telugu leaders
-
జైపాల్‌రెడ్డి పేరునూ పక్కన పెట్టిన రాహుల్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది! ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఒక్క నేతకు కూడా చోటు కల్పించకపోవడం విస్మయానికి గురిచేసింది. రెండు రాష్ట్రాల్లో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేరు మొన్నటివరకూ సీడబ్ల్యూసీ కోటాలో వినిపించినప్పటికీ ఆయన పేరును కూడా రాహుల్‌గాంధీ పక్కన పెట్టేయడం గమనార్హం. దీంతో రెండు రాష్ట్రాల్లోని సీనియర్ నేతలు అధిష్టానంపై ఒకింత కినుక వహించారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు కొందరు ఈ విషయంపై ఢిల్లీ పెద్దల వద్దకు రాయబారాలు పంపారని, కనీసం ఒక్కరికయినా అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. 51 మందిలో ఒక్కరు లేరు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదం మేరకు మంగళవారం ప్రకటించిన సీడబ్ల్యూసీలో దేశవ్యాప్తంగా మొత్తం 51 మంది నేతలకు అవకాశం కల్పించారు. 28 మందిని సీడబ్ల్యూసీ సభ్యులుగా, 18 మందిని శాశ్వత ఆహ్వానితులుగా, 10 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఇందులో దక్షిణాదికి చెందిన వారు ఐదుగురే ఉన్నారు. కేవలం కేరళ, కర్ణాటక రాష్ట్రాల నేతలకు అవకాశమిచ్చిన అధిష్టానం తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలకు మొండిచేయి చూపింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియాను శాశ్వత ఆహ్వానితుల జాబితాలో, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేర్చారు. కానీ ఆ ఇద్దరికీ తెలంగాణ కోటాలో స్థానం లభించలేదు. కుంతియాను ఒడిశా కోటాలో నియమించగా, సంజీవరెడ్డికి ఐఎన్టీయూసీ అధ్యక్ష హోదాలో అవకాశం కల్పించారు. తమిళనాడు, తెలంగాణలో పార్టీ చాలా బలహీనంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు అయినా సీడబ్ల్యూసీలో స్థానం దక్కుతుందని టీపీసీసీ నేతలు భావించారు. కానీ అధిష్టానం మాత్రం అవకాశం కల్పించకపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నేతలకు అవకాశం కల్పించినట్టయితే పార్టీకి కొంత ఊపు వచ్చి ఉండేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో పరిచయాలున్న పీసీసీ నాయకుడొకరు దీనిపై మాట్లాడుతూ.. ‘‘అసలు తెలుగు రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీలోకి తీసుకునే స్థాయి ఉన్న వారు లేరన్న అభిప్రాయంతోనే ఇలా జరిగి ఉంటుంది. జైపాల్ ఉన్నా ఆయన అనుభవాన్ని మరో విధంగా ఉపయోగించుకునే యోచనలో అధిష్టానం ఉంది. అందుకే ఆయన పేరును చేర్చలేదు’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పులు లేనట్టేనా? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులుంటాయన్న చర్చ జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల్లో ఒకరిని మారుస్తారని, మేనిఫెస్టో, కో–ఆర్డినేషన్, ప్రచార కమిటీలను నియమిస్తారని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం ఉంది. పలువురి పేర్లతో లీకేజీలు సైతం వచ్చాయి. కానీ ఈ కమిటీల ప్రస్తావన, మార్పుచేర్పులను ప్రస్తుతానికి ఏఐసీసీ పక్కన పెట్టిందని సమాచారం. జైపాల్‌రెడ్డికి సీడబ్ల్యూసీలో అవకాశం రాకపోతే రాష్ట్రా నికి చెందిన మరో సీనియర్ నేత జానారెడ్డిని తీసుకోవాలనే చర్చ అధిష్టానం వద్ద జరిగిందని తెలుస్తోంది. ఆయన్ను సీడబ్ల్యూసీలోకి తీసుకు ని, సీఎల్పీ నేతగా ఇంకొకరిని నియమించాలని అధిష్టానం భావించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సీఎల్పీ నేతగా ఆయన్నే కొనసాగించాలన్న నిర్ణయం జరిగిందని సమాచారం. ఇక ఇప్పట్లో పార్టీ సంస్థాగత మార్పులు ఉండే అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. -
