తెలంగాణ మ్యాప్ వచ్చేసింది
రాష్ట్ర విశిష్టతలతో రూపొందించిన సర్వే ఆఫ్ ఇండియా
సాక్షి, న్యూఢిల్లీ: సర్వే ఆఫ్ ఇండియా సంస్థ తెలంగాణ రాష్ట్ర పటాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన పలు విశేషాలు గల ఈ మ్యాప్‌ను ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పొందుపరచింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో 12వ అతి పెద్ద రాష్ట్రంగా సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మ్యాప్‌లో తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలను, పర్యాటక ప్రాంతాలను, జిల్లాల వారీగా జనాభా వివరాలను...
రాష్ట్ర సంస్కృతి, భాషలు, రోడ్డు, రైలు, రవాణా మార్గాలను, వివిధ ప్రాంతాల మధ్య దూరాన్ని పొందుపరిచింది. హైదరాబాద్ మెట్రో మార్గాలను, సరిహద్దు రాష్ట్రాలను ఈ మ్యాప్‌లో సూచించారు. రాష్ట్రంలోని నదులు, పండే పంటలు, ముఖ్యమైన ఆలయాలు, తదితర వివరాలున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పటాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్టు సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది.