ఎమ్మెల్యే కూతురితో ప్రేమ | Premalo ABC Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కూతురితో ప్రేమ

Apr 7 2014 11:18 PM | Updated on Sep 2 2017 5:42 AM

ఎమ్మెల్యే కూతురితో ప్రేమ

ఎమ్మెల్యే కూతురితో ప్రేమ

శాసన సభ్యుడికి అనుచరుడిగా పని చేసే వ్యక్తి... ఆ ఎమ్మెల్యే కూతురినే ప్రేమిస్తే ఏమౌతుంది? ఈ నేపథ్యంలో సాగే కథ ఇది’’ అని దర్శకుడు తలారి నాగరాజు చెప్పారు.

‘‘శాసన సభ్యుడికి అనుచరుడిగా పని చేసే వ్యక్తి... ఆ ఎమ్మెల్యే కూతురినే  ప్రేమిస్తే ఏమౌతుంది? ఈ నేపథ్యంలో సాగే కథ ఇది’’ అని దర్శకుడు తలారి నాగరాజు చెప్పారు. అజయ్, రిషి, రూబి పరిహార్, శ్రీ ఔరా కాంబినేషన్‌లో జె.వి. రెడ్డి నిర్మిస్తోన్న ‘ప్రేమలో ఎబిసి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని చంద్రబోస్‌కు అందించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ -‘‘నేను ఇప్పటి వరకూ చూసిన సంగీత దర్శకుల్లో హైలీ ఎనర్జిటిక్ సంగీత దర్శకుడు ఎలేందర్ బెగైళ్ల’’ అని అభినందించారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement