Telugu language and culture
-
తెలుగు వారిని తక్కువ చేసినట్లే హిందీతో పోల్చి చూడకూడదు : రాహుల్
వాషింగ్టన్: తెలుగు భాష చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ టెక్సాస్ రాష్ట్రంలో పర్యటించారు. అక్కడ డల్లాస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. లోక్‌సభలో విపక్షనేతగా ఎన్నికయ్యాక భారతీయ సంతతి ప్రజలతో రాహుల్ మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా తెలుగు భాషను ఆయన ప్రస్తావించారు. భాషల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని పరోక్షంగా ఆరోపించారు. భారతీయ భాషలు మాట్లాడే ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు బీజేపీ కారణమవుతోందని విమర్శించారు. ‘‘ ఇప్పుడు మన భారత జాతీయగీతం వినిపిస్తోందని అనుకుందాం. నా వరకైతే గీతం విన్నంత సేపు అన్ని రాష్ట్రాలు సమానం అనే భావన మదిలో నిలిచే ఉంటుంది. ఒక రాష్ట్రం గొప్పదని, మరో రాష్ట్రం వెనుకబడిందని, తక్కువ స్థాయిది అని ఎక్కడా ఉండదు. భారత్ అనేది ఒక దేశం మాత్రమేకాదు. అన్ని రాష్ట్రాల సమాఖ్య. అమెరికాలాగే భారతదేశం కూడా రాష్ట్రాల సమాఖ్య అని గుర్తుంచుకోవాలి. భాషలు, సంప్రదాయాలు కూడా అలాంటివే. ఒక భాష గొప్ప, మరో భాష తక్కువ అనే భావన ఉండకూడదు’’ అని పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. ‘‘ అమెరికా, భారత రాజ్యాంగాల్లో ఒకటి ఉంది. అదేంటంటే ఏ ఒక్క రాష్ట్రమూ గొప్పది కాదు, ఏ ఒక్క రాష్ట్రమూ తక్కువ కాదు. అన్నీ సమానం. ఏ ఒక్క భాషో, ఏ ఒక్క మతమో గొప్పది కాదు’’ అని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తెలుగు భాష ప్రస్తావన తెచ్చారు. ‘‘ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు వాళ్లతో ‘మీరు హిందీ వాళ్ల కంటే తక్కువ’ అని అన్నారనుకోండి. మనం ఆ రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అవుతుంది. తెలుగు అనేది కేవలం భాష మాత్రమే కాదు. అది ఓ చరిత్ర. సంప్రదాయం, సంగీతం, నృత్యాలు, భిన్న ఆహార అలవాట్లను తనలో ఇముడ్చుకుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందీతో పోల్చి తక్కువ చేసి మాట్లాడితే తెలుగు చరిత్ర, అక్కడి సంప్రదాయం, సంస్కృతి, వారి పూరీ్వకులను మీరు తక్కువ చేసి మాట్లాడినట్లే’’ అని రాహుల్ అన్నారు. -
ప్రవాస తెలుగు పురస్కారాలు.. ఎంట్రీలకు ఆహ్వానం
సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ మరియు వీధి అరుగు ఆధ్వర్యంలో 2021 ఆగష్టు 𝟐𝟖, 𝟐𝟗లలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విదేశాలలో నివసిస్తూ తెలుగు భాషా , సాహిత్యం, సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన తెలుగు వారికి ప్రవాస తెలుగు పురస్కారాలు-2021 అందిస్తున్నారు. తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమములో ముఖ్య అతిధులచే ఈ పురస్కారాన్ని అందిస్తారు. తెలుగు భాషాభివృద్ధికి మీరు చేసిన వివరాలను ఈ కింది లింకు ద్వారా లేక ఈ-మెయిల్ ద్వారా పంపాలని సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ , వీధి అరుగులు కోరాయి. https://tinyurl.com/pravasa , pravasatelugupuraskaralu2021@gmail.com -
తెలుగు భాషా సంస్కృతులు కాపాడండి!
