thiefs attack
-
Viral Video: దొంగలతో మహిళా కానిస్టేబుళ్ల వీరోచిత పోరాటం
బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన దుండగులతో వీరోచితంగా పోరాడారు ఇద్దరు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు.. దొంగల పట్ల మహిళలు చూపిన ధైర్యం, తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని హాజీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెందూరి చౌక్‌లో ఉన్న ఉత్తర్ బిహార్ గ్రామీణ బ్యాంక్ వద్ద బ్యాంక్ వద్ద జుహీ కుమారీ, శాంతీ కుమారీ అనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ముగ్గురు వ్యక్తులు బ్యాంక్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో ఏ పనిమీద వచ్చారని జుహీ ప్రశ్నించింది. దీనికి వారు బ్యాంక్‌లో పని ఉందని చెప్పగా.. పాస్‌బుక్ చూపించమని అడిగింది. దీంతో ముగ్గురిలో ఓ వ్యక్తి రివాల్వర్ బయటకు తీశాడు. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు కానిస్టేబుళ్లు తమ తుపాకులతో వారిని నిలవురించారు. కానిస్టేబుళ్ల వద్ద ఉన్న తుపాకులను లాక్కోవడానికి దొంగల విఫల ప్రయత్నం చేశారు. దొంగల చేతిలో గన్ ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడలేదు. మహిళలిద్దరూ ముగ్గురు దుండగులపై సాహోసోపేతంగా పోరాడారు. అప్పటికే బ్యాంకులో దొంగతనం చేయడం కుదిరేలా లేదని భయపడ్డ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. పారిపోయిన దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దొంగలను ధైర్యంగా ఎదుర్కొని, తరిమికొట్టిన మహిళా కానిస్టేబుళ్లను బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని బ్యాంక్ దోపిడికి ప్రయత్నించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. సెందూరి వద్ద ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించారని.. తమ మహిళా కానిస్టేబుళ్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించి వారిని భయపెట్టగలిగారని సీనియర్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.. ఈ ఘటనలో ఎలాంటి కాల్పులు జరగలేదని.. కానిస్టేబుళ్లకు రివార్డ్ అందిస్తామని పేర్కొన్నారు. చదవండి: దారుణం.. బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిమీ ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. అరుస్తున్నా ఆపకుండా.. The Gallant act of two lady constables of Bihar Police is laudable. Their bravery thwarted an attempt of Bank Robbery in Vaishali.#Bihar_Police_Action_against_Criminal pic.twitter.com/M3Nn9w33Xw — Sawant Suman ساونت سمن 🇮🇳💙 (@SumanSawant) January 19, 2023 -
కరోనా సమయంలో రెచ్చిపోతున్న దొంగలు
సాక్షి, నిజామాబాద్ : కరోనా సమయంలో తమకు అనుకూలంగా మరల్చుకొని దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయ హుండీలే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆలయ హుండీలు ఎత్తుకెళ్లి నగదు చోరీ చేసి పొలాల్లో హుంండీలను వదిలేసి పరారవుతున్నారు. గ్రామంలోని హనుమాన్ పోలేరమ్మ సహా ఆరు ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. నవీపేట్ మండలంలో ఒకేరోజు 6 ఆలయాల్లో హుండీలను దోచుకెళ్లారు దుండగులు. ఆలయంలోని సీసీ టీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డు అయ్యింది. వరుస దొంగతనాలతో స్థానికులు భయందోళనకు గురువుతున్నారు. ఇక ఆలయాల్లో వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారింది. రోజూ ఏదో ఒక ప్రాంతంలో దొంగతానాలకు పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కరోనా నేపథ్యంలోనే చోరీలు జరుగుతున్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
పంజాగుట్టలో దోపిడి దొంగల హల్చల్
-
పంజాగుట్టలో దోపిడి దొంగల హల్చల్
సాక్షి, హైదరాబాద్ : పంజాగుట్టలో దోపిడి దొంగలు హల్చల్ చేశారు. ముగ్గురు మహిళలు నివాసం ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా చోరీకి ప్రయత్నించారు. అయితే దొంగలను అడ్డుకునేందుకు మహిళలు ప్రయత్నించారు. ఈ క్రమంలో దొంగ ఓ మహిళపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో మహిళ తలపై తీవ్రగాయలవ్వగా.. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. -
దొంగలు బాబోయ్...దొంగలు..
సాక్షి, గుంటూరు: జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు హడలిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని రాత్రి వేళల్లో దొంగలు తమ పనిని చక్కబెట్టుకుంటున్నారు. గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 రోజుల వ్యవధిలో వరుస దొంగతనాలు జరగడంతో పోలీసులు సైతం రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. ముఖ్యంగా జిల్లాలోని సత్తెనపల్లిలో వారం వ్యవధిలో ఎనిమిది చోట్ల దొంగతనాలు జరగడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రాత్రి గస్తీలు సక్రమంగా జరగకపోవడం వల్లే కొన్ని ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా రూరల్, అర్బన్ ఎస్పీలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)ను వినియోగించుకోవాలని పలు మార్లు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రజల్లో దీనిపై అవగాహన లేకపోవడంతో దీన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఊర్లకు వెళ్లి వచ్చేసరికి తమ విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు తెలుసుకుని లబోదిబో మంటున్నారు. జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలు మామూలు దొంగల పనా, లేక అంతర్రాష్ట్ర దొంగల ముఠా జిల్లాలో తిరుగుతుందా అనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు తెలిసింది. జిల్లాలో జరుగుతున్న దొంగతనాల తీరును పరిశీలిస్తే ఒక్కోటి ఒక్కో రకంగా ఉంది. దీంతో ఎవరు చేస్తున్నారో తెలియక పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి శివారు గ్రామమైన వెన్నాదేవిలో మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై దాడిచేసి దోచుకున్న సంఘటనపై పోలీసులు దృష్టి సారించారు. ఇద్దరు యువకులు ఈ నేరంలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. నిందితులిద్దరూ సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామానికి చెందిన వారని, కొంతకాలంగా సత్తెనపల్లిలో నివసిస్తున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు. నేరం జరిగిన తరువాత పరిణామాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం వేట ప్రారంభించారు. ఈ కేసు కొలిక్కి రాకముందే సత్తెనపల్లి పట్టణంలో బుధవారం రాత్రి రెండు గృహాల్లో చోరీలు జరగటం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. పట్టణంలోని వివేకానందనగర్‌లో నివసిస్తున్న పండ్ల వ్యాపారి కుంభా బుల్లయ్య బుధవారం రాత్రి డాబాపై నిద్రిస్తుండగా, గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20వేలు నగదు అపహరించుకు పోయారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో మున్నియ్య కిందకు రాగా, అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉండటం, బీరువా తలుపులు తీసి ఉండటంతో చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే సమీపంలోని బీబీనగర్‌లో ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ అబ్దుల్ రఫీ బెడ్రూములో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 12 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 50వేలు నగదు అపహరించి ఇంటి వెనుక నుంచి దుండగులు పరారయ్యారు. సత్తెనపల్లిలో వారం వ్యవధిలో ఎనిమిది దొంగతనాలు జరగడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. గుంటూరు నగరంలో సైతం నెల వ్యవధిలో పలు చోరీ ఘటనలు జరగడంతో పోలీసులు రాత్రి గస్తీని పటిష్టం చేశారు. బుచ్చయ్యతోటలో గత నెల 22వ తేదీన ఓ గృహంలో రూ.2.50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించారు. దొంగతనాలు జరిగిన గృహాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్ సిస్టంను ఉపయోగించుకోలేదని తెలుస్తోంది. ఎల్‌హెచ్‌ఎంఎస్ ఉపయోగించుకుని ఉంటే దొంగతనం జరగకుండా నివారించడంతోపాటు, వారిని పట్టుకునే అవకాశం ఉండేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై ప్రజల్లో ఇంకా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లే దీన్ని ఎవరూ వినియోగించడం లేదన్నది వాస్తవం. -
కెనరా బ్యాంక్‌లో చోరికి దుండగుల యత్నం
-
చైతన్యపురిలో దొంగల హల్చల్
