Telangana Irrigation Minister
-
మూడేళ్లలో.. 99
-
మూడేళ్లలో.. 99
ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం, నాబార్డు, ఎన్‌డబ్ల్యూడీఏ మధ్య కుదిరిన ఒప్పందం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో 76.03 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం తన వాటాగా రూ. 31,342 కోట్లను సమకూర్చనున్న కేంద్రం రాష్ట్రాల వాటా నిధుల కోసం నాబార్డు ద్వారా రుణ సదుపాయం జాబితాలో తెలంగాణ నుంచి 11, ఏపీ నుంచి ఎనిమిది ప్రాజెక్టులు ఒప్పందం కొత్త శకానికి నాంది: హరీశ్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద దేశవ్యాప్తంగా కేంద్రం గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్ర జల వనరుల శాఖ, నాబార్డు, జాతీయ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, కేంద్ర సహాయ మంత్రి సంజీవ్ కుమార్, ఏఐబీపీ అమలు టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్, ఛత్తీస్‌గఢ్ మంత్రి బ్రిజ్మోహన్, సభ్యులు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరి సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 99 ప్రాజెక్టులకు.. దేశవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 99 సాగునీటి ప్రాజెక్టులను గుర్తించిన కేంద్రం.. నాబార్డ్ నిధుల ద్వారా 2019-20లోపు వాటిని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ ప్రాజెక్టుల ద్వారా 76.03 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలి దశలో 2016-17 నాటికి 23 ప్రాజెక్టులు, రెండో దశలో 2017-18 నాటికి 31 ప్రాజెక్టులు, మూడో దశలో 2019 డిసెంబర్ నాటికి మిగతా 45 ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయించింది. వీటన్నింటికీ కలిపి రూ.77,595 కోట్లు అవసరమని అంచనా వేయగా... ఇందులో రూ.31,342 కోట్లను కేంద్రం పీఎంకేఎస్‌వై కింద తన వంతు సాయంగా ఆయా రాష్ట్రాలకు అందజేస్తుంది. మిగతా రూ.46,253 కోట్లను రాష్ట్రాలు తమ వాటాగా భరించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులను కూడా ఆయా రాష్ట్రాలు నాబార్డ్ నుంచి రుణంగా పొందే వెసులుబాటు తాజా ఒప్పందంతో కలుగుతుంది. కేంద్రం ఎంపిక చేసిన 99 ప్రాజెక్టుల్లో తెలంగాణ నుంచి దేవాదుల, కొమురం భీం, గొల్లవాగు, ర్యాలీ వాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్ర కాలువ జలాశయం, తాడిపూడి ఎత్తిపోతల, పుష్కర ఎత్తిపోతల, గుండ్లకమ్మ, తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, ముసురుమిల్లి తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం: హరీశ్‌రావు సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్ర జల వనరుల శాఖ, నాబార్డు, జాతీయ వాటర్ డెవలప్మెంట్ అథారిటీల మధ్య ఒప్పందం కొత్త శకానికి నాంది పలికిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గతంలో కేంద్రంలో ప్రాజెక్టులను రూపకల్పన చేసి అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించేవారని చెప్పారు. కానీ మొదటిసారిగా కేంద్ర మంత్రి ఉమాభారతి చొరవ తీసుకుని.. రాష్ట్రాల అవసరాలేమిటి, ప్రాజెక్టులను ఎలా చేపడితే బాగుంటుందనే అంశంపై మూడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా 99 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి 76 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాధించే లక్ష్యంతో ముందుకు పోతున్నారని హరీశ్ వెల్లడించారు. ‘‘గతంలో ఏఐబీపీ కింద కేంద్రం తక్కువ మొత్తంలో నిధులు ఇచ్చేది. ఇప్పుడు కేంద్రం తన వాటా నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వడమే కాకుండా.. సదరు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవసరమైన నిధుల కోసం నాబార్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్రైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు వీలు కలిగిస్తోంది. నాబార్డుతో కేంద్రం కుదుర్చుకున్న ఈ ఒప్పందం దేశంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తోడ్పడుతుంది. కేంద్రం ఎంపిక చేసిన 99 ప్రాజెక్టుల్లో తెలంగాణ నుంచి 11 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది చాలా సంతోషకరం. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల పూర్తికి రూ.7 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపాం. రూ.2 వేల కోట్లు గ్రాంట్‌గా, రూ.5 వేల కోట్లు రుణంగా ఇవ్వాలని కోరాం. సెప్టెంబర్ చివరికల్లా నిధులు విడుదల చేస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారు. ఇప్పటికే దేవాదుల ప్రాజెక్టుకు రూ. 3 వేల కోట్లు కేటాయించారు..’’ అని హరీశ్ తెలిపారు. -
