thamma reddy bharadwaj
-
నటించడం ఇష్టంలేక భారీ రెమ్యునరేషన్ అడిగా.. ఇచ్చేశారు: తమ్మారెడ్డి
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీ ఇటు తెలుగు, అటు తమిళ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తున్నారు. షెరాజ్ మెహదీ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ముందుకు ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి రాబోతున్నారు. ఈ చిత్రంలో షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో ‘ఓ అందాల రాక్షసి’ చిత్రం రాబోతోంది. మార్చ్ 21న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోతమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ .. 'భాష్య శ్రీ ఈ కథను నా వద్దకు తీసుకువచ్చారు. ఈ సినిమాను కచ్చితంగా చేయాలని చెప్పారు. వీళ్ళని ఎలాగైనా వదిలించుకోవాలని పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ చెప్పాను. అంత వీళ్ళు ఎలాగో ఇవ్వరు నన్ను వదిలేస్తారని అనుకున్నాను. కానీ నేను అడిగినంత డబ్బు ఇచ్చారు. నేను మళ్ళీ అడగకముందే డబ్బులు ఇచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్లో ఇంత మొత్తం చూసింది ఇదే మొదటిసారి. ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా కథ చాలా బాగుంది. నాకు స్క్రిప్ట్ కూడా చాలా నచ్చింది. ఇలాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి. భాష్యశ్రీ కథ, షెరాజ్ టేకింగ్ బావుంది. మార్చ్ 21న రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. 'చిన్న చిత్రాల్లో నటించి మాలాంటి వాళ్లకు సపోర్ట్ ఇచ్చిన తమ్మారెడ్డి గారికి థాంక్స్. సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. నేను ఇప్పటివరకు ఆ క్రమశిక్షణతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ఇకపై కూడా అలానే చేస్తూ ఉంటాను. ఓ అందాల రాక్షసి సినిమా థియేటర్లోకి రానంతవరకే చిన్న సినిమా. ఒకసారి మా సినిమా థియేటర్ లోకి వచ్చాక దాని రేంజ్ ఏంటో ఆడియన్స్ కి తెలుస్తుంది. టీమ్ అంతా కలిసి ఒక ఫ్యామిలీలా ఈ సినిమాను పూర్తి చేశాం. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. మా చిత్రం మార్చి 21న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి' అని అన్నారు.భాష్య శ్రీ మాట్లాడుతూ .. 'మాలాంటి చిన్న సినిమాలో మంచి పాత్రను పోషించి, మాకు అండగా నిలిచిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్. కథ చెప్పిన వెంటనే తమ్మారెడ్డి బ్రదర్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకు నిర్మాతకు థాంక్స్. ఇప్పుడు అందరూ ఈ సినిమాను చిన్న సినిమా అనుకుంటారు. కానీ దీని సత్తా ఏంటో రిలీజ్ అయ్యాకే మీ అందరికీ తెలుస్తుంది' అని అన్నారు.నేహా దేశ్ పాండే మాట్లాడుతూ .. 'అమ్మాయిలు తమపై జరిగే మోసాలు దాడులను ఎలా ఎదుర్కోవాలి అనేది ఇందులో చక్కగా చూపించారు. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శక,నిర్మాతలకు థాంక్స్. మా చిత్రం మార్చ్ 21న రాబోతుంది అందరూ చూసి ఆదరించండి' అని అన్నారు. -
‘‘పలాస 1978’ అందరూ మాట్లాడుకునే చిత్రం’
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’.. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘డైరెక్టర్ కరుణ కుమార్ పలాస కథ చెప్పినప్పుడు బాగుందని హీరోకు నేను రిఫర్ చేశాను, మా భూమి తరువాత ఆ స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది. నిర్మాత ప్రసాద్ ధైర్యంగా ఈ సినిమాను స్టార్ట్ చేశారు, సినిమా షూటింగ్ సమయంలో వచ్చిన అన్ని కష్టాలను అధికమించి పూర్తి చేసాం. ఒక మంచి సినిమాకు నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. (చదవండి : ఆసక్తికరంగా ‘పలాస 1978’ ట్రైలర్) 'పలాస 1978' కు సమర్పకుడిగా ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను గతంలో 40 సినిమాలు చేశాను, అందులో పలాస సినిమా ప్రేత్యేకం. డైరెక్టర్ పట్టుదలతో, ఫ్యాషన్ తో సినిమా తీశాం. ఈ సినిమాలో ఎక్కడా నాకు పొరపాట్లు కనిపించలేదు. డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్లు తీసాడు. అల్లు అరవింద్, మారుతి, బన్నీ వాసు సినిమాను చూసి మెచ్చుకున్నారు. అరవింద్ తన సంస్థలో కరుణ కుమార్ కు అవకాశం ఇస్తానని చెప్పడం గొప్ప విషయం. సురేష్ బాబు మూవీ చూసి నచ్చి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు అందుకు ఆయనకు ప్రేత్యేక ధన్యవాదాలు. అంబేద్కర్, గాంధీ గారి ఆశయాలు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు పాటించడం లేదు కానీ వారి బొమ్మలు పెట్టి పూజిస్తున్నారు, డబ్బు ఉన్నవారు, లేని వారు ఎలా ఉన్నారు ? వంటి విషయాలు ఈ సినిమాలో కరుణ కుమార్ కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగింది. సినిమాలో ఎక్కడా అశ్లీలత ఎక్కడా ఉండదు అన్నారు. నిర్మాత వర ప్రసాద్ అట్లూరి మాట్లాడుతూ సినిమా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని బయటికి వచ్చింది, అన్ని విషయాల్లో తమ్మారెడ్డి భరద్వాజ్ మమ్మల్ని వెనకుండి నడిపించారు. కొత్త ఆర్టిస్ట్స్ లతో సినిమా చేయడం నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఒక గ్రామంలో జరిగిన యదార్ధ కథను ఈ సినిమాలో చూపించాం. జీవితంలో ఓడిపోయిన వారిగురించి చెప్పే కథాంశం ఇది. భాద పడిన వ్యక్తులు, నలిగిపోయిన జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను పలాసలో బలంగా చూపించడం జరిగింది. నిర్మాత గా నాకు పూర్తి సంతృప్తి నిచ్చిన చిత్రం పలాస 1978. పది మంది మాట్లాడుకునే చిత్రం అవుతుందని నమ్ముతున్నాను’ నిర్మాత ప్రసాద్ తెలిపారు. రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. -
ఆమె గుర్తుకొచ్చింది
‘‘ఈ సినిమా పోస్టర్ విడుదల చేస్తుంటే నాకు 25 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తోంది. నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన చిత్రం ‘ఆమె’. చరితచిత్ర బ్యానర్ ద్వారా నేను హీరో అయ్యాను. ఆ బ్యానర్లో యాక్టివ్‌గా సినిమాలు చేయమని తమ్మారెడ్డిగారికి చాలా సార్లు చెప్పాను. వైవిధ్యమైన చిత్రం ‘ఆమె’తో ఆయన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీకాంత్. అమలాపాల్ లీడ్ రోల్లో రత్నకుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం‘ఆడై’. ఈ చిత్రాన్ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘ఆమె’ పేరుతో ఈ నెల 19న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పోస్టర్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. భరద్వాజ మాట్లాడుతూ– ‘‘1979లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకొచ్చిన 40 ఏళ్లలో ఎన్నో సినిమాలు చేశాం. కానీ అమలాపాల్ ‘ఆమె’ చూసి షాక్ అయ్యాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్యాషన్ ఉండాలి. అమలాపాల్ నటన చూసి షాకయ్యాను. ఈ జనరేషన్లో ఇంత గొప్పగా నటించిన వాళ్లు లేరు. ఈ సినిమా చేస్తున్నందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. ‘‘హీరోయిన్లు కూడా కంటెంట్లను నమ్మి సినిమాలు చేస్తున్నారు. సమంత, అమలాపాల్, నయనతార, అనుష్క వంటివారందరూ ఆదర్శంగా నిలుస్తున్నారు’’ అన్నారు డైరెక్టర్ నందినీరెడ్డి. ‘‘మా సినిమాని ఓ సెన్సార్ బోర్డు సభ్యురాలు మెచ్చుకున్నారు. అంత సెన్సిబుల్ సెన్సార్ బోర్డు మన దగ్గర ఉన్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు రత్నకుమార్. ‘‘నేను నగ్నంగా నటించిన సన్నివేశంలో నగ్నత్వం కన్నా, నీ కళ్లలో ఎక్కువ బాధ కనిపించింది’’ అని అనురాగ్ కశ్యప్‌గారు చెప్పిన మాటలను మర్చిపోలేను’’ అని అమలాపాల్ అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: రాంబాబు కల్లూరి, విజయ్ మోరవెనేని, సహ నిర్మాత: ఒ. ఫణీంద్ర కుమార్. -
