టెట్ హాల్‌టికెట్లు 2 రోజులు వాయిదా
23వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌కు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ రెండు రోజులు వాయిదా పడింది. బుధవారం సాయంత్రం వరకు దాదాపు 8 వేల మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ నిరవధిక బంద్ నేపథ్యంలో టెట్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియను రెండు రోజులు వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సూచించడంతో టెట్ విభాగం వాయిదా వేసింది. ఈనెల 23 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.