సమస్యను అమెరికా దృష్టికి తీసుకెళ్లాం
తెలుగు విద్యార్థులను అమెరికా నుంచి తిప్పి పంపడం, ఎయిరిండియా అధికారులు అనుమతించకపోవడం లాంటి సమస్యలను అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ సమస్యపై పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన రావు వెళ్లి సుష్మా స్వరాజ్‌ను కలిశారు. అప్పుడు ఆమె ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ఆమె ప్రస్తావించారు.
ఇక ఈ అంశంపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. మన పిల్లలు అక్కడ చదువుకోడానికి వెళ్లారని, వారికి సౌకర్యాలు ఉండాలని ఆయన అన్నారు. పిల్లలను అనుమతించబోమని అమెరికా అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. (అయితే, లిఖితపూర్వక సమాచారమా అని, ఎవరిచ్చారని అడిగినప్పుడు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు) వెళ్లిన కొంతమంది పిల్లలను ఇప్పటికే తిప్పి పంపేశారని, విద్యార్థులను అనుమతించాలా లేదా అన్నది అక్కడి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుందని అశోక్ గజపతి రాజు చెప్పారు.