదోన్నతి పొంది.. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు స్వీకరించకుండా విధులకు దూరంగా ఉంటున్న ముగ్గురు ఇంజినీర్లకు కీలక ఫోకల్‌ పోస్టుల్లో ఏడీఈలుగా అధికారాలు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

పరిపాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రతి మూడేళ్లకోసారి ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ చేస్తుంటారు. ఇందులో భాగంగా డిస్కం పరిధిలో 65 మంది సీనియర్, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు సహా 304 మంది ఏఈలు, 135 మంది ఏడీఈలు, 65 మంది డీఈలను బదిలీ చేసింది. ఆ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ బదిలీల్లో అనేక అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల పాటు ఫోకల్‌ (ఆపరేషన్‌ విభాగం)పోస్టులో పని చేసిన వారికి ఆ తర్వాత నాన్‌ఫోకల్‌ పోస్టులో పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ.. నేతలు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గిన యాజవన్యం ఒక్క గ్రేటర్‌లోనే 15 మంది డీఈలకు ఫోకల్‌ టు ఫోకల్‌ పోస్టులను కట్టబెట్టిందని తెలుస్తోంది.    

ఫోకల్‌ పోస్టుల కోసం పోటాపోటీ.. 
సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఫోకల్, నాన్‌ ఫోకల్‌ అంటూ ప్రత్యేక విభాగాలు అంటూ ఏమీ ఉండవు. కానీ విద్యుత్‌ శాఖలో కొత్త కనెక్షన్లు, పరిశ్రమలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, భారీ భవన నిర్మాణాలు, సంస్థకు రెవిన్యూ ఎక్కువగా (ఆపరేషన్‌ విభాగం)వచ్చే ప్రాంతాలను ఫోకల్‌ పోస్టులుగా, నష్టాలు ఎక్కువగా ఉండే పాతబస్తీ సహా మారుమూల జిల్లాలను నాన్‌ ఫోకల్‌ పోస్టులుగా విభజించారు. గ్రేటర్‌ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు, 22 డివిజన్లు ఉన్నాయి. వీటిలో శివారు ప్రాంతాల్లోని కొండాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, చంపాపేట్, సరర్‌నగర్, హబ్సిగూడ, కూకట్‌పల్లి, సైబర్‌సిటీ, బంజారాహిల్స్, జీడిమెట్ల, శంషాబాద్, కీసర సహా శివారు ప్రాంతాల్లో సిటీకి ఆనుకుని ఉన్న చౌటుప్పల్, యాదాద్రి, షాద్‌నగర్‌ డివిజన్లను ఫోకల్‌ పోస్టులు భావిస్తారు. 

పాతబస్తీ సహా మారుమూల జిల్లాల్లోని డివిజన్లను నాన్‌ఫోకల్‌గా విభజించారు. వీటిలో కొత్తగా అనేక రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ అనుబంధ కంపెనీలు, పరిశ్రమలు, ఇతర పెట్టుబడి సంస్థలే కాదు కొత్త విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ కనెక్షన్లు ఎక్కువ. ఇవి ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజినీర్ల పాలిట కామధేనువుల్లా మారుతున్నాయి.  

పదోన్నతులు పొందినా విధుల్లో చేరని వైనం
సంస్థ పరిధిలో పని చేస్తున్న పలువురు ఏఈలకు ఇటీవల సీనియార్టీ ప్రతిపాదికన పదోన్నతులు కల్పింంది. ఈ మేరకు జనవరి 10వ తేదీన 153 మంది ఏ ఈలకు ఏడీఈలుగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్‌లు కూడా ఇ్చంది. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వారెవర కొత్త పోస్టుల్లో చేరలేదు.  ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఏడీఈగా బాధ్యతలు స్వీకరించని ముగ్గురు ఇంజనీర్లకు యాజవన్యం ప్రస్తుత బదిలీల్లో కీలకమైన ఫోకల్‌ పోస్టులను కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై డిస్కం మానవ వనరుల విభాగం(హెచ్‌ఆర్‌) డైరెక్టర్‌ పర్వతంను వివరణ కోరగా..అంతా పారదర్శకంగానే జరిగినట్లు చెప్పడం విశేషం. ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి అక్రమాలు, అవినీతి చోటు చేసుకోలేదని, సీనియార్టీ ఆధారంగానే బదిలీల ప్రక్రియను పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు.   

చదవండి: అమ్మాయివి నీకెందుకమ్మా? నన్ను చూసి నవ్వుకున్నారు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement