Telugu paper
-
త్వరలో ‘పునాస’ త్రైమాసిక పత్రిక: నందిని సిధారెడ్డి
సాక్షి, యాదాద్రి: తెలంగాణ సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ప్రభుత్వ సహకారంతో ‘పునాస’త్రైమాసిక తెలుగు పత్రిక రాబోతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి వెల్లడించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరిలో జరిగిన సాహిత్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాహిత్యాన్ని ఇతర భాషల్లో అనువదించే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. హిందీ, ఇంగ్లిష్, దక్షిణ భారత భాషల్లో తెలుగు సాహిత్యాన్ని తీసుకురావడానికి కార్యాచరణ ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రపంచ తెలంగాణ మహాసభల సందర్భంగా శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల వరకు ఉన్న సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చామన్నారు. కాకతీయుల కాలం నుంచి నిజాం ప్రభువుల వరకు ఉన్న సాహిత్యం ముద్రణ ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. నిజాం కాలం నుంచి ఆధునిక కవుల వరకు ఉన్న సాహిత్యంపై పుస్తకాలను తీసుకువస్తామని తెలిపారు. ప్రపంచ మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్యం విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ తెలంగాణ మహాసభల్లో 1,500 మంది కవులు తమ కవితలను వినిపించారని, కవితా శైలి, నిర్మాణం, వంటి విషయాల్లో నైపుణ్యాన్ని పెంచడానికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
వాట్సాప్‌లో టెన్త్ ప్రశ్నపత్రాలు?
► పరీక్ష ప్రారంభమైన తర్వాతే తతంగం ► ఇన్విజిలేటర్లే కీలకం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రం ఇచ్చిన మరుక్షణమే సదరు ప్రశ్నపత్రాలు వాట్సాప్ ద్వారా బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన తెలుగు పేపర్-1,2 ప్రశ్న పత్రాలను ఇన్విజిలేటర్లే సెల్ఫోన్ల ద్వారా చిత్రీకరించి వాట్సాప్ ద్వారా బయటకు పంపినట్లు సమాచారం. పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు వాడవద్దంటూ జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. జిల్లాకు సంబంధించి 235 కేంద్రాల్లో 52,546 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మార్చి 21, 22 తేదీల్లో తెలుగు పేపర్-1,2 పరీక్షలు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రం నుంచే బయటకు వచ్చినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు పసిగట్టారు. ఇందులో సెల్ఫోన్ల ద్వారా ఇన్విజిలేటర్లు కీలకంగా వ్యవహరించినట్లు తెలుసుకుని పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్ల వాడకాన్ని నిషేధించారు. ఈ మేరకు బుధవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డితో మాట్లాడగా పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, విద్యార్థులు సెల్ఫోన్లు వాడడంపై నిషేధం ఉందని తెలిపారు. కొందరు అధికారులు పరీక్ష మొదలైన తరువాత ప్రశ్న పత్రాన్ని బయటకు పంపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. -
పదో తరగతి తెలుగు పశ్నాపత్రం లీక్?
కూనవరం (తూర్పు గోదావరి జిల్లా) : కూనవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పరీక్ష కేంద్రం-ఎలో సోమవారం పదవ తరగతి తెలుగు పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా ప్రశ్నాపత్రం 10.23 గంటలకు వాట్సప్ లో హల్చల్ చేసింది. ప్రశ్నలు తెలిసిపోవడంతో పరీక్షా కేంద్రం బయట ఉన్న కొందరు సంబంధించిన జవాబులను పుస్తకాల నుంచి సేకరించబోయారు. ఇంతలో విలేకరులు అక్కడకు చేరుకోగా కంగారుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ హడావుడిలో ఓ వ్యక్తి వదిలి వెళ్లిన సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ప్రశ్నాప్రత్రం వాట్సప్ ద్వారా వెల్లడైన వైనం బయటపడింది. ఈ విషయం చానళ్లలో ప్రసారం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ ఇన్చార్జి డీఈఓ టీవీఎస్‌జీ కుమార్ మధ్యాహ్నం 3 గంటల అనంతరం పరీక్షా కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీకవడంపై డిపార్ట్మెంటల్ ఆఫీసర్ బాబూరావు, సిట్టింగ్ స్క్వాడ్ సీతారాములు, ఇన్విజిలేటర్లను విచారించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నాపత్రం వాట్సప్ ద్వారా వెల్లడైన విషయమై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నామని, నివేదికను కలెక్టర్‌కు అందచేస్తామని తెలిపారు. -