చూడలేని ప్రేమ
సంచారి విజయ్ కుమార్, మేఘా శ్రీ జంటగా ఎస్ఏఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణ తులసి’. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీ ఉషోదయ క్రియేషన్స్ సహకారంతో యం. నారాయణ స్వామి, నాగలక్ష్మిలు తెలుగులో ‘తులసి కృష్ణ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పాటల సీడీని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, మొదటి సీడీని డైరెక్టర్ సాగర్‌కి అందజేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘లవ్ అట్ ఫస్ట్ సైట్ అనుకునే ఈ రోజుల్లో అంధుడైన హీరో, అందమైన యువతి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుందో డైరెక్టర్ అద్భుతంగా చూపించాడు’’ అన్నారు. ‘‘కనులతో ప్రేమించే ప్రేమకన్నా మనసుతో ప్రేమించే ప్రేమ గొప్పది’’ అన్నారు డైరెక్టర్ సాగర్. ‘‘కథా బలమున్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కన్నడలో కంటే తెలుగులో గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని ఎస్ఏఆర్ అన్నారు. ‘‘మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని ‘తులసి కృష్ణ’ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత డాక్టర్ మహేంద్ర. నిర్మాతలు సాయివెంకట్, మోహన్‌గౌడ్ మాట్లాడారు. -
సినిమా వాళ్ల మీదకొస్తే చూస్తూ ఊరుకోం..!
‘తెలంగాణలో కోటిన్నరమంది. సెటిలర్స్ ఉన్నారు. వాళ్లకు గనుక కోపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. తెలంగాణ వాదులు అక్కడి దాకా తెచ్చుకోవద్దు’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ హెచ్చరించారు. ఇటీవలే విడుదలైన ‘హృదయ కాలేయం’ చిత్రం దర్శకుడు స్టీవెన్ శంకర్, హీరో సంపూర్ణేష్‌బాబులపై కొందరు తెలంగాణ వాదుల దాడిని ఖండిస్తూ ఆయన ఈ రకంగా స్పందించారు. ‘‘తెలంగాణ వ్యక్తిని హీరోగా పెట్టి వ్యంగ్యంతో కూడిన కామెడీ సినిమా తీస్తావా? అని స్టీవెన్ శంకర్‌ని కొట్టడం సబబైన పని కాదు. తెలంగాణ వాడైన సంపూర్ణేష్‌బాబుకి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటప్పుడు దర్శకుడు స్టీవెన్‌శంకర్‌ని అభినందించాలి కానీ... కొట్టడం ఎంతవరకు సమంజసం. మరోసారి సినిమావాళ్ల మీదకొస్తే... చూస్తూ ఊరుకోం. అన్ని రాజకీయ పార్టీలూ ఈ దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే... భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని భయం వేస్తోంది. సినిమాలకు ప్రాంతాలతో సంబంధం లేదు. అన్ని ప్రాంతాలూ సినిమాకు సమానమే. తెలుగువారందరూ అన్నదమ్ముల్లా సామరస్యంగా ఉండాలనేది మా అభిమతం’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. -
ఎమ్మెల్యే కూతురితో ప్రేమ
‘‘శాసన సభ్యుడికి అనుచరుడిగా పని చేసే వ్యక్తి... ఆ ఎమ్మెల్యే కూతురినే ప్రేమిస్తే ఏమౌతుంది? ఈ నేపథ్యంలో సాగే కథ ఇది’’ అని దర్శకుడు తలారి నాగరాజు చెప్పారు. అజయ్, రిషి, రూబి పరిహార్, శ్రీ ఔరా కాంబినేషన్లో జె.వి. రెడ్డి నిర్మిస్తోన్న ‘ప్రేమలో ఎబిసి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని చంద్రబోస్‌కు అందించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ -‘‘నేను ఇప్పటి వరకూ చూసిన సంగీత దర్శకుల్లో హైలీ ఎనర్జిటిక్ సంగీత దర్శకుడు ఎలేందర్ బెగైళ్ల’’ అని అభినందించారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు మాట్లాడారు. -
రేడియో మిర్చి శ్రోతలతో చార్మీ