tendars
-
ఈ నెలలోనే పోలవరం జలవిద్యుత్ కేంద్రం టెండర్లు
విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టే జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు ఈ నెలలోనే టెండర్లు పిలవనున్నట్లు ఏపీ జెన్కో (హైడల్) డైరెక్టర్ సీహెచ్. నాగేశ్వరరావు తెలిపారు. తొలి దశలో ఒక్కొక్కటి 80 మెగావాట్లు చొప్పున మూడు యూనిట్లను నిర్మిస్తామని, మూడున్నరేళ్లలో ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండో దశలో మరో తొమ్మిది యూనిట్లను 18 నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం మీద ఐదేళ్లనాటికి 12 యూనిట్ల ద్వారా 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏటా 2,300 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా రూ.230 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. Tenders for Polavaram power station in january -
దేవుడు సొమ్మును దోచుకుంటారా?
- 'సత్రం’ భూముల టెండర్లు రద్దు చేయాలి - తమిళనాడు తెలుగు బ్రాహ్మణ మహాసభ నిలదీత చెన్నై: అమరావతి సదావర్తి సత్రానికి చెందిన దేవుడి సొమ్మును అప్పనంగా బొక్కేసేలా నిర్వహించిన టెండర్లపై తమిళనాడులో అగ్రహం పెల్లుకుబుతోంది. ఈ టెండర్లను వెంటనే రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ‘అమరవాతి సదావర్తి సత్రంలో వెయ్యికోట్ల లూటీ’ పేరుతో ఈనెల 28వ తేదీన సాక్షిలో వచ్చిన కథనం చదివిన తమిళనాడులోని తెలుగువారు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 28న తూతూ మంత్రంగా టెండర్ల స్వీకరణ, వేలంపాట నిర్వహించి మమ అనిపించారు. 70 ఏళ్ల క్రితం దాత ఇచ్చిన 471 ఎకరాల్లో కేవలం 83.11 ఎకరాలను మాత్రమే గుర్తించడం సాధ్యమైందని నమ్మబలికిన ఏపీ ఎండోమెంటువారు ముందుగానే నిర్ణయించుకున్న వ్యక్తులకు నామమాత్రపు ధరకు అప్పగించారు. టెండర్ల స్వీకరణ, వేలం పాట వ్యవహారమంతా ఒక డ్రామాలా సాగిందని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మొత్తం నలుగురు వ్యక్తులు వేలం పాటలో పాల్గొనగా, ఇద్దరు చెల్లించిన ధరావత్తు సొమ్మును పాట గెలుచుకున్న మూడో వ్యక్తి పేరున అధికారులు జమ చేసుకోవడమే వేలం ముసుగులో సాగిన లూటీకి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. పైగా పాట ముగిసిన తరువాత 50 శాతం సొమ్మును అక్కడికక్కడే చెల్లించాలనే నిబంధనను తుంగలో తొక్కి రూ.11 కోట్లకు గానూ రూ.30 లక్షలతో సరిపెట్టుకున్నారని ఆయన చెప్పారు. చెన్నై నగరంలోని బడా బడా రియల్టర్లు, బిల్డర్ల దృష్టికి వెళ్లకుండా వేలం పాటలను గోప్యంగా నిర్వహించడంలోనే ఏపీ ప్రభుత్వ అవినీతి బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నై శివార్లలోని సత్రం భూములు ఖాళీగా దర్శనమిస్తున్నా వాటిని గుర్తించడం సాధ్యం కాలేదని ఏపీ అధికారులు చెప్పడం విచిత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతపెద్ద కుంభకోణం కేవలం కిందిస్థాయిలో జరిగే వ్యవహారం కాదని, ఏపీ ప్రభుత్వంలోని అగ్రజుల అండదండలతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. గత వేలం పాటలను రద్దుచేసి మరింత పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని తమిళనాడుకు చెందిన తెలుగు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. -
మేం తలచుకుంటే ఏ టెండరూ వెయ్యలేవు!
హైదరాబాద్: ఏపీలో 104 వాహనాల టెండర్లలో తీవ్ర అక్రమాలు జరిగాయని, బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీ నుంచి భారీగా ముడుపులు పొంది మళ్లీ దానికే ఇచ్చారని ఎల్2 వచ్చిన కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన కోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘నీ పిటిషన్ ఉపసంహరించుకో. లేదంటే నీ అంతు చూస్తాం. మేము తల్చుకుంటే ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో నువ్వు ఏ టెండరూ వెయ్యలేవు. ప్రభుత్వంతో చెడ్డ పడద్దు. ప్రభుత్వంతో మంచిగా ఉంటే మరో టెండరైనా నీకు వచ్చేలా చేస్తాం’ అంటూ ఫోన్లో పిటిషనర్‌ను బెదిరించారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే పిటిషనర్ ఈ బెదిరింపులకు భయపడకుండా ‘మీరు బెదిరించిన విషయాన్ని కూడా కోర్టుకు చెబుతా’ అనడంతో వారు వెనక్కు తగ్గారని సమాచారం. కాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. తన పేరు పెట్టిన పథకాన్ని ఇలా చేస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.