2004 నుండీ తెలుగునేల నలుమూలలా భాషోద్యమం విస్తరించేందుకు నాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డిగారి సానుకూల స్పందన గొప్పది. ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభృతులతో అప్పటికప్పుడు ఒక సాధన సమితిని ఏర్పాటుచేసి, ఆనాటి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తెలుగు భాషకు ప్రాచీనతా హోదా సాధించి ఇచ్చారాయన. భాషోద్యమ స్ఫూర్తిని తరువాతి ప్రభుత్వాలు అందుకోలేక పోవడంవల్ల తెలుగు భాషాసంస్కృతులకు తీరని అన్యాయం జరిగింది. ఆధునిక సాంకేతిక ఉపకరణాలను ఇంగ్లిష్తో సమానంగా ఉపయోగించే విధంగా తెలుగును ‘ప్రపంచ తెలుగు’ గా తీర్చిదిద్దే కార్యాచరణ వైఎస్సార్ కాలంలోనే ప్రారంభమైంది. తెలుగు భాషపట్ల రాజశేఖరరెడ్డిగారు చూపించిన మమకారం చిరస్మరణీయం. ‘సాంకేతిక తెలుగు’, ‘ప్రపంచ తెలుగు’ అనేవి భాషోద్యమ చిరకాల స్వప్నాలు. భాషోద్యమ ప్రముఖులు గట్టి ఒత్తిడి తేవటంతో 2016లో నాటి ప్రభుత్వం తెలుగు భాషాపరిరక్షణకు సూచనలు చేసేందుకు ఒక కమిటీని నియమించింది. భాషకు అవమానం చేసేవారిని శిక్షించే అధికారాలతో తెలుగు ప్రాధికార సంస్థను ఏర్పాటుచేయవలసిందిగా ఆ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే 7 అకాడమీల పునర్నిర్మాణాన్ని కూడా ఈ కమిటీ ప్రతిపాదించింది. మూడేళ్ల కాలంలో ఈ కమిటీ సూచనలు ఆచరణకు నోచుకోలేకపోయాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, గ్రంథాలయ సంస్థ, తెలుగు అభిలేఖ భాండాగారం (ఆర్కయివ్స్), ప్రాచ్యలిఖిత భాండాగారం లాంటి సంస్థ లను, వాటి ఆస్తులను, వాటి సంపదను ఆంధ్రప్రదేశ్ తన వాటాగా తెచ్చుకోలేకపోవటం వలన అవి ఎవరికో పుట్టిన బిడ్దలుగా నిరాదరణ పాలయ్యాయి. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాల విషయంలో ఆంధ్రప్రదే శ్‌కు చెందినవారికి అన్యాయం జరుగుతుంటే ఊరక చూస్తూనే ఐదేళ్లూ గడిచిపోయాయి. భాషాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలన్నీ ‘తెలుగు ప్రాధికార సంస్థ’ అధీనంలో వివిధ విభాగాలుగా ఒకే గొడుగు కింద ఏర్పరిస్తే, పరస్పర సమన్వయంతో పని చేయటం సాధ్యం అవుతుంది. అధికార భాషగా తెలుగు అమలు, తెలుగు అకాడ మీని భాషాభివృద్ధి విభాగంగా ప్రాధికార సంస్థ పరిధిలోకి తెచ్చి తెలుగు పాఠ్యాంశాల నిర్ణయంలో కీలక పాత్ర వహించేలా చూడటం, ‘ఇ–తెలుగు’ సాంకేతిక విభాగం, తమిళ వర్చువల్ అకాడమీ పద్ధతిలోనే ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగువారికి తెలుగు నేర్పించి, ప్రాథమిక, మాధ్యమిక పద్ధతిలో సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించే విభాగం, తెలుగులోంచి ఇతర భాషల్లోకి, ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనువాద విభాగం, ప్రచురణల విభాగం, గ్రంథాలయ వ్యవస్థలను కూడా ఈ ప్రాధికార సంస్థ పరిధిలోకి తీసుకురావాలనే సూచనలను గత ప్రభుత్వం మౌలికంగా ఆమోదించింది. వాటిని ఆచరణలోకి