thief at night
-
వయనాడ్‌లో కొత్త ట్విస్ట్.. వారికి బాధితుల ఇండ్లే టార్గెట్
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్యలో 357కు చేరింది. మరో 200 మంది బాధితులు కనిపించడం లేదు. మరోవైపు.. వయనాడ్ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారు. బాధితుల వదిలేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు.వివరాల ప్రకారం.. వయనాడ్ ప్రాంతంలో బాధితులు కొంత మంది తమ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వారి ఇళ్లలో సామాగ్రి, కొన్ని విలువైన వస్తువులు అక్కడే ఉండిపోయాయి. ఈ క్రమంలో వారి నివాసాలను దొంగలు టార్గెట్ చేశారు. రాత్రి సమయంలో దొంగలు అక్కడికి చేరుకుని వారి నివాసాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. కాగా, తాజాగా కొందరు బాధితులు వారి ఇళ్లకు వెళ్లి చూడగా సామాగ్రి లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలని బాధిత ప్రజలు అధికారులను కోరారు. BREAKING NEWS Wayanad landslide survivors say abandoned homes are being looted. pic.twitter.com/3jR9p3bJCk— Bharat Spectrum (@BharatSpectrum) August 3, 2024 ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..‘కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన సమయంలో మా భద్రత కోసం మేము మా ఇళ్లను విడిచిపెట్టాము. కానీ ఆ తర్వాత మా ఇంటికి వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసేందుకు ఇక్కడికి వచ్చాం. మేము తిరిగి వచ్చినప్పుడు, తలుపులు పగలగొట్టి తెరిచి ఉండడాన్ని చూసి ఆందోళనకు గురయ్యాం. మా ఇళ్లలోని సామాగ్రిని ఎత్తుకెళ్లారు. విలువైన వస్తువులను కూడా దొంగతనం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం మేము ఉంటున్న రిసార్టులోకి గదిని కూడా దొంగలు టార్గెట్ చేశారు. మా దుస్తులను, డబ్బులను దోచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక, బాధితుల ఫిర్యాదుతో చూరల్మల, ముండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గస్తీ చేపట్టారు. పోలీసుల అనుమతి లేకుండా రాత్రి వేళల్లో విపత్తు ప్రాంతాల్లోకి లేదా బాధితుల ఇళ్లలోకి ప్రవేశించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసుల అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గానీ, మరేదైనా ప్రభావిత ప్రాంతాల్లోకి లేదా ఇళ్లలోకి ప్రవేశించడానికి ఎవరినీ అనుమతించరు అని పోలీసు శాఖ పేర్కొంది. -
అసలు నువ్వు పోలీసువేనా..? నాకెందుకో డౌటు..!
ఆదిలాబాద్: పోలీసు డ్రెస్ వేసుకుని దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు ఓ కేటుగాడు. మండలంలోని కొండుకూర్ గ్రామంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో ఆదివారం అర్ధరాత్రి సెల్‌ఫోన్ దొంగతనం చేసి, పక్కనే ఉన్న దాబాలో కౌంటర్ వద్దకు వెళ్లాడు. డబ్బుల కోసం వెతుకుతుండగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వ్యక్తి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన ఎల్సని రాజు అని గుర్తించారు. ఇరిగేషన్ శాఖలో లస్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఇతను కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో కరీంనగర్లో స్వామిజీ వేషధారణలో సెల్‌ఫోన్ చోరీ చేసి, నేనే చేశానని రైల్వే పోలీసులకు లొంగిపోయాడని వివరించారు. కేసు నమోదు చేసుకుని రాజును రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. ఇవి చదవండి: హోలీ పండుగ మిగిల్చిన విషాదం! -
వామ్మో..! చెడ్డీ గ్యాంగ్..! జర జాగ్రత్త..!!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల ముఠా సంచారం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చెడ్డీ గ్యాంగ్‌ను తలపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న జయశంకర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. కొందరు కాలనీవాసులు బయటకు వచ్చి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు. అనుమానంతో ఉదయాన్నే ఇండ్లలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో కాలనీలోని శివాలయం, చుట్టూ పక్కల గల్లీలలో ఏడుగురు సభ్యులు గల ఓ దొంగల ముఠా సంచరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, రూరల్ పోలీసులు కాలనీవాసులతో మాట్లాడారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, ఆయా కాలనీల్లో గస్తీ దళాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాట్సప్ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జయశంకర్ కాలనీకి సమీపంలోని ఓం శాంతి మందిర ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అదే సమయంలో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని దేవయ్య ఇటీవలే కుటుంబంతో కలిసి ముంబాయికి వెళ్లాడు. దొంగలు తాళం పగులగొట్టి ఇళ్లంతా చిందరవందర చేశారు. ఇంటిని పోలీసులు పరిశీలించారు. కుటుంబం ఇక్కడ లేకపోవడంతో ఎలాంటి వస్తువులు చోరీకి గురియ్యాయో తెలియరాలేదు. ఈ చోరీకి పాల్పడింది కూడా చెడ్డీ గ్యాంగే అని భావిస్తున్నారు. జయశంకర్‌కాలనీ ప్రాంతంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల లేవు. ఉన్న కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ఏవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
పగలు పూజారి.. రాత్రి పూట చోరీ
పగటి పూట ఆయన పక్కా ఆధ్యాత్మికంగా కనిపిస్తాడు. పెళ్లిళ్లు చేస్తాడు, పెళ్లి సంబంధాలు చూసే పేరయ్యగా వ్యవహరిస్తాడు, అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. రాత్రిళ్లు మాత్రం ఒక్కసారిగా చేతులు దురద పుడతాయి. అంతే, ముసుగు ధరిస్తాడు.. చేతివాటం చూపిస్తాడు. ఇదేదో సినిమా కథలా ఉందనుకుంటున్నారా? కాదు.. మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన అజయ్ మధుకర్ గైక్వాడ్ నిజజీవిత గాధ. ఇప్పటివరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 25 దోపిడీలు చేసినందుకు అతడిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. గైక్వాడ్ బుద్ధవిహార్ ప్రాంతంలో కేర్‌టేకర్‌గా ఉంటూ మంచి జీవితం గడిపేవాడు. అయితే చెడు సావాసాలు అతడిని చెడగొట్టాయి. పెళ్లిళ్లు చేసేవాడని, చాలామందికి సంబంధాలు కుదిర్చి మంచి పెళ్లిళ్ల పేరయ్యగా కూడా ఉండేవాడని సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుష్మా చవాన్ తెలిపారు. కొంత కాలానికి అతడికి మహ్మద్ ఇక్బాల్ షేక్, మదన్ విరాన్ స్వామి అనే ఇద్దరితో స్నేహం కుదిరింది. వాళ్లిద్దరి మీద ముంబై, థానె పోలీసు కమిషనరేట్లలో పలు కేసులున్నాయి. వాళ్లతో చేరిన గైక్వాడ్.. పగలు తన పని మామూలుగానే చేసుకుంటూ రాత్రిపూట మాత్రం వీళ్లిద్దరితో కలిసి దోపిడీలు చేసేవాడు. పూజారిగా ఉంటూ.. జనానికి పలు సామాజిక, ఆధ్యాత్మిక అంశాలలో సలహాలు కూడా ఇచ్చేవాడు. దాంతో ఎవరికీ అనుమానం రాలేదు. నాలుగైదేళ్ల పాటు ఈ రెండు వ్యవహారాలు ఎంచక్కా జరిగిపోయాయి. సుమారు ఏడాది క్రితం గైక్వాడ్ ఈ దోపిడీలు మానేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర కమీషన్ పద్ధతి మీద ఏజెంటుగా పని చేయడం మొదలుపెట్టాడు. అప్పటినుంచి రైల్వే క్వార్టర్స్ దగ్గర కుటుంబంతో ఉండేవాడు. సుమారు నెలరోజుల క్రితంవేరే దొంగతనం కేసులో పట్టుబడిన షేక్.. ఇతడి పేరును కూడా చెప్పడంతో పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు మొత్తం విషయం బయటపడింది.