కన్నడ ప్రచార బరిలో తెలుగు నేతలు
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు తెలుగు రాష్ట్రాల నేతలను బరిలో దింపాయి. పెద్దసంఖ్యలో తెలుగు ఓటర్లున్న ప్రాంతాల్లో ఏపీ, తెలంగాణ నేతలు ఆయా పార్టీల తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మే 12న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టేందుకు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి కర్ణాటకలోని పలు తెలుగు అసోసియేషన్ల సభ్యులతో సమావేశమయ్యారు. రఘువీరాతో పాటు ఏపీలోని పలు సీనియర్ కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ కన్నడ ప్రచార బరిలో నిలిపింది. మాజీ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు, మాజీ ఎంపీ మధు యాష్కీ ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలుగు వారు అధికంగా ఉండే బళ్లారి, రాయ్‌చూర్, కొప్పాల, దావణగెరే, తుంకూర్, కోలార్, చిక్‌బళ్లాపూర్, బెంగళూర్ సిటీ, బెంగళూర్ రూరల్ ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వాలు తెలుగు రాష్ట్రాల నేతలతో ప్రచారం చేపట్టాయి. ఇక మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు, ఇతర సీనియర్ నేతలతో కలిసి బీజేపీ తరపున ప్రచారం చేపట్టారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు లభించడంతో జేడీఎస్ కూడా తెలుగు ఓటర్ల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ సీట్లలో దాదాపు 40 స్ధానాల్లో ఫలితాలను తెలుగు ప్రజలు నిర్ధేశించనున్నారు. -
కూతలు... కేకలు... పరుగులు
అక్షర తూణీరం ఎవరో ఒకాయన, ‘‘రుతుపవనాలు వెనక్కి తిరిగాయంటే రాష్ట్రంలో నీతినియ మాలు లేకనే. మా హయాంలో పవనాలు పిలిస్తే పలికేవి. వద్దంటే వానలు... ధర్మం నాలుగున్నర పాదాల మీద నడిచేది’’ అంటూ ఆవేశపడుతున్నాడు. ఏడాది నుంచి పరిస్థితి అయోమయంగా ఉంది. సగం దేహం వేడినీళ్ల లోనూ, సగం చన్నీళ్లలోనూ ఉన్నట్టుంది. తల హైదరా బాద్‌లో, కాళ్లు అమరా వతిలో ఉండిపోయాయి. అటు ఢిల్లీ నేతలు, ఇటు తెలుగునేతలు శరవేగంగా జరిగిపోతున్న అభివృద్ధి గురించి మాట్లాడేస్తున్నారు. ఈ మధ్య, ఓ పెద్ద రైల్వేస్టేషన్లో దిక్కుతోచక నిలబడిపోయినట్టు అని పిస్తోంది. కూతలు... కేకలు... పొగలు... పరుగులు. దూరంగా ఎత్తు మీద ఆగిపోయిన పెద్ద గడియారం. సందడిలో సందడిగా పలు భాషల్లో ఏవో అనౌన్స్మెంట్లు. ప్లాట్‌ఫాం చివర రైల్‌రోకో జరుగుతోంది. ఎందుకంటే- కేంద్ర రాష్ట్ర ఉద్యో గులు లంచాలడిగితే ఫలానా నంబర్ని సంప్రతిం చండని సెల్ఫోన్లో ప్రభుత్వం ప్రచారం చేస్తోం దట. ఆఫీసులలో కోసీట్లకి ఎదురుగా సీసీ కెమె రాలు బిగించారట. ఆఫీసు క్యాంటీన్లలో కూడా నిఘా పెట్టారట. ఇది హేయం, అమానుషం. సాటి మనిషిని అనుమానించడం, అవమానించడం కాదా! ఇది మానవహక్కుల ఉల్లంఘనే ముమ్మా టికీ. ‘‘నశించాలి! ప్రభుత్వ ఏకపక్ష ధోరణి నశించాలి!’’ నినాదాలు స్టేషనంతా ప్రతిధ్వనిస్తు న్నాయి. ప్లాట్‌ఫాం బ్రిడ్జి మెట్ల మీద ఒక బృందం బైఠాయించింది. వాళ్లెవరండీ అంటే బోస్టన్ టీ పార్టీ అన్నారు. ఒక్కసారిగా అందరూ కొత్త కండువాల కోసం ఎగబడే సరికి, రేటు గణనీయంగా పడి పోయిందిట. గిట్టుబాటు ధరకోసం ఆందోళన సాగిస్తున్నారు. మధ్యలో దండతో ఉన్నాయన ఆమ రణ దీక్షలో ఉన్నారు. వార్తా మాథ్యమాల మనుషులు మైకులతో కనిపించారు. ఇప్పుడు స్టేషన్లో మాటువేసి, పెద్ద మనుషుల స్పందనలను రికార్డ్ చేస్తున్నారు. ఎవరో ఒకాయన, ‘‘రుతు పవనాలు వెనక్కి తిరిగా యంటే రాష్ట్రంలో నీతినియమాలు లేకనే. మా హయాంలో పవనాలు పిలిస్తే పలికేవి. వద్దంటే వానలు... ధర్మం నాలుగున్నర పాదాల మీద నడిచేది’’ అంటూ ఆవేశపడుతున్నాడు. ఇంతలో