లక్ష నాణాలతో తెలంగాణ చిత్రం
మల్యాల : మండలకేంద్రానికి చెందిన పొన్నం శ్రీనివాస్ లక్ష కరెన్సీ బిల్లలతో తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించి అబ్బురపరిచాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీనివాస్ పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, పది పైస లు, 20 పైసలు, చారాణ, ఆఠాణ, రూపాయి, రూ. రెండు, రూ.ఐదు, రూ.10 బిల్లలతో రాష్ట్ర చిత్రపటా న్ని రూపొందించాడు.
దీనికి సుమారు రూ.50 వేల విలువైన నాణేలు ఉపయోగించాడు. వేకువజాము రెండు గంటల నుంచి ఉదయం ఆరు వరకు పటా న్ని తీర్చిదిద్దినట్లు శ్రీనివాస్ తెలిపారు. గతేడాది ఆగస్టు 15న దేశపటం, తెలంగాణ తల్లి చిత్రపటం రూపొందించారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, తె లుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. సింగపూర్‌లో ఉపాధి నిమిత్తం వెళ్లి షిప్‌యార్డులో పనిచేస్తుండగా వివిధ దేశాలకు చెందిన కరెన్సీ సేకరించడం అలవాటుగా మారిందని శ్రీనివాస్ తెలిపారు.