తేవలసిందిగా ప్రార్థన. తెలుగు భాషోద్యమం ప్రా«థమిక విద్యను తప్పనిసరిగా విద్యార్థుల మాతృభాషలోనే బోధించాలని, పై చదువుల కొచ్చేసరికి, తెలుగు నేలమీద నడుస్తోన్న ప్రతీ విద్యాలయంలోనూ, హైస్కూలు స్థాయి నుండీ ఉన్నత స్థాయి వరకూ, ఇంజనీరింగ్, మెడిసిన్లతో సహా అన్ని కోర్సులలోనూ తెలుగును ఒక బోధనాంశం చేయాలని తెలుగు భాషా పరిరక్షణ కమిటీవారు సూచించారు. ఇది యునెస్కో వారు సూచిస్తున్న ప్రమాణం. ప్రభుత్వాలు, విద్యాలయాలు కూడా దీనికి బద్ధులు కావాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్సైట్లను తెలుగులోకి అనువదించే పని చేపట్టాలి. వాటిలోని సమాచారం మొత్తాన్ని తెలు గులో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయాలి. అంతర్జాలంలో తెలుగు వ్రాయటానికి, చదవటానికి, చూడటానికి తగిన రీతిలో బ్రౌజర్లు తయారు కావాలి. ప్రాంతాలకతీతంగా తెలుగు ప్రజలందరూ మాట్లాడే ప్రతీ మాటనీ, దాని ఆంగ్లార్థం, ప్రయోగాలతో సహా ఒక మహానిఘంటువు(లెక్సికాన్)ని రూపొందించటం, దానిని డిజి టలైజేషన్ చేయటం తక్షణ అవసరం. 1985 నుండీ అకాడమీల పునరుద్ధరణకోసం చేసిన పోరాటాల ఫలితంగా పుట్టిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, సంగీత నాట్య అకాడమీ, గ్రామీణ కళల అకాడమీ, సైన్సు అకాడమీలు పుడు తూనే అనాథలయ్యాయి. ఒక్క నాటక అకాడమీ తప్ప తక్కిన అకాడమీలకు కార్యవర్గాలను ఏర్పరచిన మర్నాడే ఎన్నికల కోడ్ రావడంతో వాటి కాళ్లూ చేతులు కట్టేసి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టయ్యింది. భాషా సంస్కృతులకు సేవచేసినవారే చరితార్థులై నిలిచారు. తెలుగులోనే పాలించండి తెలుగు వెలుగై జీవించండి! తెలుగుతల్లిని మనం కాపాడితే తెలుగుతల్లి మనల్ని కాపాడుతుంది. -వ్యాసకర్త : డా. జి. వి. పూర్ణచందు, ప్రముఖ వైద్యులు, సాహితీవేత్త మొబైల్ : 94401 72642 -
తెలంగాణ సాధించుకున్నది భాషతోనే..
వరంగల్ రూరల్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే భాషతో అని ప్రజాకవి, ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లా యంత్రాం గం సోమవారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో సన్నాహక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముక్య అతిథిగా హాజరైన గోరేటి వెంకన్న మాట్లాడుతూ ప్రకృతి నేర్పిన పాఠాలే శాశ్వతమని, ఆధునిక పేరుతో జరుగుతున్న కాలుష్యం భావిజీవితానికి గొడ్డలి పెట్టని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పక్షి లక్షణాలు, దాని జీవనంపై తనదైన శైలిలో పాటతో ఉర్రూతలూగించాడు. సీఎం కేసీఆర్‌కు భాషపై ఉన్న అభిరుచే ఈ కార్యక్రమాల నిర్వహణకు కారణమని అన్నారు. సామాజిక ఉత్పత్తిని కాదని మార్కెట్ కల్చర్ ఆధిపత్యం చెలాయించడం వల్లే వృత్తులు ధ్వంసమయ్యాయన్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ భాషపై ప్రేమను పెంచుకోవాలని, ప్రపంచంలో చైనా, జపాన్ దేశాలు ఎంతో ముందు ఉన్నప్పటికీ ఆ దేశాల అధ్యక్షులు మాతృభాషలోనే మాట్లాడతారని గుర్తు చేశారు. సాహిత్యం సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తుందని, కాలానికి అనుగుణంగా సాహిత్యం రావాలని ఆకాంక్షిచారు. ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ మన తెలుగు అజంతా భాష అని, ఎంతో అందంగా ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు మాట్లాడుతూ మాతృభాషపై పట్టు ఉంటే ఇతర భాషలు సులువుగా వస్తాయని చెప్పారు. కవి పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన తెలుగు మహాసభలకు, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహాసభలకు ఎంతో తేడా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, వరంగల్ ఎంపీ దయాకర్, జేసీ ముండ్రాతి హరిత, డీఆర్ఓ హరిసింగ్, డీపీఆర్ఓ కిరణ్మయి, డీఎఫ్ఓ పురుషోత్తం, డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి, డీఈఓ నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బన్నా అయిలయ్య, ముడుంబై వరదాచార్యులు పాల్గొన్నారు. అంతకు ముందు కాళోజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. -
కావేరీ తీరంలో తెలుగు కళా తోరణం
కొద్దికాలం క్రితం వరకు మేళా కుటుంబాల వారికి ప్రదర్శనలే వృత్తి. ఇప్పుడు కొందరు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఏటా మేలత్తూరు వచ్చి ప్రదర్శనలలో పాల్గొని, ఆ కళ పట్ల తమ నిబద్ధతని చాటుకుంటున్నారు. తెలుగు భాష, సంస్కృతి, కళారూపాలు నిరంతరం ప్రభవించాలని ఆశించేవారూ, అవి ధ్వంసమైపోతున్నాయని కేవలం ఇక్కడ వీరావేశం ప్రదర్శించే వారూ కూడా కావేరీ తీరంలో ఉజ్జ్వలంగా వెలుగుతున్న ఆ దీప తోరణాన్ని ఒక్కసారి దర్శించడం మంచిది. లేదా ఆ వెలుగుల గురించి తెలుసుకున్నా మేలే. నాలుగు శతాబ్దాలుగా ఆ దీపతోరణం నిశ్చలంగా వెలుగుతోంది. తంజావూరు సమీపంలో తిరువయ్యూరు దగ్గర మేల త్తూరులో ఏటా మే మాసంలోనే వారం రోజులు నరసింహ జయంతి పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ తిరువయ్యూరు దగ్గరే త్యాగరాజ స్వామి సమాధి ఉంది. నరసింహ జయంతికి ఆ ఊళ్లో నృత్య నాటకాలు గొప్పగా ప్రదర్శిస్తారు. అవన్నీ తెలుగు నాటకాలే. ఈ విషయం తెలిసిన వారు తెలుగునాట ఎందరున్నారో గానీ, అక్కడ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. మేల త్తూరు భాగవత మేళా నాట్య విద్యా సంఘం(మే 10 -18), భాగవత నాట్య నాటక సంఘం (మే 24-31) కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నాయి. రెండో సంస్థ 74 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నది. తమిళనాట ఉన్న మేలత్తూరు తెలుగు పల్లెను తలపిస్తుంది. ఆ గ్రామంలో వేంచేసి ఉన్న నరసింహస్వామి ప్రీత్యర్థం ఈ కళారూపాలను ప్రదర్శిస్తారు. ఆరు నెలల క్రితం ఈ గ్రామం వెళ్లి భాగవత మేళా నాటక బృందాల పెద్దలు కె. కుమార్, మహాలింగం గార్లను కలుసుకున్నపుడు కొన్ని