TMC water
-
కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు స్టే
-
వందల టీఎంసీల పంపింగ్‌లో కాళేశ్వరం రికార్డ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదైన బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ఆనతి కాలంలోనే నీటి పంపింగ్‌లో రికార్డ్ సాధించింది. ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి వంద టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తి పోసింది. లింక్-1లోని మేడిగడ్డ లక్ష్మీ దాదాపు 100 టీఎంసీలకు దగ్గరగా ఉండగా, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టీఎంసీల చొప్పున పంపింగ్‌ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడమే కాకుండా ఆనతికాలంలోనే వందల టీఎంసీల నీటిని ఎంఈఐఎల్ పంపింగ్ చేసింది. దశాబ్దాలుగా నీరందని తెలంగాణ పొలాలు ఇప్పుడు పచ్చని పైరును కప్పుకుని కళకళలాడుతున్నాయి. ఎంతో కాలంగా నీటి కోసం ఎదురుచూసిన రైతన్నలు కాళేశ్వరం నీటి రాకతో తమ బీడు భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు. ఇంతటి బహుళార్ధక ఎత్తిపోతల పథకం తెలంగాణ దశనే మార్చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టుదలతో పాటు మేఘా శక్తి సామర్ధ్యాలతో ఇది సాధ్యమైంది. అతి తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కాళేశ్వరంలోని ఏ పంప్ ఎంత నీటిని ఎత్తిపోసిందంటే? భూ ఊపరితలంపైన అతి పెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్‌ను జూలై 6, 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. 522 రోజుల పాటు పని చేసి దాదాపు 100 టీఎంసీల నీటిని పంప్ చేసింది. ఇక కీలకమైన ఈ పంప్ హౌస్‌లో 3వ మిషన్ 1,110 గంటల పాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటల పాటు పనిచేసింది. కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్ ఇదే. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది. లక్ష్మీ పంప్ హౌస్‌ను పార్వతి పంప్ హౌస్‌కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజుల పాటు నీటిని ఎత్తిపోసింది. వంద టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులో మొదటి మిషన్ 1,347 గంటలు పాటు పని చేసింది. అతి తక్కువగా 12వ మిషన్ 195 గంటల పాటు పనిచేసింది. లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం సత్తా చాటింది. ఏకంగా 504 రోజుల పాటు నీటిని పంప్ చేసింది. వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. ఇందులో అత్యధికంగా రెండో మిషన్ 1,076 గంటల నీటిని ఎత్తపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ కేవలం 333 గంటల పాటు పని చేసింది. అతి కీలకంగా ఉన్న గాయత్రి పంప్ హౌస్ లింక్-2లో భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్‌ను ఆగస్టు 11, 2019లో ప్రారంభించిన మేఘా ఆనతికాలంలోనే 100 టీఎంసీలు ఎత్తిపోసింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు తరలించింది. ఈ పంప్ హౌస్‌లో రెండో మిషన్ అత్యధికంగా 1,703 గంటల పాటు నీటిని పంపింగ్ చేయగా, మొదటి మిషన్ 1,367 గంటల పాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని 7 మిషన్లలో ఒక్కొక్క మిషన్ నుంచి 3,150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశాయి. ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీ స్థాయిలో పంపుహౌస్‌లను ఈ పథకంలో ఏర్పాటు చేసింది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్‌ల కింద మొత్తం 104 మెషీన్లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాను మేఘా నిర్మించింది. ఎంఈఐఎల్ కాళేశ్వరంలో భారీ విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం - ట్రాన్స్ మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్‌ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం 5,159 మెగావాట్ల విద్యుత్ అంటే అంతే పంపింగ్ సామర్థ్యం మిషన్లు అవసరం కాగా అందులో ఎంఈఐఎల్ 4,439 మెగావాట్ల విద్యుత్ అంటే అంత సామర్థ్య పంపింగ్‌తో పాటు విద్యుత్ సరఫరా చేసే 6 సబ్ స్టేషన్లు, వాటి లైన్లు నిర్మించింది. సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు, మోటార్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైమ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి. ఇంతవరకూ ప్రపంచంలో ఒక పంపింగ్ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు కావడం ఎక్కడా లేదు. ఒక్క మేడిగడ్డలోనే మొట్ట మొదటిది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపు హౌస్‌లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్--1లోని ఈ మూడు పంపుహౌస్‌ల కిందే 1,720 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపులు, మోటార్లు ఏర్పాటయ్యాయి. అన్నారం సరస్వతిలో 12 పంపింగ్ యూనిట్లు, సుందిళ్ల పార్వతి పంపింగ్ కేంద్రంలో 14 యూనిట్లు ఆనతి కాలంలోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి. అన్నిటికన్నా ప్రధానంగా ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రంలో 7 రోజులకు 2 టీఎంసీలు పంపు చేసేలా 7 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్ వినియోగించేలా పంపిగ్ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతోంది. ఆ తరువాత రంగనాయక సాగర్‌లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌ల నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి. -
రూ.21వేల కోట్ల పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అదనపు టీఎంసీ నీటి ఎత్తిపోతల పనుల్లో కీలక ముందడుగు పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే అదనంగా మరో టీఎంసీ నీటిని తీసుకునేలా పనులు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా ఎల్లంపల్లి దిగువన పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచింది. ఏకంగా రూ.21,458 కోట్లతో ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని తరలించేలా పంప్‌హౌస్‌లు, కాల్వలు, రిజర్వాయర్లకు టెండర్లు పిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు దిగువన ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఇక అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఇప్పటికే పనులు ఆరం భించి పనులు కొనసాగిస్తోంది. ఎల్లంపల్లి దిగువన పనులకు ఎప్పుడో పరిపాలనా అనుమతులు ఇవ్వ డంతో పాటు బ్యాంకు రుణాలకు సైతం ఆమోదం ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం టెండర్లు పిలిచింది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 1.10 టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.9,747.30 కోట్లకు గాను.. ఎల్లంపల్లి నుంచి 1.10 టీఎంసీ నీటిని దేవికొండ రిజర్వాయర్ తరలించేందుకు వీలుగా అవసరమైన అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్, ఫోర్‌బే, వెలగటూరు వద్ద మొదటి పంప్‌హౌస్ నిర్మాణానికి రూ.6,167.31 కోట్లు, దేవికొండ రిజర్వాయర్ నుంచి వరద కాల్వ 95.27వ కిలోమీటర్ వరకు నీటిని తరలించేందుకు రెండో పంప్‌హౌస్, ఇతర నిర్మాణాలకు రూ.3,144.11కోట్లు, ఇక 109వ కిలోమీటర్ వరకు వరద కాల్వ సామర్థ్య పంపునకు వీలుగా 222.59 కోట్లు, 122వ కిలోమీటర్ వరకు వరద కాల్వ పనులకు రూ.213.29 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీ పనులకు ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 18 వరకు టెండర్లు వేసుకునే అవకాశమిచ్చారు. 