Terrorism state policy
-
పాక్ నిషేధిత జాబితాలో సయీద్ సంస్థలు
ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఆంక్షల్ని తప్పించుకునే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక చట్టాల్లో సవరణలు చేసింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్–ఉద్–దవా, ఫలాహ్–ఐ–ఇన్సానియత్ ఫౌండేషన్‌తో పాటు పలు సంస్థల్ని ఉగ్రవాద జాబితాలో చేర్చుతూ పాక్ అధ్యక్షుడు ఆర్డినెన్స్ జారీ చేశారు. ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్ర సంస్థలూ ఇందులో ఉన్నాయి. ఉగ్రవాదానికి పాక్ అనుకూలమన్న ముద్రను చెరిపేసుకునే ప్రయత్నంలో భాగంగా పారిస్‌లో ఫిబ్రవరి 18 నుంచి జరగనున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మనీ ల్యాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని ఎఫ్ఏటీఎఫ్ నియంత్రిస్తోంది. ఉగ్రవాదులకు అండగా ఉన్న పాక్‌ను ‘ఎఫ్ఏటీఎఫ్’ గ్రే జాబితాలో చేర్చేందుకు అమెరికా, భారత్‌ల ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ జారీచేశారు. గతంలో 2012 నుంచి మూడేళ్ల పాటు పాక్ ‘ఎఫ్ఏటీఎఫ్’ గ్రే జాబితాలో కొనసాగింది. -
టెర్రరిజాన్ని దేశ విధానంగా వాడుతున్నారు..
న్యూఢిల్లీః టెర్రరిజాన్ని వ్యతిరేకించడంలో ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు టెర్రరిజాన్ని తమ దేశ విధానంగా ఉపయోగించుకుంటున్నాయని, అటువంటి దేశాలను ఒంటరిని చేయాలని సూచించారు. రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసిసి) సమావేశానికి హాజరైన రాజ్ నాథ్ అక్కడి ప్రసంగంలో ప్రత్యేకించి దేశం పేరు చెప్పకపోయినప్పటికీ పాకిస్థాన్ ను ఉద్దేశించి విమర్శించారు. ఆలోచనల్లోనూ, సమస్యలతోనూ కొన్ని దేశాలతో విభేదాలు ఉండొచ్చని, అయితే వాటి పరిష్కారానికి తుపాకీలను ఎక్కు పెట్టడమే పరిష్కారం కాదని ఆయన ఉద్ఘాటించారు. టెర్రరిజాన్ని కూకటి వేళ్ళతో పెకలివేయాలన్న రాజ్ నాథ్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోందని అన్నారు.