thimmapuram
-
ఇద్దరు బాలికలను బంధించిన యువకుడు.. మాయమాటలు చెప్పి!
సాక్షి, భువనగిరి: ఇద్దరు బాలికలను ఓ యువకుడు తన ఇంట్లో బంధించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండల పరిధిలోని బీఎన్ తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన మేడబోయిన యాకేష్ తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్నారు. పాఠశాలకు వెళ్లిన ఆ ఇద్దరు బాలికలు మధ్యాహ్నం తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వారికి మాయమాటలు చెప్పిన యాకేష్ తన ఇంటి ముందు నుంచి తాళం వేసి వెనుక వైపు నుంచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. కాగా సాయంత్రం వరకు బాలికలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. మధ్యాహ్నం బాలికలు యాకేష్ ఇంటికి వెళ్లినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాళం వేసి ఉన్న ఇంటి వెనుకకు వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం గుర్తించారు. దీంతో ఇంటి కిటికి అద్దాలను ధ్వంసం చేయగా బాలికలు అందులో ఉండడం చూసి కోపోద్రిక్తులై ఇంటి ఆవరణలో ఉన్న రెండు బైక్‌లకు నిప్పు పెట్టారు. ఇది గమనించిన యాకేష్ ఇద్దరు బాలికలను బయటకు పంపి తాను లోపలే ఉన్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి గ్రామస్తులు యాకేష్ ఇంటి ఎదుట పెద్దఎత్తున గూమిగూడారు. ఈ క్రమంలో యాకేష్పై గ్రామస్తులు దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేసి అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించే క్రమంలో కొంతమంది రాళ్లు విసరడంతో పోలీసు వాహనం అద్దాలు పగిలాయి. ఒక పోలీస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్థినులను పోలీస్ స్టేషన్‌కు తరలించి మహిళా పోలీసులతో విచారణ నిర్వహిస్తామని భువనగిరి రూరల్ సీఐ వెంకటేశం పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి దగ్ధమవుతున్న బైక్‌లను ఆర్పేశారు. -
మూడేళ్లుగా తమ్ముడి భార్యతోనే సహజీవనం.. కోపంతో మరదలిని
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త, పిల్లలను వదిలేసింది ఓ భార్య.. భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె అతనితో వెళ్లిపోయింది. చివరికి సహజీవనం చేస్తున్న బావే మరదలిని హతమార్చాడు. ఈ ఘటన కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అల్గునూర్‌లో మంగళవారం జరిగింది. ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్‌రెడ్డి వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రామ్‌కలి(25)కు భోజరాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల క్రితం రామ్ కలి, భోజరాజు అన్న శ్యామ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శ్యామ్‌కు పెళ్లి కాకపోవడంతో రామ్‌కలి భర్త, పిల్లలను వదిలేసి 15 రోజుల క్రితం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్‌కు వచ్చారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. విచక్షణ కోల్పోయి.. కరీంనగర్‌లోని ఓ వ్యాపారి వద్ద ఇద్దరూ మేస్త్రీ, కూలీగా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం రామ్ కలి, శ్యామ్ మద్యం తాగారు. ఈ సందర్భంగా రామ్ కలి శ్యామ్‌తో గొడవ పడింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన బావ పక్కనే ఉన్న కర్రతో ఆమెపై దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై ప్రమోద్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని ఏసీపీ కరుణాకర్‌రావు, సీఐ శశిధర్‌రెడ్డి పరిశీలించారు. హత్యకు పాల్పడిన నిందితుడితో మాట్లాడి కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గుంటూరులో రోడ్డు ప్రమాదం,నలుగురు మృతి
-
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, గుంటూరు : జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను అత్తులూరి బలరాం(25), ఫిరో అహ్మద్(35), వింజమూరి హరికృష్ణ(26), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తిమ్మాపురంలో ఎమ్మెల్యే అనితకు చేదు అనుభవం
-
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఎం.తిమ్మాపురం(మహానంది): తిమ్మాపురం గ్రామంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతంలో మృతి చెందాడు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎం.శ్రీనివాసులు(28) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఎస్సీలకు రూ.125కే విద్యుత్ మీటరు అందిస్తుండటంతో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. గురువారం స్తంభం నుంచి ఇంటికి లాగిన విద్యుత్ తీగకు సపోర్టుగా ఉన్న జీ వైర్ తీగ తెగి కింద పడింది. గమనించిన మూడేళ్ల కుమారుడు ప్రభాస్ ఇంట్లో ఉన్న తండ్రికి చెప్పాడు. ఆయన వచ్చి తీగను పక్కకు తీస్తుండగా అప్పటికే సర్వీసు వైర్‌కు పైన ఉన్న ప్లాస్టింగ్ కోటింగ్ పోయి లోపల ఉన్న తీగలకు జీవైర్ తగిలి విద్యుత్ ప్రసరించడంతో శ్రీనివాసులు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తండ్రి పక్కనే ఉన్న ప్రభాస్ కూడా విద్యుత్ ఘాతానికి గురై కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మొదట చిన్నారిని రక్షించారు. శ్రీనివాసులు చేతికి గాయాలౖయె పడిపోయి ఉన్నాడు. అతడిని నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఐదేళ్ల హర్ష, మూడేళ్ల కుమారుడు ప్రభాస్ ఉన్నారు. ప్రమాదానికి విద్యుత్ అధికారులు వినియోగించిన నాసిరకం తీగలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ రామకృష్ణుడు, విద్యుత్ ఏఈ ప్రభాకర్‌రెడ్డిలు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆపద్బుంధు పథకం కింద ఆర్థిక సహాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. -
తిమ్మాపూర్ లో వ్యక్తి అనుమానాస్పద మృతి
మోర్తాడ్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో బుధవారం ఉదయం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా మెట్‌పల్లికి చెందిన ధర్మమిత్ర (45) గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. గత కొంతకాలంగా తిమ్మాపూరంలో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం అతని శవం చెట్టుకు వేలాడుతుండగా స్థానికులు గమనించారు. మృతుని శరీరంపై గాయాలు ఉండడంతో దుండగులు కొట్టి చంపి తర్వాత చెట్టుకు వేలాడదీశారని అనుమానిస్తున్నారు. మోర్తాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.