20న సాంకేతిక బిడ్లు తెరవ నున్నారు. నిజానికి ఈ మొత్తం పనులను 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేలా కసరత్తు చేసినప్పటికీ తిరిగి వాటిని నాలుగు ప్యాకేజీలకు కుదించారు. ఇక మిడ్‌మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించే పనులను సైతం నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.11,710.70 కోట్లు కేటాయించారు. దీనిలో మొదటి ప్యాకేజీని రూ.3,286.77 కోట్లు, 2వ ప్యాకేజీని రూ.6,148.48 కోట్లు, 3వ ప్యాకేజీని రూ.680.90కోట్లు, 4వ ప్యాకేజీని రూ.1,594.55 కోట్లుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. ఈ 4 ప్యాకేజీలకు ఏప్రిల్ 17 వరకు టెండర్లు వేసుకునే అవకాశం కల్పించగా, 18న టెక్నికల్ బిడ్ తెరవనున్నారు. -
సోమశిలలో నీరు దుర్వినియోగం కాలేదు
నెల్లూరు(పొగతోట): సోమశిల ప్రాజెక్ట్‌లో నీరు దుర్వినియోగం కాలేదని కలెక్టర్ జానకి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సోమశిల ప్రాజెక్ట్‌లో 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారని, ఈ విషయమై పత్రికల్లో వార్తలు సైతం ప్రచురితమయ్యాయని వివరించారు. రైతు సంఘాల నాయకులు సేకరించిన సమయంలో నీటి గణాంకాలు పూర్తి స్థాయిలో లేవన్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీరు, విడుదల, వస్తున్న నీటి గణాంకాలను పూర్తిగా పరిశీలించారని చెప్పారు. 26 టీఎంసీల నీరు దుర్వినియోగం కాలేదని, ప్రాజెక్ట్‌లోనే నిల్వ ఉన్నాయని తెలిపారు. గతేడాది డిసెంబర్ 12న ఐఏబీ సమావేశం జరిగిందని, అప్పటికి జిల్లాలో 68.9 టీఎంసీల నీరు నిల్వ ఉందని రైతు సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారన్నారు. ఐఏబీ నాటికి 67.862 టీఎంసీల నీరు నిల్వ ఉందని, గత నెల 20 నాటికి 18 టీఎంసీల నీరు ఇన్‌ఫ్లో ఉందని తెలిపారన్నారు. 3.918 టీఎంసీల నీరు మాత్రమే ఇన్‌ఫ్లో వచ్చిందని, కండలేరు రిజర్వాయర్‌కు 7.348 టీఎంసీల నీటిని విడుదల చేస్తే, మూడు టీఎంసీలనే విడుదల చేశారని నాయకులు తెలిపారన్నారు. ఇలాంటి తేడాల వల్ల 26 టీఎంసీల నీరు దుర్వినియోగమైందని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే సోమశిల ప్రాజెక్ట్‌లో 33 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందన్నారు. నాయకులు చెప్పిన దానికి రికార్డులను పరిశీలిస్తే ఒక టీఎంసీ నీరు మాత్రమే తేడా వస్తోందని, ఇది ఆవిరి, వృథా కిందపోయి ఉంటుందని తెలిపారు. నాయకులు ఫిర్యాదు చేసిన వెంటనే రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు. 4.32 లక్షల ఎకరాలకు 43.7 టీఎంసీల సాగునీటిని విడుదల చేయాలని ఐఏబీలో తీర్మానించి నివేదికలను ప్రభుత్వానికి పంపి అనుమతితో నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. సోమశిల ప్రాజెక్ట్‌లో ఈఈ 3.2 టీఎంసీల నీటిని గణాంకాల్లో తక్కువగా నమోదు చేశారని చెప్పా రు. -
ఏపీకు 10, తెలంగాణకు 20 టీఎంసీలు
-
ఏపీకు 10, తెలంగాణకు 20 టీఎంసీలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు 10, తెలంగాణకు 20 టీఎంసీల నీరు వినియోగించుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కృష్ణానదిలో మొత్తం 30 టీఎంసీల లభ్యత కలిగి ఉండగా అందులో ఏపీకి 10, తెలంగాణకు 20 టీఎంసీల నీరు కేటాయించారు. ప్రస్తుతం కృష్ణా డెల్టా అవసరాల దృష్ట్యా ఏపీకి 10 టీఎంసీల నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో చర్చించారు. శ్రీశైలం డ్యామ్ భద్రతపై కేంద్ర జల మండలికి లేఖ రాయడంతో పాటు డ్యామ్ సేఫ్టీకి చర్యలు తీసుకోవాలని బోర్డు తీర్మానించింది. తదుపరి సమావేశాన్ని విజయవాడలో జరపాలని... ఆ సమావేశంలో ప్రాజెక్టులపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకారం తెలిపారు. -
డెడ్‌స్టోరేజీకి చేరిన సాగర్
మాచర్లటౌన్/ విజయపురిసౌత్ (ప్రకాశం): నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం డెడ్‌స్టోరేజీ అయిన 510 అడుగులకు చేరుకుంది. కేవలం ఒక్క టీఎంసీ నీరు అదనంగా నిల్వ ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. నీటిమట్టం 802.09 అడుగుల వద్ద ఉంది. ఈ నీటిమట్టం 30 టీఎంసీలకు సమానం. వర్షాభావ పరిస్థితులు, కృష్ణా పరివాహక ప్రాంతాలలో నీరు లేకపోవటంతో సాగర్ కాలువలకు మంచినీటిని కూడా విడుదల చేసే పరిస్థితి కనబడటం లేదు. 1992లో 499 అడుగులున్న సమయంలో కూడా సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత 1993లో 511, 1995లో 504 అడుగులున్నప్పుడు నీటిని విడుదల చేశారు. రాష్ట్ర విభజన జరగటం, జల వివాదం నేపథ్యంలో ప్రస్తుత స్థితిలో నీటిని విడుదల చేసే అవకాశాలు కన్పించడం లేదు. -
'కృష్ణా డెల్లాకు నీరు విడుదల నిలిపివేత'
హైదరాబాద్ : కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రబీ పంటకు సాగర్ కుడి కాల్వ కింద నీటిని విడుదల చేయలేమని ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఇప్పటికే కేటాయించిన దాని కంటే అదనంగా నీటిని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుందని తెలిపారు. 44 టీఎంసీల నీటిని అదనంగా వాడుకున్నారని...అందువల్ల సాగర్‌లో నీటి మట్టం తగ్గిందని హరీష్‌రావు వెల్లడించారు. -
సింగరేణికి తాగునీటి గండం.. ?
సింగరేణికి భవిష్యత్‌లో తాగునీటి గండం ఏర్పడేలా ఉంది. గోదావరి నది చెంతనే ఉన్నా కార్మికుల కష్టాలు తప్పేలా లేవు. ఎల్లంపల్లి నుంచి ఒక టీఎంసీ నీరు పొందే వీలున్నా పైప్లైన్ల ఏర్పాటుకయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ప్రత్యామ్నాయంగా కార్మికులకు గనుల్లో ఊట నీటిని తాగించాలని ఆలోచన చేస్తోంది. ఇదే నిజమైతే భవిష్యత్‌లో కోల్‌బెల్ట్ ప్రాంత వాసులు గోదావరినది నీటిని తాగే అదృష్టాన్ని కోల్పోయే అవకాశం ఉంది. గోదావరిఖని : సింగరేణికి రామగుండం రీజియన్ పరిధిలో ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 డివిజన్లు ఉన్నాయి. ఎనిమిది భూగర్భ గనులు, నాలుగు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో సుమారు 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరి కోసం గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీలలో క్వార్టర్లు నిర్మించారు. సింగరేణి కార్మికులు, వారి పిల్లలు కూడా ప్రైవేటుగా నిర్మించుకున్న ఇళ్లల్లో నివసిస్తున్నారు. దాదాపుగా 35 వేల వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీరికి గోదావరినది ఒడ్డున నిర్మించి న పంప్‌హౌస్ ద్వారా తాగునీటిని శుద్ధి చేసి 22 కిలోమీటర్ల దూరం గల సెంటినరీకాలనీ వరకు నీటిని నిత్యం సరఫరా చేస్తున్నారు. చాలా ఏళ్లుగా సరైన వర్షాలు లేక గోదావరినది ఎండిపోతుండడంతో సింగరేణి యాజ మాన్యం నదిలో బోర్లను వేసి నీటి కొరత తీర్చుతోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి వద్ద గోదావరినదిపై ప్రాజెక్టును నిర్మించడంతో నీటి ప్రవాహం ముందుకు సాగే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో దిగువన ఉన్న పట్టణాల నీటి కష్టాలు తీర్చేందేకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు ఒక టీఎంసీ కేటాయించగా, వారు పైప్లైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని పొందుతున్నారు. రామగుండం కార్పొరేషన్‌కు ఒక టీఎంసీ, సింగరేణికి మరో టీఎంసీ కేటాయించారు. తడిసి మోపెడవుతున్న పైప్లైన్ల ఖర్చు.. సింగరేణికి కేటాయించిన ఒక టీఎంసీ నీటిని పొందాలంటే ఎల్లంపల్లి నుంచి పైప్లైన్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 15 కిలోమీటర్ల దూరం గల ఈ పైప్‌లైన్‌కు సుమారు రూ. 