Telangana Map
-
తెలంగాణ మ్యాప్ వచ్చేసింది
రాష్ట్ర విశిష్టతలతో రూపొందించిన సర్వే ఆఫ్ ఇండియా సాక్షి, న్యూఢిల్లీ: సర్వే ఆఫ్ ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్ర పటాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పలు విశేషాలు గల ఈ మ్యాప్‌ను ఆ సంస్థ తన వెబ్సైట్లో పొందుపరచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 12వ అతి పెద్ద రాష్ట్రంగా సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మ్యాప్‌లో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలను, పర్యాటక ప్రాంతాలను, జిల్లాల వారీగా జనాభా వివరాలను... రాష్ట్ర సంస్కృతి, భాషలు, రోడ్డు, రైలు, రవాణా మార్గాలను, వివిధ ప్రాంతాల మధ్య దూరాన్ని పొందుపరిచింది. హైదరాబాద్ మెట్రో మార్గాలను, సరిహద్దు రాష్ట్రాలను ఈ మ్యాప్‌లో సూచించారు. రాష్ట్రంలోని నదులు, పండే పంటలు, ముఖ్యమైన ఆలయాలు, తదితర వివరాలున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పటాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్టు సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. -
లక్ష నాణాలతో తెలంగాణ చిత్రం
మల్యాల : మండలకేంద్రానికి చెందిన పొన్నం శ్రీనివాస్ లక్ష కరెన్సీ బిల్లలతో తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించి అబ్బురపరిచాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనివాస్ పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, పది పైస లు, 20 పైసలు, చారాణ, ఆఠాణ, రూపాయి, రూ. రెండు, రూ.ఐదు, రూ.10 బిల్లలతో రాష్ట్ర చిత్రపటా న్ని రూపొందించాడు. దీనికి సుమారు రూ.50 వేల విలువైన నాణేలు ఉపయోగించాడు. వేకువజాము రెండు గంటల నుంచి ఉదయం ఆరు వరకు పటా న్ని తీర్చిదిద్దినట్లు శ్రీనివాస్ తెలిపారు. గతేడాది ఆగస్టు 15న దేశపటం, తెలంగాణ తల్లి చిత్రపటం రూపొందించారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, తె లుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. సింగపూర్‌లో ఉపాధి నిమిత్తం వెళ్లి షిప్‌యార్డులో పనిచేస్తుండగా వివిధ దేశాలకు చెందిన కరెన్సీ సేకరించడం అలవాటుగా మారిందని శ్రీనివాస్ తెలిపారు. -
పాఠశాలల్లో ‘తెలంగాణ పటం’
ఆర్మూర్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎంఈఓ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ చిత్ర పటాల స్థానంలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటాన్ని వేయించాలని డీఈఓ శ్రీనివాసాచారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 36 ఎంఈఓ కార్యాలయాలతో పాటు 25 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 265 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 1,573 ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర పటాన్ని వేయించాలని ఎంఈఓలకు ఆదేశాలు అందాయి.