మేం తలచుకుంటే ఏ టెండరూ వెయ్యలేవు!
హైదరాబాద్: ఏపీలో 104 వాహనాల టెండర్లలో తీవ్ర అక్రమాలు జరిగాయని, బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీ నుంచి భారీగా ముడుపులు పొంది మళ్లీ దానికే ఇచ్చారని ఎల్2 వచ్చిన కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన కోర్టు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘నీ పిటిషన్ ఉపసంహరించుకో. లేదంటే నీ అంతు చూస్తాం. మేము తల్చుకుంటే ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో నువ్వు ఏ టెండరూ వెయ్యలేవు.
ప్రభుత్వంతో చెడ్డ పడద్దు. ప్రభుత్వంతో మంచిగా ఉంటే మరో టెండరైనా నీకు వచ్చేలా చేస్తాం’ అంటూ ఫోన్‌లో పిటిషనర్‌ను బెదిరించారని విశ్వసనీయంగా తెలిసింది. అయితే పిటిషనర్ ఈ బెదిరింపులకు భయపడకుండా ‘మీరు బెదిరించిన విషయాన్ని కూడా కోర్టుకు చెబుతా’ అనడంతో వారు వెనక్కు తగ్గారని సమాచారం. కాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. తన పేరు పెట్టిన పథకాన్ని ఇలా చేస్తారా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.