200 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసేం దుకు యాజమాన్యం వెనుకంజ వేస్తున్నట్లు సమాచా రం. ఈ క్రమంలో యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వర్షాలు కురిస్తే నదిలో ఎల్లప్పుడూ నీరుంటుందని, ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే నదిలో బోర్లు వేసుకోవచ్చని, అది కూడా సాధ్యం కాకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి ని వదలాలని కోరడంపై ఆలోచన చేస్తోంది. అలాగే గోదావరినది ఒడ్డున ఉన్న మేడిపల్లి ఓసీపీ జీవిత కాలం మరో ఆరేళ్లు మాత్రమే ఉంది. అక్కడ బొగ్గు నిల్వలు వెలికితీసిన తర్వాత ఏర్పడిన గొయ్యిలో వర్షా కాలంలో నదిలో వచ్చే వరద నీటిని నింపాలనే ఆలోచనతో యాజమాన్యం ఉంది. అలాగే జీడీకే 5వ గని, జీడీకే 11వ గనిలో ఊటగా వచ్చే నీటిని శుద్ధి చేసి తాగునీటిగా వాడుకోవచ్చనే దిశగా యాజమాన్యం ఆలోచి స్తోంది. కానీ గనుల్లో నీటిని ఎంత శుద్ధి చేసినా దానిలో పీపీఎం శాతం ఎక్కువగా ఉంటోంది. గతంలో యాజ మాన్యం ఈ నీటిని కార్మిక కాలనీలకు సరఫరా చేసినా వారు తాగకుండా గోదావరినీటిపైనే ఆధారపడ్డారు. ఈ తరుణంలో సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలపై ఆలోచించకుండా ఎల్లంపల్లి నుంచి టీఎంసీ నీటిని పొందేలా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు. -
ప్రమాదం అంచున కనిగిరి రిజర్వాయర్
బుచ్చిరెడ్డిపాళెం(రూరల్), న్యూస్‌లైన్: డెల్టా ప్రాంతంలో అతి ముఖ్యమైన కనిగిరి రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. 2007లో కనిగిరి రిజర్వాయర్ పటిష్టత కోసం నాటి సీఎం వైఎస్సార్ నిధులు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆగిపోయాయి. తిరిగి టెండర్లు నిర్వహించకుం డా అధికారులు పనులు రద్దు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ ప్రధాన కాలువ అయిన సదరన్ చానల్ గేట్ల వద్ద కట్ట మధ్య భాగంలో పగుళ్లు ఇచ్చాయి. అలాగే సదరన్ చానల్ గేట్ల వద్ద కూడా రివిట్మెంట్లు, కాంక్రీట్ దిమ్మెలు దెబ్బతిని శిథిలావస్థకు చేరాయి. 2011లో సదరన్ చానల్ గేట్లు కొట్టుకుపోవడంతో రిజర్వాయర్ నీటి మట్టాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ గేట్లను ఏర్పాటు చేసేందుకు ఖర్చు చేసిన లక్షలాది రూపాయల వృథా కావడంతో పాటు రెండు టీఎంసీల నీళ్లు సముద్రం పాల య్యాయి. కొత్త గేట్ల ఏర్పాటుతోనే తమ పని అయిపోయిందన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆ గేట్ల సమీపంలోనే కాంక్రీట్, రివిట్మెంట్లు దెబ్బతినడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న కాలంలో భారీ వర్షాలు కురిస్తే పైపక్కనున్న కట్ట, గేట్ల వద్ద రివిట్మెంట్ కోతకు గురై ఎక్కడ పెను ప్రమాదం సంభవిస్తోందనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రిజర్వాయర్ కట్ట పై భాగంలో నిర్మించిన గోడలు కూడా కూలి ఉండటం నీటి పారుదల శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కనిగిరి రిజర్వాయర్‌కు ప్రమాదం సంభవించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.