ఒకాయన నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అరిచాడు. దేనిని, దేనికి అన్నారెవరో. సందర్భం వచ్చినప్పుడు చెబుతా. ఇప్పటికైతే ఖండిస్తున్నా. ‘‘నేనా, నేనొక కవిని. జనకవిని. రైలే నా ఆదర్శం. రైలే నా జెండా. పట్టాల మీద గాడి తప్పకుండా వెళ్లే ఒక మహాశక్తి. అలజడులకు, ఉద్యమాలకు ఆహుతి అవుతుంది. అగ్నిపునీత అవుతుంది. అక్షరాల్ని భుజాన వేసుకు తిరుగు తున్న వాణ్ణి. నా దగ్గర మట్టివాసన వేస్తుంది’’ ఔను. వేస్తోంది. రేపట్నించి రైళ్లలో సమస్త కూరలు అమ్మే ఏర్పాటు చేస్తాం. వంటలు చేసుకునే స్త్రీపురుష ప్రయాణికులకు వెసులుబాటు ఉంటుంది. భారతీయ రేల్ తర్కారీ! అసలు లాంగ్ జర్నీ రైళ్లలో ఓ బోగీలో సమస్త సరుకులు పేర్చి అమ్ముతాం. రైల్వే నానావిధాలుగా లాభాలు ఆర్జిస్తుంది. ఓ పక్క ఆగకుండా అయిడియాలు అయిపోతున్నాయి. దాంతో ముఖ్యమంత్రికి పూనకం వచ్చేసింది. అమ రావతి రైల్వే స్టేషన్‌ని ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చేస్తాం. ఇక్కడ విమానాలు కూడా దిగు తాయి. అవసరమైతే ఓడలు కూడా వస్తాయి. డ్వాక్రా గ్రూపులతో షాపింగ్ కాంప్లెక్స్‌లు నడిపిస్తాం. జై తెలుగుతల్లి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
తెలుగు తమ్ముళ్ల ఆత్మఘోష
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు.. అధికారంలోకి ఎప్పుడు వస్తామా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఎన్నికలు రానే వచ్చాయి. తర్వాత సైకిల్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది 'తముళ్ల'లో ఆనందం తాండవమాడింది. అయితే ఈ ఆనందం క్రమక్రమంగా ఆవిరైపోతుంది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారిని వదిలి ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు అధినాయకుడు పెద్దపీట వేయడం 'పాతతరం' నేతలకు మింగుడు పడటం లేదు. దాంతో తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో, పార్టీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి తారుమారైంది. ప్రస్తుతం టీడీపీలోనే కాదు జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన హవా దాదాపుగా తగ్గిపోయింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో అదే జిల్లాకు చెందిన మంత్రి పి. నారాయణ అన్నీ తానై వ్యవహరిస్తుండడంతో సోమిరెడ్డి వెనుకబడిపోయారు. ఎమ్మెల్యేగా నెగ్గకపోయినా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అంతేకాదు రాజధాని ఎంపికపై ప్రభుత్వం నియమించిన కమిటీకి ఆయనను అధ్యక్షుడిని చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లాకే చెందిన కాంగ్రెస్ నేతలు, మాజీ మంత్రులు ఆనం సోదరులు నేడే రేపో పచ్చ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆనం సోదరులు కూడా పార్టీలో చేరితే తన పరిస్థితి ఎలా వుంటుందోనని సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నారు. అటు అధినేత ఆదరణ కూడా కరువవడంతో సోమిరెడ్డి హడలిపోతున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో తన పరిస్థితిని సోమిరెడ్డి... చంద్రబాబు ముందు ఏకరువు పెట్టినా ఆయనకు ఊరట లభించలేదు(ట). జిల్లాలో మొత్తం 10 స్థానాల్లో కేవలం మూడు స్థానాల్లోనే పచ్చ జెండా రెపరెపలాడిందంటూ బాబు... సోమిరెడ్డికి క్లాస్ తీసుకున్నారని సమాచారం. దాంతో సోమిరెడ్డి మరింత డీలా పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్వేపల్లి శాసనసభ నుంచి పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో సోమిరెడ్డి ఓటమిపాలైన ఆయనకు పార్టీలలోనూ ఊరట దక్కడం లేదు. పలు జిల్లాల్లో సీనియర్ నాయకుల 'ఆత్మఘోష' ఇలాగే ఉందన్న గుసగుసలు విన్పిస్తున్నాయి.