'కృష్ణా డెల్లాకు నీరు విడుదల నిలిపివేత'
హైదరాబాద్ : కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రబీ పంటకు సాగర్ కుడి కాల్వ కింద నీటిని విడుదల చేయలేమని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్రావు స్పష్టం చేశారు.
బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటికే కేటాయించిన దాని కంటే అదనంగా నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుందని తెలిపారు. 44 టీఎంసీల నీటిని అదనంగా వాడుకున్నారని...అందువల్ల సాగర్లో నీటి మట్టం తగ్గిందని హరీష్రావు వెల్లడించారు.