విద్యార్థులకు బీఆర్‌ఏయూ షాక్
పొందూరు, న్యూస్‌లైన్: ప్రశ్న పత్రాల లీకులతో విమర్శలు ఎదుర్కొంటున్న డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు డిగ్రీ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ప్రశ్న పత్రంలో ఓ ప్రశ్న ముద్రించకపోవడంతో విద్యార్థు లు దానికి మార్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వివరాలు ఇవీ... శుక్రవారం డిగ్రీ రెండో సంవత్సరం(బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఎం) విద్యార్థులకు జనరల్ తెలుగు పేపర్ పరీక్ష జరిగింది. ప్రశ్న పత్రం చూసి అవాక్కవడం విద్యార్థుల వంతైంది. కారణమేమిటంటే... ప్రశ్న పత్రం రెండవ పుటలో ఐదవ ప్రశ్నలో నాలుగు ప్రశ్నలిచ్చి ఒకదానికి వ్యాసం(జవా బు) రాయవలసి ఉంది. అయితే ఇందులో మూడు ప్రశ్నలే ఇచ్చారు. రోమన్ నంబర్ 1, 3, 4ల్లో ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. రెండో ప్రశ్న స్థానంలో కేవలం అంకె వేసి వదిలేశారు. ఈ ప్రశ్నకు ఎనిమిది మార్కులు కేటాయించా రు. దీంతో తాము చేయని తప్పునకు అనవసరంగా ఎనిమిది మార్కులు కోల్పోవలసి వచ్చిందని పలువురు విద్యార్థులు ‘న్యూసలైన్’కు తెలిపారు. తమకు జరిపిన అన్యాయాన్ని యూనివర్సిటీ ఉపకులపతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ప్రశ్నపత్రం కోడ్ నంబర్ ట్చట002. ఈప్రశ్నపత్రం మొత్తం 70 మార్కులకు కేటాయించారు. -
తెలుగుకు బదులు సంస్కృతం!
కందుకూరు/తుంగతుర్తి, న్యూస్‌లైన్: ఇంటర్మీడియె ట్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమన్న అధికారులు.. వారే రెండుచోట్ల బుధవారం మొదటిరోజు పరీక్ష ఆలస్యం కావడానికి కారణమయ్యూరు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో గంటన్నర, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష నిర్వహించారు. వివరాలిలా ఉన్నారుు. కందుకూరులోని విద్యామయి జూనియర్ కళాశాల, కందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఇంటర్ పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలు రెండురోజుల క్రితమే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సబ్జెక్టుల వారీగా సరఫరా అయ్యాయి. బుధవారం ఉదయం కందుకూరు చౌరస్తాలోని విద్యామయి జూనియర్ కళాశాల సిబ్బంది పోలీస్‌స్టేషన్ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రశ్నాపత్రాలు తెచ్చారు. 9 గంటలకు పరీక్ష కావడంతో 8.45కు పార్శిల్ తెరిచి చూశారు. తెలుగు ప్రశ్నపత్రాలు కావలసి ఉండగా సంస్కృతం పేపర్లు దర్శనమిచ్చాయి. దీంతో కంగుతిన్న సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు హైదరాబాద్ నుంచి కారులో తెలుగు ప్రశ్నపత్రాలు తీసుకుని ఉదయం 10.25 గంటల సమయంలో పరీక్షా కేంద్రానికి వచ్చారు. దీంతో 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష.. గంటన్నర ఆలస్యంగా 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ విషయమై పరీక్షా కేంద్రం నిర్వాహకులు మాట్లాడుతూ.. తమకు సరఫరా చేసిన సెట్ పైన ‘102 కోడ్ న్యూ సిలబస్ తెలుగు’ అని ఉందని, కానీ లోపల సంస్కృతం పేపర్లు ఉన్నాయని తెలిపారు. మరోవైపు తుంగతుర్తిలోని మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రానికి అధికారులు ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు ప్రశ్నపత్రాలకు బదులు సంస్కృతం పేపర్లు పంపారు. ఉదయం సమయం కాగానే విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి నిర్వాహకులు బండిల్ ఓపెన్ చేయగా తెలుగుకు బదులు సంస్కృతం ప్రశ్నపత్రాలు కనిపించాయి. వారు విషయం ఆర్ఐవో ప్రకాశ్బాబుకు చెప్పారు. ఆయన హుటాహుటిన సూర్యాపేట, తిరుమలగిరి కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తెలుగు పేపర్లు తెప్పించి విద్యార్థులకు అందజేశారు. దీంతో ఈ కేంద్రంలో విద్యార్థులు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పరీక్ష రాశారు.