చైతన్యపురి: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అపార్టుమెంట్లో చోరీకి యత్నించగా, వారిని పట్టుకోబోయిన వాచ్‌మన్‌పై రాళ్లతో దాడిచేసి పరారయ్యారు. ఇన్స్పెక్టర్ సుదర్శన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మోహన్‌నగర్‌లోని మల్లిక మెట్రో మనోహర్ అపార్ట్మెంటులో గురువారం రాత్రి నలుగురు అగంతకులు రెండో ఫ్లోర్‌లోని గన్‌శ్యాంకు చెందిన 203 ఫ్లాట్ తాళాలు పగుల గొట్టి లోపలికి జొరబడ్డారు. వారిలో ఒకరు వాచ్‌మన్ అనిల్‌కుమార్ ఇంటికి బయటి నుంచి గడియ పెట్టి అక్కడే కాపలాకాస్తున్నాడు. అలికిడి విన్న వాచ్‌మన్ బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా బయట గడియపెట్టి ఉండటంతో కేకలు వేశాడు. దీంతో బయటికి వచ్చిన ఓ మహిళ అగంతకుడుని గుర్తించి కేకలు వేయటంతో పై అంతస్తునుంచి నలుగురు కిందకు దిగి వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మన్ అనిల్‌పై రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. వాచ్మెన్ పిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సీసీ కెమెరలు పరిశీలించగా ఐదుగురు వ్యక్తులు చోరీకి యత్నిచినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చెవి నరికారు.. మెడ కోశారు
జీలుగుమిల్లి: ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై దుండగులు తెగబడ్డారు. చెవి దుద్దుల కోసం ఆమె చెవిని కత్తితో కోసేశారు. ముక్కు పుడక కోసం ముక్కును కోస్తుండగా ఆమె పెదవులు తెగిపోయాయి. బంగారు గొలుసు కోసం మెడ నరికారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములగలంపల్లి గ్రామానికి చెందిన 70 ఏళ్ల తొంట గంగా మహాలక్ష్మి ఒంటరిగా ఉంటోంది. ఆమె భర్త చాలాకాలం క్రితం మరణించాడు. ఆమె కుమారుడు, కుమార్తె వివాహాలు కావడంతో వేరే గ్రామాల్లో ఉంటున్నారు. దీంతో మహాలక్ష్మి గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి తెగబడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో చెవి దుద్దుల కోసం ఆమె చెవిని, ముక్కు పుడక కోసం పెదవులను, గొలుసు కోసం మెడను కత్తితో కోసేశారు. చెవిదుద్దులు, ముక్కుపుడక రాకపోవడంతో ఆమె మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఘటనలో వృద్ధురాలి చెయ్యి విరిగిపోయింది. వృద్ధురాలు తేరుకుని నల్లజర్ల మండలం దూబచర్లలో ఉంటున్న కుమారుడికి ఫోన్ చేయడంతో అతడితోపాటు బంధువులు వచ్చి ఆమెను జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై పి.బాలసురేష్ తెలిపారు. దొంగల ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. -
ఊరెళ్తే..ఊడ్చేశారు
కిటికీ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు రూ. 4 లక్షల విలువైన బంగారం, వెండి అపహరణ సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి ఇంటి యజమాని కమర్షియల్ ట్యాక్స్‌లో అసిస్టెంట్ కమిషనర్ ఒంగోలు క్రైం: నగరంలోని కర్నూలు రోడ్డు, ముంగమూరు రోడ్డుకు మధ్య ఉన్న సుందర్ నగర్లో ఓ ఇంట్లో దొంగలు చేతివాటం చూపారు. ఆ ఇంటి యజమాని కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయట శుభ్రం చేసేందుకు పనిమనిషి వచ్చింది. ఇంటి కిటికీ తొలగించి ఉండటాన్ని ఆమె గమనించింది. వెంటనే హైదరాబాద్‌లో ఉన్న యజమాని ఆర్.సదానందరావుకు విషయం చెప్పింది. హుటాహుటిన ఆయన బయల్దేరి బుధవారం మధ్యాహ్నానికే ఒంగోలు చేరుకున్నారు. తలుపులు తీసి లోనికి వెళ్లగా ఇల్లు మొత్తం చిందరవందరగా కనిపించింది. ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించి ఒంగోలు తాలూకా సీఐ ఎస్.ఆంటోనిరాజ్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. దొంగతనం చేసిన తీరును గమనించారు. ఇంటి యజమాని నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దొంగలు ప్రహరీ దూకి లోనికి ప్రవేశించి కిటికీ తొలగించారు. అత్యంత చాకచక్యంగా కిటికీకి ఉన్న ఇనుప బద్దెలు విరగ్గొట్టారు. ఇనుప ఫ్రేమ్‌ను కూడా బయటకు లాగేశారు. అనంతరం లోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగులగొట్టారు. అందులోని 12 సవర్ల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి వస్తువులు అపహరించుకుపోయారు. మూడు బెడ్రూముల్లోని అన్ని అలమరాలు చిందర వందర చేశారు. అనంతరం ఇంటి వెనుక తలుపు తీసుకొని దర్జాగా బయటకు వెళ్లిపోయారు. సంఘటన స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావులు వచ్చి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తుపై తాలూకా పోలీసులకు పలు సూచనలు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంటోనిరాజ్ తెలిపారు.