మల్లన్న ప్రొజెక్టును అడ్డుకోవడం కరెక్ట్ కాదు
-
'హరీష్‌రావుతో భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు'
హైదరాబాద్ : తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావుతో భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. హరీష్ రావు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకే ఆయనను కలసినట్లు ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను హరీష్ రావు సందర్శించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనను కలసి కృతజ్ఞతలు చెప్పినట్లు చెప్పారు. టీఆర్ఎస్లో చేరతారా ? అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు... టీఆర్ఎస్లో చేరతానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. అలాగే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అని విలేకర్లు ప్రశ్నించగా... ఈ అంశంపై నో కామెంట్ అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జవాబు దాటి వేశారు. -
'ముక్కుల పుల్లపెట్టుకుని తుమ్మినట్లుంది'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మంగళవారం నిప్పులు చెరిగారు. శుభకార్యం జరుగుతుంటే ముక్కుల పుల్లపెట్టుకుని తుమ్మినట్లుందని ఏపీ కేబినెట్ తీరును హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమిపూజ చేసుకుని తెలంగాణ ప్రజలు సంబురపడుతుంటే కండ్లమంటతో చంద్రబాబు తీర్మానం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఆయన మంత్రి వర్గానికి మానవత్వం లేదనడానికి ఇదో ఉదాహరణ అని హరీష్‌రావు అన్నారు. దీక్ష చేస్తానంటున్న వైఎస్ జగన్‌పై పైచేయి సాధించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి... ఏపీ కుటిల రాజకీయాల కోసం తెలంగాణ రైతులతో పాటు ప్రాజెక్టులను బలి చేయాలనుకోవడం వారి వంకర బుద్ధిని బయటపెడుతున్నదని చెప్పారు. ఏపీ కేబినెట్ తీర్మానం చెల్లని రూపాయి అని వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ కావాలని తాము పోరాడినప్పుడు కూడా ఆంధ్ర నాయకులు ఇవే కాకిలెక్కలు చెప్పారని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ప్రపంచంలో ఎవరూ నమ్మలేదన్నారు. దేశంలోని అన్ని పార్టీలూ తమ తెలంగాణ వాదనే కరెక్టు అని చెప్పాయన్నారు. ప్రస్తుతం నీటిపారుదల రంగంలో కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారని... వాటిని కూడా ఎవరూ నమ్మరని హరీష్ రావు స్పష్టం చేశారు. న్యాయం, ధర్మం, నీతి తమ వైపు ఉన్నాయని చెప్పారు. ధర్మమే గెలుస్తుంది.... నీతి నిలబడుతుంది. ఏపీ కేబినెట్ చేసిన తీర్మానానికి విలువ లేదు కాబ్టటే కోర్టుల్లో పోతామంటున్నారన్నారు. కోర్టుల్లో కేసును ఏండ్లకు ఏండ్లు సాగదీసి ప్రాజెక్టులు కట్టకుండా చూడాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కానీ ఇప్పుడున్నది ఎడ్డి, గుడ్డి తెలంగాణ కాదని... మేల్కొన్న బొబ్బిలి అని స్పష్టం చేశారు. ఎవరు ఎంత అడ్డుపడినా తెలంగాణను అపలేకపోయారని, అలాగే ఇప్పుడు ప్రాజెక్టులు కూడా ఆపలేరన్నారు. ప్రాజెక్టులు కట్టి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తానే ప్రాజెక్టుల దగ్గర కూర్చుని, అక్కడే నిద్రపోయి ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు. నీళ్ల దోపిడీపై చర్చకు సిద్ధమా? అని టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. ''తాము కృష్ణా బేసిన్లోనే ఉన్న పాలమూరు, నల్గొండ జిల్లాలకు కృష్ణా నీరు ఇస్తామంటే అడ్డు తగులుతారా? కృష్ణా బేసిన్లో ఉన్న జిల్లాలను ఎండబెట్టి, పెన్నా బేసిన్‌లోని ప్రాంతాలకు నీరివ్వడం న్యాయమా? దీనికి ఏ ట్రిబ్యునల్ ఒప్పుకుంటది? ఏ కోర్టు ఒప్పుకుంటది? ఎవరి అనుమతి తీసుకున్నరు? నీళ్ల దోపిడీపై చర్చకు చంద్రబాబు సిద్ధమా? సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించమని కేంద్రానికి లేఖ రాయగలరా? కేంద్రానికి లేఖ రాస్తామంటున్నారు కదా, అదే చేతితో తెలంగాణ, ఆంధ్ర ప్రాజెక్టులన్నింటిపై విచారణ జరపాలని రాయండి'' అని టీడీపీ నాయకులకు హరీష్ రావు సూచించారు. -
'కృష్ణా డెల్లాకు నీరు విడుదల నిలిపివేత'
హైదరాబాద్ : కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రబీ పంటకు సాగర్ కుడి కాల్వ కింద నీటిని విడుదల చేయలేమని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటికే కేటాయించిన దాని కంటే అదనంగా నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుందని తెలిపారు. 44 టీఎంసీల నీటిని అదనంగా వాడుకున్నారని...అందువల్ల సాగర్‌లో నీటి మట్టం తగ్గిందని హరీష్‌రావు వెల్లడించారు.