విషయాలు తెలిశాయి. నరసింహస్వామి కోవెలలో పూజలు చేసి నాటక బృందాలు ప్రదర్శనలు ప్రారంభించడం సంప్రదాయం. నృసింహ జయంతికి మొదలయ్యే ఈ నాటకోత్సవాలకు ‘ప్రహ్లాద చరిత్ర’తోనే శ్రీకారం చుడతారు. ఏటా డిసెంబర్లో చెన్నైలో జరిగే సంగీత నృత్యోత్సవాలలో కొన్ని భాగవత మేళా ప్రదర్శనలు కూడా ఉంటాయి. అప్పుడే కె. నటరాజన్, కె. కుమార్ ప్రదర్శించిన ‘సతీ సావి త్రి’ చూడడం తటస్థించింది. రంగస్థలం మీద ఎడమ వైపున భాగవతులు మృదంగం, వేణువు వంటి వాయిద్యాల సహకారంతో ఇతివృత్తాన్ని గానం చేస్తుంటారు. మధ్య మధ్య ప్ర యోక్త దృశ్యాలనీ, పాటనీ అనుసంధానం చేస్తూ ఉంటాడు. గణేశ స్తుతి, హారతి, అరటిపళ్ల నైవేద్యాల తరువాత కథ ఆరంభమవుతుంది. బ్రాహ్మణులూ, అందులోనూ పురుషులు మాత్రమే ప్రదర్శించే ఈ నాటకాలు పన్నెండని చెబుతారు. అవి- ప్రహ్లాద చరిత్రతో పాటు రుక్మిణీ కల్యాణం, మార్కండేయ చరిత్ర, ఉషాపరిణయం, హరిశ్చంద్ర, సీతా కల్యాణం, పార్వతీ కల్యాణం, కంసవధ, హరిహర లీలావిలాసం, ధ్రువ చరిత్ర- వాటిని మేలత్తూరు వెంకటరామ శాస్త్రి రాశారు. మేలత్తూరుకు చెందిన కుమార్, మహాలింగం కుటుం బాలు తాము తెలుగువారమనే చెబుతాయి. కానీ మాట్లాడేది తమిళమే. తెలుగు చదవడం, రాయడం రాకున్నా ఈ తెలుగు నాటకాలను భట్టీయం వేసి ప్రదర్శిస్తారు. త్యాగరాజ స్వామి సంగీత సంప్రదాయంలోనే ఉన్నప్పటికీ, ఉచ్చారణ మీద తమిళ ప్రభావం గణనీయంగా గమనిస్తాం. మొదట వీటిని దైవ సన్నిధిలోనే ప్రదర్శించేవారు.ఇటీవలికాలంలో వీధిలో రంగస్థలం, విద్యుద్దీపాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుతున్న ఆధారాల ప్రకారం 14వ శతాబ్దంలో నరసింహస్వామి సన్నిధిలో ఒక ప్రదర్శన జరిగింది. 1510లో షోలింగాపురం(షోలింగర్) నరసింహస్వామి ఆలయంలో ఒక నృత్య నాటకం ప్రదర్శించారు. విజయనగర పాలకుడు అచ్యుతరాయల దేవేరి తిరుమలదేవి శ్రీరంగం వచ్చినపుడు ఒక ప్రదర్శన ఇవ్వవలసిందని కోరిందట. అచ్యుతప్పనాయకుడు (1561-1614) తన ఏలుబడిలో 510 బ్రాహ్మణ కుటుంబాలకు ఒక గ్రామాన్ని దానం చేసి, ఈ కళకు చేయూతనిచ్చాడు. తరువాత శాలియ మంగళం, నల్లూరు, ఊత్తుకారు, శూలమంగళం, తెప్పరహతనల్లూరు అనే గ్రామాలను కూడా దానం చేశాడు. వీటన్నిటినీ కలిపి అచ్యుతాబ్ది అం టారు. 1855 తరువాత ఈ ప్రాభవం కొంత సన్నగిల్లింది. కొంతకాలానికి భారతం నటేశ అయ్యర్, గణేశ అయ్యర్ వంటి వారి కృషితో మళ్లీ ప్రదర్శనలు మొదలయినాయి. కొద్దికాలం క్రితం వరకు మేళా కుటుంబాల వారికి ప్రదర్శనలే వృత్తి. ఇప్పుడు కొందరు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఏటా మేలత్తూరు వచ్చి ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. ఇప్పటికీ ఈ కుటుంబాలే ఈ కళకు ఆలంబన. కేంద్రం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, కొన్ని ప్రైవేటు సంస్థలు చేయూతనిస్తున్నాయి. ఆ కళాకాంతులను చూసైనా ఆనందిద్దాం! వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక